కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బెంగళూరులోని ఆచార్య ఇంజనీరింగ్ కళాశాలలో కర్ణాటక తొలి జెన్ జీ తపాలా కార్యాలయం

प्रविष्टि तिथि: 18 DEC 2025 2:54PM by PIB Hyderabad

కర్ణాటకలో తొలి జెన్ జీ తరం తపాలా కార్యాలయాన్ని భారత తపాలా శాఖ ప్రారంభించిందిబెంగళూరులోని అచార్య ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో అచిత్ నగర్ తపాలా కార్యాలయాన్ని పునరుద్దరిస్తూ దీనిని ఏర్పాటు చేశారుయువతకు అనుకూలంగాసాంకేతికత ఆధారంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రం.. డిజిటల్ సేవలుసృజనాత్మక రూపకల్పనప్రజల అనుసంధానాన్ని మిళితం చేస్తూ నేటితరం యువత అభిరుచులకు అనుగుణంగా రూపుదిద్దుకుంది.

జెన్ జీ తపాలా కార్యాలయం సాంప్రదాయ పోస్టాఫీసు భావనను తొలగిస్తూ.. ఆధునిక సౌకర్యాలతో అహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తోందిఇందులో వర్క్ కేఫేపుస్తకాలుబోర్డ్ గేమ్‌లతో కూడిన ‘‘బుక్-బూత్’’తో పాటు బెంగళూరు నగరంభారత తపాలా శాఖఆచార్య సంస్థ  సారాంశాన్ని ప్రతిబింబించేలా ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు చిత్రించిన కళాకృతులు ఉన్నాయిఇందులో ఉచిత వైఫైసౌకర్యవంతమైన కూర్చునే సదుపాయంల్యాప్‌టాప్‌లుఫోన్ల కోసం ఛార్జింగ్ పాయింట్లు,  కాఫీ తయారీ మెషిన్‌ వంటి సాకర్యాలు ఉన్నాయివిద్యార్థులే లక్ష్యంగా రూపొందించిన ఈ తపాలా కార్యాలయం పని ఉత్పాదకతతో పాటు సామాజిక పరస్పర చర్యలకు అనుకూలమైన వేదికగా నిలుస్తోంది.

వినియోగదారులు ఎవరి సహాయం లేకుండానే స్వయంగా సేవలను పొందేందుకు ఇక్కడ కియోస్క్ మిషన్లు అందుబాటులో ఉన్నాయిడిజిటల్ చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత తక్షణ చెల్లింపు సదుపాయం ఉందిఇది నేటి తరం యువత ఇష్టపడే డీఐవై పద్ధతికి అనుగుణంగా రూపొందించారుసందర్శకులు ‘‘మై స్టాంప్ కౌంటర్’’ లో ముద్రించిన వ్యక్తిగత స్టాంపులను కూడా పొందవచ్చు.

ఈ కార్యాలయం బెంగళూరు ఆచార్య టెక్నాలజీ ఇన‌స్టిట్యూట్ లో 2025 డిసెంబర్ 17న అధికారికంగా ప్రారంభమైందికర్ణాటక పోస్టల్ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ శ్రీ ప్రకాష్ఐపీఓఎస్ ముఖ్య అతిథిగాఆచార్య సంస్థల డైరెక్టర్  డాక్టర్ శ్రీ భాగీరథి వీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగిందిఈ సందర్భంగా  ప్రత్యేక రద్దు ముద్రతో కూడిన ఒక పోస్ట్‌ కార్డును కూడా విడుదల చేశారు.

జెన్ జీ తరం తపాలా కార్యాలయం గురించి బెంగళూరు పశ్చిమ డివిజన్ పోస్టు శాఖ సీనియర్ అధికారి సూరయ మాట్లాడుతూ..  “ఈ తపాలా కార్యాలయాన్ని అధికారులతోపాటు  విద్యార్థుల భాగస్వామ్యంతో రూపొందించారుదీని రూపకల్పన  ఎలా ఉండాలో నిర్ణయించడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారుజెన్ జీ తరం విలువలనుసృజనాత్మకతను ఇది ప్రతిబింబిస్తుందిఈ కార్యక్రమం ‘విద్యార్థుల ద్వారావిద్యార్థుల కోసంవిద్యార్థుల చేత’ అనే నినాదంతో సాగిందిఈ పోస్టాఫీసు పార్శిల్ ప్యాకేజింగ్ సేవలను కూడా అందిస్తుందిఇది విద్యార్థుల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా ఒత్తిడిని తగ్గిస్తుందితమ వస్తువులను నేరుగా చదువుతున్న ప్రాంతం నుంచి తరలించడంరవాణా చేయడం సులభమవుతుంది.

దేశవ్యాప్తంగా విద్యా సంస్థల్లో ఇలాంటి జెన్ జీ నేపథ్య పోస్టాఫీసులను విస్తరించడానికి భారత తపాలాశాఖ ప్రణాళికలు రూపొందిస్తోందితద్వారా తపాలా సేవలను మరింత సులభంగాఆకర్షణీయంగా  భవిష్యత్తుకు అనుగుణంగా మార్చేందుకు సాధ్యం అవుతుంది.

సాంకేతికతఆధునిక డిజైన్యువతతో నేరుగ మమేకమవవడం ద్వారా భారత తపాల శాఖ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటోందికేవలం సంప్రదాయ సమాచార వ్యవస్థగానే కాకుండా ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఆధునికఅనుసంధానితవిద్యార్థులకు అనుకూలమైన కేంద్రంగా మారుతోంది.

 

***


(रिलीज़ आईडी: 2206123) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil