ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచంలో అతిపెద్ద ప్రత్యక్ష చెల్లింపు వ్యవస్థగా ‘యూపీఐ’కి ‘ఐఎంఎఫ్‌’ గుర్తింపు: అంతర్జాతీయ లావాదేవీలలో 49 శాతం వాటా


· పీఐడీఎఫ్‌ మద్దతుగల మౌలిక సదుపాయాలు.. భీమ్‌-యూపీఐ ప్రోత్సాహకాలు.. రూపే-యూపీఐ విస్తరణ వంటి లక్ష్యనిర్దేశిత చర్యలతో దేశంలో వేగం పుంజుకుంటున్న డిజిటల్ చెల్లింపుల విధానం

प्रविष्टि तिथि: 08 DEC 2025 7:31PM by PIB Hyderabad

ప్రపంచంలో అతిపెద్ద ప్రత్యక్ష చెల్లింపు వ్యవస్థగా ‘యూపీఐ’కి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)  గుర్తింపు లభించింది. ఈ మేరకు ‘గ్రోయింగ్ రిటైల్ డిజిటల్ పేమెంట్స్‌ (ది వాల్యూ ఆఫ్‌ ఇంటర్ఆపరబిలిటీ)’ శీర్షికన 2025 జూన్‌లో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయ లావాదేవీల పరిమాణం ప్రాతిపదికన ‘యూపీఐ’ని ప్రపంచంలోనే వేగవంతమైన చిల్లర చెల్లింపుల వ్యవస్థ (ఎఫ్‌పీఎస్‌) గా ప్రకటించింది. అంతేకాకుండా ప్రపంచ ప్రత్యక్ష చెల్లింపు వ్యవస్థలన్నిటి లావాదేవీల పరిమాణంలో ‘యూపీఐ’ వాటా 49 శాతంగా ఉందని ‘ప్రైమ్ టైమ్ ఫర్ రియల్-టైమ్-2024’ శీర్షికన ‘ఏసీఐ వరల్డ్‌ వైడ్’ విడుదల చేసిన నివేదిక పేర్కొంది.

ప్రపంచంలోని ప్రధాన అంతర్జాతీయ ప్రత్యక్ష చెల్లింపు వేదికలతో పోలిస్తే ‘యూపీఐ’ ప్రస్తుత స్థాయి, మార్కెట్ వాటాలో తారతమ్యంపై వివరణాత్మక సమాచారాన్ని కింది పట్టికలో చూడవచ్చు.

దేశవ్యాప్తంగా చిన్నతరహా వ్యాపారులు యూపీఐ సహా ఇతర డిజిటల్ చెల్లింపు విధానాలను అనుసరించేలా ప్రభుత్వం, ‘ఆర్‌బీఐ’, ‘ఎన్‌పీసీఐ’ ఎప్పటికప్పుడు వివిధ కార్యక్రమాలను అమలు చేశాయి. ఇందులో భాగంగా స్వల్ప విలువగల లావాదేవీలను ప్రోత్సహించే దిశగా ‘బీహెచ్‌ఐఎం-యూపీఐ' పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతోపాటు దేశంలోని మూడో అంచె నుంచి 6వ అంచెలోగల పట్టణాలు, గ్రామాల్లో (పీఓఎస్‌ టెర్మినళ్లు, క్యూఆర్‌ కోడ్‌ వంటి) డిజిటల్ చెల్లింపు మౌలిక సదుపాయాలు కల్పించారు. ఇందుకోసం బ్యాంకులు సహా ఆర్థిక సేవా సంస్థలకు మద్దతునిచ్చే ‘పేమెంట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్’ (పీఐడీఎఫ్‌) ఏర్పాటైంది. దీనికింద 2025 అక్టోబరు 31నాటికి సుమారు 5.45 కోట్ల డిజిటల్ టచ్ పాయింట్లు అందుబాటులోకి రాగా, 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 6.5 కోట్ల మంది వ్యాపారులకు 56.86 కోట్ల ‘క్యూఆర్‌’ కోడ్‌ మంజూరు చేశారు.

ఈ విధంగా ప్రభుత్వ సేవలు, రవాణా, ఇ-కామర్స్ వేదికలు సహా వివిధ వ్యాపారాలలో రూపే, యూపీఐ వంటి చెల్లింపు వ్యవస్థల ద్వారా దేశవ్యాప్తంగా డిజిటల్‌ లావాదేవీలను పెంచేందుకు ప్రభుత్వం, ‘ఆర్‌బీఐ’, ‘ఎన్‌పీసీఐ’లు చొరవ చూపాయి.

ఇతర ప్రధాన అంతర్జాతీయ ప్రత్యక్ష చెల్లింపు వేదికలతో పోలిస్తే యూపీఐ స్థాయి ఇలా ఉంది:

దేశాలు

 

లావాదేవీల పరిమాణం (బిలియన్లలో)

ప్రపంచ ప్రత్యక్ష చెల్లింపు వేదికలో వాటా (శాతంలో)

భారత్‌

129.3

49

బ్రెజిల్

37.4

14

థాయిలాండ్

20.4

8

చైనా

17.2

6

దక్షిణ కొరియా

9.1

3

ఇతరులు

52.8

20

మొత్తం

266.2

100

మూలం: ‘ప్రైమ్ టైమ్ ఫర్ రియల్-టైమ్’ 2024పై ఏసీఐ వరల్డ్‌ వైడ్ నివేదిక

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.

 

***


(रिलीज़ आईडी: 2201211) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi