సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
దేశవ్యాప్తంగా చిన్న తరహా పరిశ్రమల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి, డిజిటలీకరణను ప్రోత్సహించడానికి అనేక పథకాలను అమలు చేసిన ప్రభుత్వం
దేశవ్యాప్తంగా ఏర్పాటు కానున్న 20 కొత్త సాంకేతిక కేంద్రాలు (టీసీలు), 100 విస్తరణ కేంద్రాలు (ఈసీలు)
ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు చెందిన క్షేత్ర స్థాయి సంస్థల్లో ఏర్పాటైన 65 ఎగుమతుల సౌలభ్య కేంద్రాలు(ఈఎఫ్‌సీలు)
प्रविष्टि तिथि:
09 DEC 2025 10:58AM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా చిన్న తరహా పరిశ్రమల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి, డిజిటలీకకరణను ప్రోత్సహించడానికి వివిధ పథకాలను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. వాటిలో ఎంఎస్ఈ-క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం (కామన్ ఫెసిలిటీ కేంద్రాలు), టూల్ రూంలు/టెక్నాలజీ కేంద్రాలు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలు (ఎంఎస్ఈ)- గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫైనాన్సింగ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ (గిఫ్ట్) పథకం, ఎంఎస్ఎంఈ ఛాంపియన్ పథకం ఉన్నాయి. ఇవి ఎంఎస్ఎంఈల్లో ఆధునికీకరణ, నైపుణ్యం-నాణ్యతాభివృద్ధి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, హరిత సాంకేతికత స్వీకరణను, పోటీతత్వాన్ని పెంచడానికి తోడ్పడతాయి. ఉద్యమ్ పోర్టల్, ఎంఎస్ఎంఈ ఛాంపియన్స్ పోర్టల్, గవర్నమెంట్ ఈ-మార్కెట్ ఫ్లేస్ (జీఈఎం), ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ (టీఆర్ఈడీఎస్), ఎంఎస్ఎంఈ మార్ట్, ఎంఎస్ఎంఈ సంబంధ్, ఆన్లైన్ వివాద పరిష్కార (ఓడీఆర్) పోర్టల్ లాంటి కార్యక్రమాల ద్వారా డిజిటలీకరణను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వీటి ద్వారా డిజిటల్ రిజిస్ట్రేషన్లు, ఆన్లైన్ సేకరణ, ఈ-మార్కెట్ సౌలభ్యం, రుణాల స్వీకరణ, ఫిర్యాదుల పరిష్కారం తదితర సేవలకు వీలు కల్పించి దేశ వ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈలకు సహకారం అందిస్తుంది.
దేశ వ్యాప్తంగా 20 కొత్త టెక్నాలజీ కేంద్రాలు (టీసీలు), 100 ఎక్స్‌టెన్షన్ కేంద్రాలు (ఈసీలు) ఏర్పాటు చేయడానికి ‘కొత్త టెక్నాలజీ కేంద్రాలు/విస్తరణ కేంద్రాల స్థాపన’ అనే పథకాన్ని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఎస్ఎంఈ) అమలు చేస్తుంది. దీని ద్వారా ఎంఎస్ఎంఈల ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా.. సాంకేతికత, నైపుణ్యమున్న మానవ వనరులు, మార్గదర్శక సేవలకు సంబంధించిన పరిష్కారాలను అందించడానికి టీసీల భౌగోళిక పరిధిని విస్తరించడమే దీని లక్ష్యం. ఇది క్షేత్రస్థాయిలో ఎంఎస్ఎంఈల మధ్య పోటీతత్వాన్ని, లాభదాయకతను పెంచుతుంది. ఈ పథకం ద్వారా ఆకాంక్షాత్మక జిల్లాలైన గయ (బీహార్), బొకారో (జార్ఖండ్)లోని రెండు ప్రాంతాలతో సహా 20 ప్రదేశాల్లో కొత్త టెక్నాలజీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది.
క్షేత్ర స్థాయిలో ఉన్న ఎంఎస్ఎంఈ అభివృద్ధి-సౌలభ్య కార్యాలయాలు, ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రాలు, ఎంఎస్ఎంఈ పరీక్షా కేంద్రాల్లో 65 ఎగుమతుల సౌలభ్య కేంద్రాలు (ఈఎఫ్‌సీ)లను ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఎగుమతుల్లో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని, మద్దతును ఎంఎస్ఎంఈలకు అందించడమే దీని లక్ష్యం.
లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లిఖితపూర్వకంగా అందించారు.
(रिलीज़ आईडी: 2201201)
आगंतुक पटल : 11