ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఆహార ఉత్పత్తులపై నిషేధం
దిగుమతి ఉత్పత్తుల నాణ్యతా తనిఖీలు
నిబంధనల స్పష్టతపై ప్రకటన
నాడు పోస్టు చేయడమైనది:
04 DEC 2025 3:17PM by PIB Hyderabad
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి అందిన సమాచారం ప్రకారం,
భారత్ దిగుమతి చేసుకునే ఆహారాన్ని కస్టమ్స్ ప్రవేశ కేంద్రాల వద్ద ధ్రువపత్రాల పరిశీలన, దృశ్య తనిఖీ, నమూనాల సేకరణ, పరీక్షల ద్వారా పరిశీలించి, ఆహార భద్రతా చట్టాలు, నిబంధనల ప్రకారం భద్రతా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నదీ లేనిదీ నిర్ధారిస్తారు. అనంతరం పిల్లలతో సహా అందరూ వినియోగించుకోవటానికి సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులోకి వస్తుంది. ఇతర దేశాల్లో నిషేధించిన ఆహార ఉత్పత్తుల జాబితా మాత్రం ఎఫ్ఎస్ఎస్ఏఐ వద్ద అందుబాటులో లేదు.
వివిధ ఆహార ఉత్పత్తుల్లో వినియోగించేందుకు అనుమతించిన పదార్ధాలను ఫుడ్ సెఫ్టీ, స్టాండర్డ్స్ (ఆహార ఉత్పత్తుల ప్రమాణాలు, మిశ్రమానికి వినియోగించే ఆహారాలు) రెగ్యులేషన్-2011 అనుబంధం-ఏ నిర్దేశిస్తుంది. ఆహారంలో కలిపే పదార్ధాలు, రుచి కోసం కలిపే పదార్ధాలు, తయారీ ప్రక్రియపై శాస్త్రీయ కమిటీ నిర్వహించిన అంచనాల ఆధారంగా ఆహారంలో కలిపే పదార్థాల వినియోగానికి అనుమతి లభిస్తుంది. ఆహారంలో కలిపే పదార్ధాల (ఫ్లేవరింగ్ ఏజెంట్లు మినహా) నిషేధిత జాబితా అందుబాటులో లేదు.
ఈ సమాచారాన్ని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల సహాయమంత్రి శ్రీ రవ్‌నీత్ సింగ్ ఇవాళ లోక్‌సభలో రాతపూర్వకంగా ఇచ్చారు.
(రిలీజ్ ఐడి: 2199153)
సందర్శకుల సూచీ సంఖ్య : : 46