పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రామాయణ సాంస్కృతిక పర్యాటక కారిడార్

నాడు పోస్టు చేయడమైనది: 11 DEC 2025 2:37PM by PIB Hyderabad

ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకం సహా దేశంలో వివిధ పర్యటన ప్రధాన సేవలను పర్యాటక శాఖ ప్రోత్సహిస్తోంది. ఈ ప్రోత్సాహక చర్యల్లో.. ప్రచార యాత్రా కార్యక్రమాలనూ, ప్రదర్శనలనూ నిర్వహించడంతో పాటు వాటిలో పాలుపంచుకోవడం; మేళాలూ, ఉత్సవాలూ నిర్వహించడంలో రాష్ట్రాల ప్రభుత్వాలకూ, కేంద్ర పాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాలకూ సాయాన్ని అందించడం; ఆతిథ్య కార్యక్రమంలో భాగంగా ప్రభావశాలి వ్యక్తులనూ, టూర్ ఆపరేటర్లనూ, పాత్రికేయులనూ, అభిప్రాయాన్ని ఏర్పరచగలిగేవారినీ దేశంలో పర్యటించాల్సిందిగా ఆహ్వానించడం; రాష్ట్ర ప్రభుత్వాలు, విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల సహకారంతో వెబ్‌సైట్, సామాజిక ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేయడం ద్వారా వివిధ ప్రజాసంబంధాల కార్యక్రమాల అమలు వంటి ప్రణాళికలు భాగంగా ఉన్నాయి.    
ప్రధానమంత్రి జన్‌జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ (పీఎం‌జేయూజీఏ)లో భాగంగా ‘గిరిజన ప్రాంతాల్లో అతిథి సదుపాయాల (హోంస్టేస్) అభివృద్ధి’కి పర్యాటక శాఖ మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. ఇది స్వదేశ్ దర్శన్ పరిధిలో ఓ ఉప పథకం. గిరిజన ప్రాంతాల్లో అతిథుల కోసం సదుపాయాలను పెంపొందించడం ఈ పథకం లక్ష్యంగా ఉంది. ఇది బాధ్యతాయుత పర్యటనకు దన్నుగా నిలవడానికి తోడ్పడుతుంది. గిరిజనులకు బతుకుతెరువు అవకాశాలను వీటితో పెంచవచ్చు. గిరిజన గ్రామాల్లో నాణ్యమైన పర్యటన ప్రణాళికలను అవలంబించేలా వాటాదారులను ప్రోత్సహించవచ్చు. ఈ పథకంలో గ్రామ సముదాయాల అవసరాల కోసం రూ.5 లక్షల వరకూ, 2 కొత్త గదులను నిర్మించడానికి రూ.5 లక్షల వరకూ, అలాగే ప్రతి ఒక్క కుటుంబానికీ ప్రస్తుతం ఉన్న గదులను నవీకరించడానికి రూ.3 లక్షల వరకూ ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు.
దీనికి అదనంగా, గ్రామీణ ప్రాంతాలు సహా దేశమంతటా అతిథి సదుపాయాలను ఏర్పాటు చేయడానికి సాయాన్ని అందించి ప్రోత్సహించడానికి ముద్రా రుణాల రూపంలో పూచీకత్తు అక్కర్లేకుండా సంస్థాగత రుణమివ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం 2025-26లో బడ్జెట్‌లో ప్రకటించింది.
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2202671) సందర్శకుల సూచీ సంఖ్య : : 21
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी