రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత రాష్ట్రపతి నుంచి జాతీయ ఇంధన సంరక్షణ అవార్డు-2025ను అందుకున్న మియానా రైల్వేస్టేషన్


గుణలోని మియానా స్టేషన్‌లో ఎల్‌ఈడీ లైటింగ్, బీఎల్‌డీసీ ఫ్యాన్లు, స్మార్ట్‌ లైటింగ్‌ సిస్టమ్స్‌ ద్వారా 9,687 యూనిట్ల విద్యుత్ ఆదా

నాడు పోస్టు చేయడమైనది: 15 DEC 2025 6:59PM by PIB Hyderabad

ఇంధన సంరక్షణలో భారతీయ రైల్వే కీలక ఘట్టాన్ని చేరుకుందిజాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాల మియానా రైల్వే స్టేషన్‌కు జాతీయ ఇంధన సంరక్షణ అవార్డు-2025ను గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము అందజేశారుపశ్చిమ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీమతి శోభనా బందోపాధ్యాయ ఈ అవార్డును అందుకున్నారురవాణా విభాగం (రైల్వేస్టేషన్)లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన యూనిట్‌గా మియానా రైల్వేస్టేషన్‌కు గుర్తింపు లభించింది.

ఈ అవార్డును ఎనర్జీ ఎఫిషియెన్సీ బ్యూరో (బీఈఈఅందిస్తుందిఇంధన సంరక్షణలో అత్యుత్తమ కృషి చేసినందుకు ఈ పురస్కారం ద్వారా సత్కరిస్తుందిఎల్‌ఈడీ లైటింగ్బీఎల్‌డీసీ ఫ్యాన్లు, 30 నుంచి 70% స్మార్ట్ లైటింగ్ సర్య్కూట్ ఆపరేషన్ వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించినందుకుగానూ మియానా రైల్వేస్టేషన్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారుఈ చర్యల ద్వారా 9,687 యూనిట్ల విద్యుత్‌ను స్టేషన్ ఆదా చేయగలిగిందిదీనిద్వారా ఇంధన సామర్థ్యంసుస్థిరాభివృద్ధిపై భారత రైల్వే దృష్టి సారిస్తుందని స్పష్టమవుతోంది.

ఇంధన పొదుపువ్యయ నియంత్రణపర్యావరణ అనుకూల కార్యకలాపాలకు భారతీయ రైల్వే ప్రాధాన్యతనిస్తుందిఈ విధానాల సమర్థవంతమైన అమలుసుస్థిరాభివృద్ధికి మియనా రైల్వేస్టేషన్ ఆదర్శంగా నిలిచింది


(రిలీజ్ ఐడి: 2204505) సందర్శకుల సూచీ సంఖ్య : : 27
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Odia