రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఢిల్లీలో భారత్ - రష్యా మిలిటరీ మిలిటరీ సాంకేతిక సహకార అంతర ప్రభుత్వ కమిషన్ 22వ సమావేశానికి భారత్, రష్యా రక్షణ మంత్రుల సహాధ్యక్షత


· ప్రగాఢ విశ్వాసం, ఉమ్మడి సూత్రాలు, పరస్పర గౌరవం భారత్ – రష్యా సబంధాలకు ప్రాతిపదికలని పునరుద్ఘాటించిన ఇరుపక్షాలు

· సముచిత సాంకేతికతల్లో సహకారాన్ని పెంపొందించుకునే సరికొత్త అవకాశాలను వివరించిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్

· రక్షణ ఉత్పత్తిలో స్వావలంబన సాధించేలా భారత్‌కు మద్దతిచ్చేందుకు రష్యా రక్షణ పరిశ్రమ సిద్ధంగా ఉంది: శ్రీ ఆండ్రీ బెలోసోవ్

प्रविष्टि तिथि: 04 DEC 2025 7:56PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని మాణెక్ షా కేంద్రంలో 2025 డిసెంబరు 4న నిర్వహించిన భారత్ రష్యా మిలిటరీమిలిటరీ సాంకేతిక అంత ప్రభుత్వ కమిషన్ (ఐఆర్ఐజీసీఎం&ఎంటీసీ) 22వ సమావేశానికి భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్రష్యా రక్షణ మంత్రి శ్రీ ఆండ్రీ బెలోసోవ్ సహాధ్యక్షత వహించారుప్రగాఢ విశ్వాసంఉమ్మడి సూత్రాలుపరస్పర గౌరవం.. భారత్ – రష్యా సంబంధాలకు ప్రాతిపదికలుగా ఉన్నాయని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయిభారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీరష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్ మధ్య 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సుకు ముందు ఈ సమావేశాన్ని నిర్వహించారు.

ఆత్మనిర్భర భారత్’ దార్శనికతలో భాగంగా.. స్థానిక ఉత్పత్తులుఎగుమతులు రెండింటిలో దేశీయ రక్షణ పరిశ్రమ సామర్థ్యాలను పెంపొందించడంలో భారత ప్రభుత్వ సంకల్పాన్ని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వివరించారుసముచిత సాంకేతికతలకు సంబంధించి.. ఇరుదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఉన్న కొత్త అవకాశాలను కూడా ఆయన పునరుద్ఘాటించారు.

పరస్పర విశ్వాసం ప్రాతిపదికగా ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని రష్యా రక్షణ మంత్రి పునరుద్ఘాటించారుఅనేక సంవత్సరాల మైత్రివ్యూహాత్మక సహకారం ఇరు దేశాలను ఐక్యం చేస్తోందని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. రక్షణ ఉత్పత్తి రంగంలో భారత్ స్వావలంబన సాధించేలా సహకరించేందుకు రష్యా రక్షణ పరిశ్రమ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. 2026లో రష్యాను సందర్శించి ఐఆర్ఐసీ-ఎం&ఎంటీసీ 23వ సదస్సుకు సహాధ్యక్షత వహించాల్సిందిగా శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌ను ఆ దేశ రక్షణ మంత్రి శ్రీ బెలోసోవ్ ఆహ్వానించారు.

చివరిగా.. ప్రస్తుతంభవిష్యత్తులో సహకారానికి అవకాశమున్న రంగాలను వివరించే 22వ ఐఆర్‌ఐజీసీ-ఎంఎంటీసీ సమావేశ విధివిధానాలపై మంత్రులిద్దరూ సంతకం చేశారు.

ఈ సమావేశానికి ముందు న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద భారత్రష్యాల రక్షణ మంత్రులు మాలలు వేసి.. దేశ సేవలో ప్రాణత్యాగం చేసిన భారత యోధులకు నివాళి అర్పించారుసందర్శక ప్రముఖులు త్రివిధ దళాల గౌరవ వందనాన్ని కూడా స్వీకరించారు.

****


(रिलीज़ आईडी: 2199686) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Marathi , Tamil