ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని ప్రకటన

प्रविष्टि तिथि: 15 DEC 2025 8:15AM by PIB Hyderabad

ఈ రోజు నేను మూడు దేశాలుహాషెమైట్ కింగ్డమ్ ఆఫ్ జోర్డాన్ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇథియోపియాఒమన్ సుల్తానేట్‌లో పర్యటించేందుకు బయలుదేరి వెళుతున్నానుఈ మూడు దేశాలతోనూ భారత్‌కు ప్రాచీన నాగరిక సంబంధాలుసమకాలీన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి.

ముందుగాజోర్డాన్ రాజు అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటిస్తానుఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని ఈ చారిత్రక పర్యటన సూచిస్తుందిపర్యటనలో భాగంగారాజు అబ్దులా II ఇబ్న్ అల్ హుస్సేన్‌జోర్డాన్ ప్రధాని జాఫర్ హసన్‌తో విస్తృత చర్చలు చేపడతానుఅలాగే యువరాజు అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా IIతో సమావేశమయ్యేందుకు ఎదురు చూస్తున్నానుభారత్-జోర్డాన్ సంబంధాలకు గణనీయమైన సహకారాన్ని అందిస్తున్న ప్రవాస భారతీయులతో అమ్మాన్‌లో ముచ్చటిస్తాను.

అమ్మాన్ నుంచి ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబియ్ అహ్మద్ ఆలీ ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళతానుఫెడరల్ డెమెక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇథియోపియాను నేను సందర్శించడం ఇదే మొదటిసారిఆఫ్రికన్ యూనియన్‌కు అడీస్ అబాబా ప్రధాన కేంద్రంగా ఉంది. 2023లో జీ20కి భారత్ అధ్యక్షత వహించిన సమయంలో ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం లభించిందిడాక్టర్ అబియ్ అహ్మద్ ఆలీతో అడీస్ అబాబాలో విస్తృత చర్చలు నిర్వహిస్తానుఅలాగే ఇక్కడ ఉన్న భారతీయ సంతతి ప్రజలతో సమావేశమవుతానునాకు పార్లమెంట్ సంయుక్త సభను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం లభించిందిఇక్కడ ‘‘ప్రజాస్వామ్యానికి తల్లి’’గా భారత్ సాగిస్తున్న ప్రయాణంపై నా ఆలోచనలను పంచుకొనేందుకుగ్లోబల్ సౌత్‌కు ఇండియా-ఇథియోపియా భాగస్వామ్యం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

ఈ ప్రయాణంలో చివరిగాఒమన్ సుల్తానేట్‌ను నేను సందర్శిస్తానుభారత్ఒమన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పాటై 70 ఏళ్లు పూర్తయిన నేపథ్యాన్ని నా పర్యటన సూచిస్తుందిఒమన్ సుల్తాన్‌తో మస్కట్‌లో సమావేశమయ్యేందుకుమన వ్యూహాత్మక భాగస్వామ్యాన్నిబలమైన వాణిజ్యఆర్థిక సంబంధాలను బలోపేతం చేసేందుకు నేను ఎదురుచూస్తున్నానుమన దేశాభివృద్ధికిరెండు దేశాల మధ్య భాగస్వామాన్ని విస్తరించేందుకు కృషి చేస్తున్న ఒమన్‌లోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తాను.

 

***


(रिलीज़ आईडी: 2204192) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam