సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తెలంగాణలో పీఏసీఎస్‌ల బలోపేతం

प्रविष्टि तिथि: 10 DEC 2025 6:44PM by PIB Hyderabad

(ఎ): భారత ప్రభుత్వ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎస్‌) కంప్యూటరీకరణ పథకంలో తెలంగాణ ఇప్పటి వరకు భాగం కాలేదు. అయితే రాష్ట్రం నుంచి అందిన సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ప్రాజెక్టులో 830 పీఏసీలు భాగమయ్యాయి.

(బి): రాష్ట్రం నుంచి అందిన సమాచారం ప్రకారం క్రెడిట్ కాని వ్యాపార లావాదేవీల వివరాలు ఇలా ఉన్నాయి. పీఏసీఎస్‌లో వరి సేకరణ 14.45 లక్షల మెట్రిక్ టన్నులు  ఉండగా.. వ్యాపారం విలువ రూ. 13,974 కోట్లు ఉంది. ఎరువులు, విత్తనాల పంపిణీ అమ్మకం 13.25 లక్షల మెట్రిక్ టన్నులు కాగా.. వ్యాపారం విలువ రూ. 29,390.37 కోట్లుగా ఉంది. 2023-25 మధ్య పీఏసీఎస్‌ల ద్వారా నేరుగా రైతులకు అందించే రుణాల పంపిణీ రూ. 14,651 కోట్లుగా ఉంది.

(సి): అవును. తెలంగాణ నుంచి అందిన సమాచారం ప్రకారం ప్రతి ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర శాఖకు చెందిన ఆడిటర్లు ఆడిట్ నిర్వహిస్తున్నారు. అలాగే ప్రధాన ఆడిటర్ తరచుగా సమీక్షలు కూడా చేస్తున్నారు.

(డి): రాష్ట్రం నుంచి అందిన సమాచారం ప్రకారం తెలంగాణలోని పీఏసీఎస్‌ కంప్యూటరీకరణకు తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టీజీసీఏబీ) ప్రధాన సంస్థగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రాజెక్టులో పీఏసీఎస్‌ కంప్యూటరీకరణ కోసం మొత్తం వ్యయం రూ. 43,36,49,066. పీఏసీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ను సమగ్రంగా అనుసంధానించడానికి అవసరమైన డేటా సెంటర్, డేటా రీకవరీ, నెట్‌వర్క్ కనెక్టివిటీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం 2018–19 సంవత్సరంలో రూ. 2,46,88,000 విడుదల చేసింది. వీటికితోడు రాష్ట్రంలో పీఏసీఎస్‌ కంప్యూటరీకరణ కోసం నాబార్డ్‌ కూడా సహాయం కింద రూ. 5 కోట్ల నిధులను విడుదల చేసింది. పీఏసీఎస్‌ సిబ్బందికి సాంకేతికతను అందించడం కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి, శిక్షణ ఇస్తూ టీజీసీఏబీకి చెందిన సహకార శిక్షణా సంస్థ కీలక పాత్ర పోషించింది.

ఈ సమాచారాన్ని కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

***


(रिलीज़ आईडी: 2201954) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Urdu , हिन्दी