మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
‘జాతీయ గోపాల రత్న’ పురస్కారం
प्रविष्टि तिथि:
16 DEC 2025 3:08PM by PIB Hyderabad
‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’ కింద దేశీయ ఆవు-గేదె జాతుల పశుపోషణలోగల రైతులు, పాడి సహకార సంఘాలు, పాల-రైతు ఉత్పత్తిదారు సంస్థలు, కృత్రిమ గర్భధారణ సాంకేతిక నిపుణులను ప్రోత్సహించే లక్ష్యంతో మత్స్య-పశుసంవర్ధక-పాడి పరిశ్రమల మంత్రిత్వశాఖ ‘జాతీయ గోపాల రత్న’ అవార్డు (ఎన్జీఆర్ఏ) ప్రదానం చేస్తోంది. ఈ మేరకు నమోదిత (53 రకాల ఆవులు, 20 రకాల గేదెల జాబితాను అనుబంధంలో చూడవచ్చు) జాతుల పెంపకం చేపట్టిన వారికి 2021 నుంచి ఏటా కింద పేర్కొన్న కేటగిరీలలో ఈ పురస్కార ప్రదానం చేస్తోంది:
I. దేశీయ ఆవు లేదా గేదె జాతులను పెంచే ఉత్తమ పాడి రైతు
II. ఉత్తమ పాడి సహకార సంఘం (డీసీఎస్), పాల ఉత్పత్తి సంస్థ (ఎంపీసీ), పాడి రైతు ఉత్పత్తిదారు సంస్థ (ఎఫ్‌పీఓ).
III. ఉత్తమ కృత్రిమ గర్భధారణ సాంకేతిక నిపుణుడు (ఏఐటీ).
మరోవైపు ఈశాన్య భారత ప్రాంతం (ఎన్‌ఈఆర్)లో పాడి పరిశ్రమాభివృద్ధి కార్యకలాపాల పెంపు, ప్రోత్సాహం దిశగా 2024లో ఒక ప్రత్యేక పురస్కారాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అటుపైన 2025 నుంచి హిమాలయ రాష్ట్రాలను కూడా ఇందులో చేర్చింది. పైన పేర్కొన్న ప్రతి విభాగంలో 1, 2, 3 స్థానాల్లో నిలిచే వారితోపాటు ‘ఎన్‌ఈఆర్’, హిమాలయ రాష్ట్రాలకు ఉద్దేశించిన ‘ఎన్‌జీఆర్’ ప్రత్యేక పురస్కారాన్ని కూడా ప్రదానం చేస్తున్నారు. దీనికింద ప్రశంసపత్రం, జ్ఞాపిక, నగదు బహుమతి అందజేస్తారు. ఈ మేరకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షలు వంతున నగదును బహూకరిస్తారు. ఇక ‘ఎన్‌ఈఆర్’, హిమాలయ రాష్ట్రాల పరిధిలో ఉత్తమ పాడి రైతు, ఉత్తమ డీసీఎస్-ఎఫ్‌పీఓ-ఎంపీసీ విభాగాల్లో ప్రత్యేక అవార్డు కింద రూ.2లక్షల నగదు బహుమతి అందజేస్తారు. ఉత్తమ కృత్రిమ గర్భధారణ సాంకేతిక నిపుణుల విభాగం పురస్కారంలో ప్రశంసపత్రం, జ్ఞాపిక ఉంటాయి తప్ప నగదు బహుమతి ఉండదు.
ఈ అవార్డు కోసం నేషనల్ అవార్డ్ పోర్టల్ https://awards.gov.in ద్వారా నామినేషన్లను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. జాతీయ పాడి దినోత్సవం సందర్భంగా ఏటా నవంబరు 26న అవార్డుల ప్రదానం నిర్వహిస్తారు.
ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా దేశీయ ఆవు, గేదె జాతులను పెంచుతున్న ఉత్తమ పాడి రైతు విభాగంలో ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాల వారికి ఇచ్చే ప్రత్యేక అవార్డు సహా మొత్తం 21 మంది పాడి రైతులు సత్కారం పొందారు.
కేంద్ర మత్స్య-పశుసంవర్ధక-పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లల్లన్ సింగ్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.
