గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత మైనింగ్ సామర్థ్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ప్రవాస భారతీయుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి

प्रविष्टि तिथि: 11 DEC 2025 5:18PM by PIB Hyderabad

జైపూర్‌లో బుధవారం జరిగిన ప్రవాస రాజస్థానీ దినోత్సవ వేడుకల్లో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

స్వదేశానికి దూరంగా నివసిస్తున్నప్పటికీప్రవాస భారతీయులు దేశంతో గాఢమైన బంధాన్ని కలిగి ఉన్నారని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి పేర్కొన్నారుప్రవాస భారతీయులందరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారుప్రవాసీలు కేవలం విదేశీ మారక ద్రవ్యాన్ని పంపడమే కాకుండాపెట్టుబడులునూతన ఆవిష్కరణలుకొత్త అవకాశాలను  తీసుకువస్తూ దేశానికి ఎంతో సహాయపడుతున్నారని ఆయన అన్నారుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రవాస భారతీయులను ‘‘దేశ రాయబారులు’’గా అభివర్ణించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. వారు భారతదేశ ప్రతిష్టనువిలువలనుసామర్థ్యాన్ని ప్రపంచంలోని ప్రతి మూలకు తీసుకువెళ్తున్నారని అన్నారురాజస్థాన్‌తో పాటు యావత్ దేశ గనుల తవ్వకాల సామర్థ్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ప్రవాస భారతీయుల పాత్ర కీలకమని మంత్రి పేర్కొన్నారు.

రాజస్థాన్ లోని విస్తారమైన సహజ వనరులను ప్రస్తావిస్తూ.. దేశ సాంస్కృతిక వారసత్వానికి రాష్ట్రం ఆభరణం మాత్రమే కాకుండాగనుల వారసత్వానికి కూడా ఒక నిధిగా మారిందని శ్రీ జీ కిషన్ రెడ్డి చెప్పారుపురాతన కాలం నుంచి రాజస్థాన్ ఖనిజాల వెలికితీతగనుల తవ్వకం సాంకేతికతలో అగ్రగామిగా ఉందని పేర్కొన్నారునేటికి దేశ ఖనిజ భద్రతకు రాజస్థాన్ వెన్నెముకగా నిలుస్తోందని అన్నారుపాలరాయిగ్రానైట్ఇసుకరాయిస్లేట్ వంటి వాటిని ఉత్పత్తిఎగుమతి చేయడంలో రాష్ట్రం ముందంజలో నిలుస్తుందన్నారు.

దేశంలో మైనింగ్‌ రంగం నేడు సహకారపోటీ సమాఖ్యవాద సూత్రాల ఆధారంగా నడుస్తోందనిఇది దేశ ఖనిజ భద్రతకువృద్ధి సామర్థ్యానికి పునాదిగా మారిందని మంత్రి పేర్కొన్నారుప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో మైనింగ్ రంగం చారిత్రాత్మక సంస్కరణలను చూసిందన్నారుపారదర్శక వేలం వ్యవస్థను ప్రవేశపెట్టడంప్రైవేటు రంగాన్ని పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయడంఅన్వేషణలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతివ్యాపారం సులభతరం చేయడంలో గణనీయమైన మెరుగుదల వంటివి ఉన్నాయని చెప్పారు.

కొత్త పెట్టుబడులుఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వాడకం దేశ మైనింగ్‌ రంగంలో గణనీయమైన అవకాశాలను అందిస్తుందని శ్రీ జీ కిషన్‌ రెడ్డి తెలిపారుజాతీయ కీలక ఖనిజాల మిషన్ కోసం రూ.34,300 కోట్లు కేటాయించినట్లు చెప్పారుఇది కీలక ఖనిజాల అన్వేషణలో దేశాన్నిస్వావలంబనగా మార్చేందుకు దోహదపడుతుందన్నారుమొదటిసారిగా అన్వేషణ లైసెన్స్‌లను వేలం వేశారనిఏడు బ్లాకులను విజయవంతంగా వేలం వేయడంతో ఈ ప్రయత్నం ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచుతుందనిదేశంలో అన్వేషణ ప్రయత్నాలను వేగవంతం చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారుప్రభుత్వం ప్రారంభించిన రూ1,500 కోట్ల రీసైక్లింగ్ పథకం ద్వారా వార్షికంగా 3 లక్షల టన్నుల సామర్థ్యాన్ని సృష్టించడం,  2030 నాటికి సుమారు 40,000 టన్నుల కీలక ఖనిజాల పునరుద్ధరణను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి పేర్కొన్నారు.

ఇటీవలి సంవత్సరాల్లో దేశంలో బొగ్గు రంగం పూర్తిగా మారిపోయిందని కేంద్రమంత్రి పేర్కొన్నారువాణిజ్య బొగ్గు తవ్వకం ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచిందనిదీని వల్ల అధిక ఉత్పత్తిబలమైన పోటీమెరుగైన కార్యాచరణ సామర్థ్యం ఏర్పడిందన్నారుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో బొగ్గు గ్యాసిఫికేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించామని,  గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది సహకరిస్తుందని తెలిపారుదేశంలో తొలిసారి భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ బ్లాక్‌లను కూడా వేలం వేశారని మంత్రి చెప్పారు.

దేశ మైనింగ్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులకుఅంతర్జాతీయ పోటీ సామర్థ్యానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారుఈ అవకాశాలను సాకారం చేసుకోవడంలో ప్రవాస భారతీయుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి స్పష్టం చెశారుభారత మైనింగ్ రంగం అపారమైన అవకాశాల ముంగిట నిలబడి ఉందనిదీనికి ప్రవాసుల శక్తిదార్శనికత,ప్రపంచ అనుభవం అవసరమని అన్నారుభారత వ్యూహాత్మక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి విదేశాల్లో కీలక ఖనిజాల సేకరణలో కబిల్‌ వంటి సంస్థలతో కకలిసి పనిచేయాలని వారిని ప్రోత్సహించారురాజస్థాన్‌ను అవకాశాల రాజధానిగాభారత్‌ను ప్రపంచ మైనింగ్ శక్తిగా మార్చడంలో భాగస్వామ్యం అవ్వాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు పిలుపునిస్తూ కేంద్రమంత్రి శ్రీ జీ కిషన్‌ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.


(रिलीज़ आईडी: 2202667) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी