నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్‌లోని ఓడరేవుల్లో అమల్లోకి వచ్చిన బిల్స్ ఆఫ్ లేడింగ్ యాక్టు - 2025

प्रविष्टि तिथि: 17 DEC 2025 2:56PM by PIB Hyderabad

అన్ని ఓడరేవులకూ వర్తించే బిల్స్ ఆఫ్ లేడింగ్ యాక్టు-2025ను 2025 సెప్టెంబరు 10 నుంచి అమలులోకి తీసుకువచ్చారు. ఈ చట్టంలో నిబంధనలను వివరించే భాషను సులభతరం చేశారు. స్పష్టతను పెంచుతూ, సులభంగా అర్థం అయ్యేటట్లు తీర్చిదిద్దారు. విశాఖపట్నం, కాకినాడ సహా అన్ని ఓడరేవుల్లో ఆధునిక వస్తు రవాణా వ్యవస్థను మెరుగుపరిచే దృష్టితో, ఈ చట్టాన్ని అమలు చేయడంలో ఎలాంటి ఇబ్బందులూ ఎదురు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ సమాచారాన్ని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.


(रिलीज़ आईडी: 2205270) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी