భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
పార్లమెంట్ ప్రశ్నోత్తరాలు: పెరిగిన దేశ తీరప్రాంతం
प्रविष्टि तिथि:
04 DEC 2025 5:08PM by PIB Hyderabad
జాతీయ భద్రతా మండలి సచివాలయం (ఎన్ఎస్సీఎస్) తాజా నిబంధనల ప్రకారం, సర్వే ఆఫ్ ఇండియా (ఎస్ఓఐ) సమన్వయంతో నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ (ఎన్ హెచ్ ఓ) భారత తీరరేఖ పొడవు 7516.6 కిలోమీటర్ల నుంచి 11098.81 కిలోమీటర్లకు పెరిగినట్టు తిరిగి అంచనా వేసింది. తాజా సర్వేల ఆధారంగా ఆధునిక జిఐఎస్ సాఫ్ట్ వేర్, హై-వాటర్ లైన్ (హెచ్ డబ్ల్యూ ఎల్) హై-రిజల్యూషన్ డేటా ఆధారంగా నిర్వహించిన కొలతలతో తీర రేఖ పొడవును తాజాగా నిర్ధరించారు. తద్వారా మరింత క్లిష్టమైన వివరాలను సేకరించారు. తీర ప్రాంత పరిరక్షణ, అభివృద్ధి సలహా సంఘం (కోస్టల్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్ మెంట్ అడ్వైజరీ కమిటీ- సీపీడిఏసీ) అన్ని తీరప్రాంత రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల అనుమతితో భారతదేశ సవరించిన తీర ప్రాంత విస్తీర్ణానికి ఆమోదం తెలిపింది. సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించిన నివేదిక ఆధారంగా, సవరించిన తీరప్రాంతం పొడవును ఓడరేవులు, నౌకా, జలమార్గాల మంత్రిత్వ శాఖ (ఎంఓపిఎస్డబ్ల్యు) 29 ఏప్రిల్ 2025 నాటి సర్క్యులర్లో ప్రకటించింది. దీని ప్రకారం, రాష్ట్రాల వారీగా భారత తీరప్రాంతం పొడవు మారింది. ఈ వివరాలను కిందపట్టికలో పొందుపరిచారు. దేశవ్యాప్తంగా తీరప్రాంతం పొడవు సవరణ ప్రకారం ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం మూడవ స్థానానికి చేరుకుంది.
|
రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం
|
పాత తీర రేఖ (కిలోమీటర్లలో)
|
సవరించిన తీర రేఖ (కిలోమీటర్లలో)
|
|
గుజరాత్
|
1,214.70
|
2,340.62
|
|
తమిళనాడు
|
906.9
|
1,068.69
|
|
ఆంధ్ర ప్రదేశ్
|
973.7
|
1,053.07
|
|
మహారాష్ట్ర
|
652.6
|
877.97
|
|
వెస్ట్ బెంగాల్
|
157.5
|
721.02
|
|
కేరళ
|
569.7
|
600.15
|
|
ఒడిశా
|
476.4
|
574.71
|
|
కర్ణాటక
|
280
|
343.3
|
|
గోవా
|
160.50
|
193.95
|
|
డామన్, డయ్యూ
|
54.38
|
|
అండమాన్, నికోబార్ దీవులు
|
1,962.00
|
3,083.50
|
|
లక్ష ద్వీప్
|
132
|
144.8
|
|
పుదుచ్చేరి
|
30.60
|
42.65
|
|
మొత్తం (భారత్)
|
7,516.6
|
11,098.81
|
పెరిగిన తీరప్రాంతం భవిష్యత్ లో ఓడరేవులు, మౌలిక సదుపాయాలు, పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కార్యకలాపాల కోసం మెరుగైన ప్రణాళికకు దోహదపడుతుంది. తుపానులు, తీరం కోత, వరదలు వంటి విపత్తు ప్రమాదాల అంచనాలకు ప్రభుత్వాలు మరింత సమర్థంగా సిద్ధం కావడానికి ఉపకరిస్తుంది. మెరుగుపరచిన ప్రాథమిక గణాంకాలు సముద్ర ప్రాంతాల నిర్వహణను, ప్రాంతీయ జలాల, ప్రత్యేక ఆర్థిక ప్రాంత (ఈఈజడ్) సరిహద్దుల నిర్వహణను మెరుగుపరుస్తాయి. భద్రతను పెంచుతాయి.
సవరించిన (11,098.81 కిలోమీటర్లకు) తీరరేఖ పొడవు సీఆర్జడ్ నిబంధనలకు లోబడే ప్రాంతాలపై ఎలాంటి ప్రభావం చూపదు. ఎందుకంటే సీఆర్జడ్ సరిహద్దులను పూర్తిగా వాస్తవ హై టైడ్ లైన్ (హెచ్టీఎల్) ఆధారంగా మాత్రమే నిర్ణయిస్తారు. ఈ హెచ్టీఎల్ ను పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్‌మెంట్ (ఎన్సీఎస్సీఎం) గుర్తించింది. హెచ్టీఎల్ మ్యాపింగ్‌ను ఇండియా సర్వే నుంచి పొందిన అత్యంత అధిక-స్పష్టత గల డిజిటల్ వైమానిక ఛాయాచిత్రాలను ఉపయోగించి చేపట్టారు. తరువాత సమగ్ర క్షేత్ర తనిఖీ (గ్రౌండ్ వెరిఫికేషన్) ద్వారా ధృవీకరించారు. అందువల్ల, సవరించిన తీరరేఖ పొడవు సీఆర్జడ్ పరిధి లేదా దాని నియంత్రణ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపదు.
(रिलीज़ आईडी: 2199144)
आगंतुक पटल : 3