ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఆధార్ సంఖ్యదారుల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించేందుకు సమగ్ర భద్రతా చర్యలు
యూఐడీఏఐ డేటాబేస్ నుంచి ఇప్పటి వరకు ఆధార్ వినియోగదారుల సమాచారం ఉల్లంఘన జరగలేదు
प्रविष्टि तिथि:
17 DEC 2025 12:53PM by PIB Hyderabad
ఆధార్ ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థగా నిలిచింది. సుమారు 134 కోట్ల మంది
క్రియాశీల ఆధార్ కార్డుదారులు ఉన్నారు. ఇప్పటి వరకు ఆధార్ 16,000 కోట్లకు పైగా ధ్రువీకరణ లావాదేవీలను పూర్తి చేసింది.
ఆధార్ జారీ చేసే బాధ్యత కలిగిన భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ).. ఆధార్ సంఖ్య దారుల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించేందుకు సమగ్ర భద్రత చర్యలను అమల్లోకి తీసుకొచ్చింది..
· ఆధార్ వ్యవస్థ ‘‘డిఫెన్స్-ఇన్-డెప్త్’’ అనే సూత్రం ఆధారంగా డేటాబేస్ను రక్షించడానికి బహుళ-స్థాయి భద్రతా చర్యలను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థలను రక్షించడానికి నిరంతరం సమీక్షలు, ఆడిట్లను నిర్వహిస్తుంది.
· సమాచారం ఒక చోటు నుంచి మరొక చోటుకు బదిలీ అవుతున్నప్పుడు, సర్వర్లలో నిల్వ ఉన్నప్పుడు డేటాను రక్షించేందుకు అత్యంత అధునాతన ఎన్క్రిప్షన్ సాంకేతికతను ఉపయోగిస్తుంది.
· యూఐడీఏఐ భద్రత, గోప్యత విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తోంది.
ఐఎస్ఓ 27001:2022: సమాచార భద్రతా నిర్వహణ వ్యవస్థకు సంబంధించి ఎస్ టీక్యూసీ నుంచి ధ్రువీకరణ పొందింది. ఐఎస్ఓ/ఐఈసీ 27701:2019: వ్యక్తిగత సమాచార గోప్యత నిర్వహణ వ్యవస్థ కోసం ఈ అంతర్జాతీయ ధ్రువీకరణ పొందింది.
· భారత ప్రభుత్వం ఆధార్ను రక్షిత వ్యవస్థగా ప్రకటించింది. జాతీయ కీలక సమాచార మౌలిక వసతుల రక్షణ కేంద్రం (ఎన్ సీఐఐపీసీ) నిరంతరం నిఘా ఉంచుతూ, సైబర్ భద్రతను మెరుగుపరచడానికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తుంది.
ఆధార్ వ్యవస్థ కోసం గవర్నెన్స్, రిస్క్, కంప్లయన్స్ అండ్ పెర్ఫార్మెన్స్ (జీఆర్ సీపీ) ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి, దాని అమలుపై పర్యవేక్షణ కోసం ఒక స్వతంత్ర ఆడిట్ సంస్థను నియమించింది.
ఈ సంస్థ యూఐడీఏఐ అప్లికేషన్పై నిరంతరంగా సైబర్ భద్రతా ఆడిట్లు నిర్వహిస్తుంది. ఇందులో స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ (ఎస్ఏఎస్ టీ), డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ (డీఏఎస్ టీ) కూడా ఉన్నాయి.
ఇప్పటివరకు యూఐడీఏఐ డేటాబేస్ నుంచి ఆధార్ కార్డుదారుల సమాచారం ఉల్లంఘన జరిగన దాఖలు లేవు.
ఈ సమాచారాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద నేడు లోక్సభలో సమర్పించారు.
***
(रिलीज़ आईडी: 2205250)
आगंतुक पटल : 14