చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో డిసెంబర్ 6, 7 తేదీల్లో కర్ణాటక సంగీతోత్సవాలు- 'కృష్ణవేణి సంగీత నీరాజనం 2025’

प्रविष्टि तिथि: 05 DEC 2025 1:54PM by PIB Hyderabad

విజయవాడలో 2025 డిసెంబర్ 6, 7వ తేదీల్లో 'కృష్ణవేణి సంగీత నీరాజనం’ మూడో ఎడిషన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటకసాంస్కృతిక శాఖ మద్దతుతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖసంగీత నాటక అకాడమీ సహకారంతో భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది.

'తెలుగు సంప్రదాయ సంగీత వైభవంఅనే ఇతివృత్తంతో ఈ ఏడాది జరుగుతున్న ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేయటంసంగీత పర్యాటకాన్ని ప్రోత్సహించటంచేతివృత్తులునేత కార్మికులకు మద్దతివ్వటంకర్ణాటక సంగీతానికి ప్రముఖ గమ్యస్థానంగా విజయవాడను నిలపటం వంటి లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది.

విజయవాడ ప్రజాప్రతినిధులుభారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులురాష్ట్ర పర్యాటక శాఖ అధికారుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటకసాంస్కృతిక మంత్రిత్వ శాఖా మంత్రి శ్రీ కందుల దుర్గేష్ ఈ ఉత్సవాన్ని ప్రారంభిస్తారు.

ఈ ఉత్సవ ప్రణాళికసమన్వయంనిర్వహణ బాధ్యతలను పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయానికి (దక్షిణంఅప్పగించిందిఈ రెండు రోజుల్లో 98 మంది కళాకారులు 18 ప్రదర్శనలు ఇస్తారుముఖ్య వేదికైన తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ప్రదర్శనలు జరుగుతాయి.

డిసెంబర్ 7న ఉదయం గంటలకు దుర్గా ఘాట్‌లో పంచరత్న కృతుల సూర్యోదయ ఆలాపనను నిర్వహిస్తారుమల్లాది సోదరుల నేతృత్వంలో జరిగే ఈ ప్రదర్శనకు విజయవాడగుంటూరు ప్రభుత్వ సంగీత కళాశాలల అధ్యాపకులువిద్యార్థులు తోడ్పాటునందిస్తారుఇది ఉత్సవంలోని సామాజిక సంగీత స్ఫూర్తిని బలపరుస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించటానికిసాంస్కృతికంగా ప్రాముఖ్యత కలిగిన దేవాలయాల్లో మూడు ఆరంభ ప్రదర్శనలను విజయవంతంగా నిర్వహించారు.

29 నవంబర్ 2025న శ్రీకాళహస్తి

1 డిసెంబర్ 2025న సింహాచలం

2 డిసెంబర్ 2025న శ్రీశైలం

ప్రదర్శనలతో పాటు జీఐ ట్యాగ్ పొందిన ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలువస్త్రాల ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారుఇందులో కొండపల్లి బొమ్మలుఏటికొప్పాక లక్క బొమ్మలుఉదయగిరి చెక్క వంట సామాగ్రితోలు బొమ్మలునర్సాపూర్ లేస్మంగళగిరివెంకటగిరిచీరాలఉప్పాడమొరగుడి వంటి ప్రసిద్ధ చేనేత ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారువోకల్ ఫర్ లోకల్ జాతీయ లక్ష్యానికి ఈ ప్రదర్శనలు మద్దతివ్వటం ద్వారా వినియోగదారులతోనూమార్కెట్లతోనూకళాకారులుచేనేత కార్మికులు నేరుగా అనుసంధానమవుతారు.

స్థానిక పర్యాటకఆతిథ్య రంగాలకు చెందిన వారు ఈ ఉత్సవాన్ని ప్రోత్సహించటంలోనూమద్దతివ్వటంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారుపత్రికా సమావేశానికి సహకరించినందుకుఉత్సవ సందేశాన్ని మరింత విస్తృతం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ (ఏఎస్‌హెచ్‌ఏ)కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

జాతీయఅంతర్జాతీయ వీక్షకుల కోసం పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఈ ఉత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారుhttps://youtube.com/@ministryoftourismgoi?si=6oS9sJuiKXVtISCS

కార్యక్రమ షెడ్యూల్ కోసం krishnavenimusicfest.com వెబ్‌సైట్ ను సంప్రదించండి.

 

***


(रिलीज़ आईडी: 2199670) आगंतुक पटल : 35
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil