ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
అంకుర సంస్థలు, విశ్వసనీయ డేటా సంస్థల కోసం సరళీకృత వ్యవస్థ డీపీడీపీ చట్టంపై విస్తృత అవగాహన, అమలు దిశగా ప్రభుత్వ చర్యలు
प्रविष्टि तिथि:
03 DEC 2025 4:49PM by PIB Hyderabad
డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం - 2023 (డీపీడీపీ చట్టం), డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ నియమాల - 2025ను నవంబరు 13న ప్రకటించారు. సంబంధిత నిబంధనల అమలు కోసం కాలక్రమాలను అవి నిర్దేశిస్తాయి. నిబంధనల మేరకు డిజిటల్ డేటా రక్షణ బోర్డును ప్రకటించారు.
నిబంధనల అమలు విషయంలో అంకుర సంస్థలు, డేటా విషయంలో విశ్వసనీయ సంస్థల కోసం ఓ సరళీకృత ఏర్పాటును ఈ చట్టం, నిబంధనలు నిర్దేశిస్తాయి.
వ్యక్తిగత డేటా బదిలీని పరిమితం చేయగల అధికార పరిధులను ప్రభుత్వం నోటిఫై చేసేలా ఈ చట్టం, నిబంధనలు నిర్దేశిస్తాయి.
ప్రజలకు వారి హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించడం ద్వారా.. డీపీడీపీ చట్టాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, అమలు చేసేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కార్యశాలలు, సదస్సులు, నిపుణుల సదస్సులు, డిజిటల్ అవగాహన కార్యక్రమాలను కూడా ప్రభుత్వం చేపడుతోంది.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద 2025 డిసెంబరు 3న లోకసభలో ఈ సమాచారాన్ని సమర్పించారు.
***
(रिलीज़ आईडी: 2199170)
आगंतुक पटल : 3