సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సాంస్కృతిక వారసత్వం, మ్యూజియాల డిజిటలైజేషన్

प्रविष्टि तिथि: 01 DEC 2025 3:37PM by PIB Hyderabad

సాంస్కృతిక వారసత్వ సంరక్షణమ్యూజియాలను డిజిటైజేషన్సాంస్కృతిక ప్రచారానికి సంబంధించి కృత్రిమ మేధఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి ఆధునిక సాంకేతికతల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందిప్రస్తుతం అమల్లో ఉన్న వివిధ కార్యక్రమాల్లో నేషనల్ మిషన్ ఆన్ మాన్యుమెంట్స్ (జాతీయ స్మారక చిహ్నాలుపురాతన వస్తువుల మిషన్) , యాంటిక్విటీస్మ్యూజియాల డిజిటైజేషన్ కార్యక్రమంవర్చువల్ రియాలిటీఆగ్మెంటెడ్ రియాలిటీ ఆధారంగా సందర్శకుల అనుభవాలు వంటివి ఉన్నాయిసాంస్కృ తిక మంత్రిత్వ శాఖ ఆధీనంలోని అనేక మ్యూజియాల్లో సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకుమరింత ఆకర్షణీయంగా మార్చేందుకు  ఏఆర్-వీఆర్ప్రొజెక్షన్లుడిజిటల్ కియోస్క్‌ల వంటి ఆధునిక డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాలను అమలు చేస్తున్నారుమ్యూజియాల్లో ప్రదర్శనలో ఉన్న వివిధ కళాఖండాలను డిజిటైజ్ చేయడానికి సంస్కృతి మంత్రిత్వ శాఖ ‘‘జటాన్’’ అనే ప్రత్యేక సాంకేతికతను కూడా ఉపయోగిస్తోంది.

జటాన్ సాంకేతికత ద్వారా ఇప్పటి వరకు ప్రఖ్యాత జాతీయ స్థాయి మ్యూజియాలు, 2 ఏఎస్ఐ మ్యూజియాలు డిజిటైజ్ చేశారుఇప్పటివరకు డిజిటైజ్ చేసిన పురాతన వస్తువులను https://www.museumsofindia.gov.in/repository లింక్ ద్వారా వీక్షించవచ్చు.

సామాజిక న్యాయంసాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తులిప్ కార్యక్రమం ద్వారా అట్టడుగున ఉన్న కళాకారులను బలోపేతం చేసేందుకు-మార్కెటింగ్ ద్వారా వారి ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసేందుకుఅమ్మకాల కోసం ఒక వేదికను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

భారత పురావస్తు సర్వే సంస్థ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఖజురాహో సమీపంలో వింధ్య ప్రాంతంలో ఓ పురావస్తు మ్యూజియాన్ని నిర్వహిస్తుంది. 2023లో కొత్త ప్రదర్శన గ్యాలరీలుమరిన్ని పురాతన వస్తువులను ప్రజల కోసం చేర్చి ఈ మ్యూజియాన్ని ఆధునీకరించారు.

ఈ సమాచారాన్ని కేంద్ర సాంస్కృతికపర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ నేడు క్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో అందించారు.

 

***


(रिलीज़ आईडी: 2197107) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil