రైల్వే మంత్రిత్వ శాఖ
ట్రాక్ వేగ సామర్థ్యాన్ని పెంచిన భారతీయ రైల్వే
· 79% రైల్వే మార్గాల్లో గంటకు 110 కి.మీ అంతకు మించిన వేగం
प्रविष्टि तिथि:
18 DEC 2025 2:48PM by PIB Hyderabad
రైలు మార్గాల వేగంలో సామర్థ్యాన్ని పెంచడం కోసం గత 11 సంవత్సరాలుగా భారీగా ఆధునికీకరణ, అభివృద్ధి చర్యలను భారతీయ రైల్వే చేపట్టింది. రైల్వే మార్గాల ఆధునికీకరణ కోసం 60 కేజీ పట్టాలు, అడుగు భాగంలో విశాలమైన కాంక్రీట్ స్లీపర్లు, మందపాటి వెబ్‌స్విచ్‌లు, పొడవైన రైలు ప్యానెళ్లు, హెచ్ బీమ్ స్లీపర్లు, ఆధునిక రైల్వే మార్గాల పునరుద్ధరణ - నిర్వహణ యంత్రాలు, లెవెల్ క్రాసింగ్ గేట్లను కలపడం, పట్టాల అమరికను నిరంతరం పర్యవేక్షించడం మొదలైన చర్యలను భారతీయ రైల్వే చేపట్టింది.
పై చర్యల ఫలితంగా రైల్వే ట్రాక్‌ల వేగ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. గంటకు 110 కి.మీ, అంతకు మించిన వేగ సామర్థ్యం ఉన్న రైల్వే ట్రాకులు మొత్తం.. 2014 మార్చిలో 40 శాతం ఉండగా, 2025 నవంబరులో 79 శాతానికి పెరిగాయి. 2014తో పోలిస్తే 2025 నాటికి రైల్వే ట్రాకుల వేగ సామర్థ్యానికి సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి:
|
Sectional Speed (kmph)
|
2014
|
2025
|
|
Track km
|
%
|
Track km
|
%
|
|
<110
|
47897
|
60.4
|
21936
|
20.7
|
|
110-130
|
26409
|
33.3
|
60726
|
57.5
|
|
130 & above
|
5036
|
6.3
|
23010
|
21.8
|
|
Total
|
79342
|
100
|
105672
|
100
|
లోకసభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన ఓ లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర రైల్వే, సమాచార - ప్రసార, ఎలక్ట్రానిక్స్ - సమాచార సాంకేతికత శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ సమాచారాన్ని అందించారు.
***
(रिलीज़ आईडी: 2206125)
आगंतुक पटल : 9