****
Annexure
Registered Breeds of Cattle (For NGRA)
|
S.N.
|
Breed
|
Home Tract
|
|
1
|
Amritmahal
|
Karnataka
|
|
2
|
Bachaur
|
Bihar
|
|
3
|
Bargur
|
Tamilnadu
|
|
4
|
Dangi
|
Maharashtra and Madhya Pradesh
|
|
5
|
Deoni
|
Maharashtra and Karnataka
|
|
6
|
Gaolao
|
Maharashtra and Madhya Pradesh
|
|
7
|
Gir
|
Gujarat
|
|
8
|
Hallikar
|
Karnataka
|
|
9
|
Hariana
|
Haryana, Uttar Pradesh and Rajasthan
|
|
10
|
Kangayam
|
Tamilnadu
|
|
11
|
Kankrej
|
Gujarat and Rajasthan
|
|
12
|
Kenkatha
|
Uttar Pradesh and Madhya Pradesh
|
|
13
|
Kherigarh
|
Uttar Pradesh
|
|
14
|
Khillar
|
Maharashtra and Karnataka
|
|
15
|
Krishna Valley
|
Karnataka
|
|
16
|
Malvi
|
Madhya Pradesh
|
|
17
|
Mewati
|
Rajasthan, Haryana and Uttar Pradesh
|
|
18
|
Nagori
|
Rajasthan
|
|
19
|
Nimari
|
Madhya Pradesh
|
|
20
|
Ongole
|
Andhra Pradesh
|
|
21
|
Ponwar
|
Uttar Pradesh
|
|
22
|
Punganur
|
Andhra Pradesh
|
|
23
|
Rathi
|
Rajasthan
|
|
24
|
Red Kandhari
|
Maharashtra
|
|
25
|
Red Sindhi
|
On organized farms only
|
|
26
|
Sahiwal
|
Punjab and Rajasthan
|
|
27
|
Siri
|
Sikkim and West Bengal
|
|
28
|
Tharparkar
|
Rajasthan
|
|
29
|
Umblachery
|
Tamilnadu
|
|
30
|
Vechur
|
Kerala
|
|
31
|
Motu
|
Orissa, Chhattisgarh and Andhra Pradesh
|
|
32
|
Ghumusari
|
Orissa
|
|
33
|
Binjharpuri
|
Orissa
|
|
34
|
Khariar
|
Orissa
|
|
35
|
Pulikulam
|
Tamilnadu
|
|
36
|
Kosali
|
Chhattisgarh
|
|
37
|
Malnad Gidda
|
Karnataka
|
|
38
|
Belahi
|
Haryana and Chandigarh
|
|
39
|
Gangatiri
|
Uttar Pradesh and Bihar
|
|
40
|
Badri
|
Uttarakhand
|
|
41
|
Lakhimi
|
Assam
|
|
42
|
Ladakhi
|
Jammu and Kashmir
|
|
43
|
Konkan Kapila
|
Maharashtra and Goa
|
|
44
|
PodaThurpu
|
Telangana
|
|
45
|
Nari
|
Rajasthan and Gujarat
|
|
46
|
Dagri
|
Gujarat
|
|
47
|
Thutho
|
Nagaland
|
|
48
|
Shweta Kapila
|
Goa
|
|
49
|
Himachali Pahari
|
Himachal Pradesh
|
|
50
|
Purnea
|
Bihar
|
|
51
|
Kathani
|
Maharashtra
|
|
52
|
Sanchori
|
Rajasthan
|
|
53
|
Masilum
|
Meghalaya
|
Registered Breeds of Buffalo (For NGRA)
|
Sr. No
|
Breed
|
Home Tract
|
|
1
|
Bhadawari
|
Uttar Pradesh and Madhya Pradesh
|
|
2
|
Jaffarabadi
|
Gujrat
|
|
3
|
Marathwadi
|
Maharashtra
|
|
4
|
Mehsana
|
Gujarat
|
|
5
|
Murrah
|
Haryana
|
|
6
|
Nagpuri
|
Maharashtra
|
|
7
|
Nili Ravi
|
Punjab
|
|
8
|
Pandharpuri
|
Maharashtra
|
|
9
|
Surti
|
Gujarat
|
|
10
|
Toda
|
Tamilnadu
|
|
11
|
Banni
|
Gujarat
|
|
12
|
Chilika
|
Orissa
|
|
13
|
Kalahandi
|
Odisha
|
|
14
|
Luit (Swamp)
|
Assam and Manipur
|
|
15
|
Bargur
|
Tamil Nadu
|
|
16
|
Chhattisgarhi
|
Chhattisgarh
|
|
17
|
Gojri
|
Punjab and Himachal Pradesh
|
|
18
|
Dharwadi
|
Karnataka
|
|
19
|
Manda
|
Odisha
|
|
20
|
Purnathadi
|
Maharashtra
|
****
(रिलीज़ आईडी: 2204933)
आगंतुक पटल : 11