రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

‘ప్రపంచంలో ఏకత, విశ్వాసాల సాధనకు ధ్యానం’ అంశాన్ని 2025-26 వార్షిక ఇతివృత్తంగా తీసుకొని బ్రహ్మ కుమారీలు లఖ్‌నవూలో నిర్వహించిన కార్యక్రమం ప్రారంభ ఘట్టంలో పాల్గొన్న రాష్ట్రపతి

प्रविष्टि तिथि: 28 NOV 2025 2:14PM by PIB Hyderabad

‘ప్రపంచ ఏకత, విశ్వాస సాధనకు ధ్యానం’ అంశాన్ని 2025-26 వార్షిక ఇతివృత్తంగా ఎంపిక చేసుకొని బ్రహ్మ కుమారీలు లఖ్‌నవూలో ఈ రోజు (2025 నవంబరు 28)న నిర్వహించిన కార్యక్రమ ప్రారంభ ఘట్టంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు.

 image.png

ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ, ‘ఆధునిక కాలంలో సైన్స్, టెక్నాలజీలు అందిస్తున్న అండదండలతో మానవ జాతి ఇదివరకు ఎరుగనంత పురోగతిని సాధించింది. ఇది సమాచార సాంకేతికత, కృత్రిమ మేధ, డిజిటల్ మార్పు, అంతరిక్ష అన్వేషణల యుగం.  ఈ విప్లవాత్మక మార్పులు మావన జీవనాన్ని మరింత సౌకర్యవంతంగాను, సులభంగాను, వనరులతో సమృద్ధమైనవిగానూ మార్చాయి. ఇదివరకటి తో పోలిస్తే నేటి కాలపు మానవులు ఎక్కువ విద్యావంతులూ, సాంకేతికంగా సమర్థులూ కూడా. వృద్ధి లోకి రావడానికి వారి ముందు అనేక అవకాశాలున్నాయి. ఏమైనా, సమాజంలో సాంకేతిక ముందడుగుతో పాటే ఒత్తిడీ, మానసిక అభద్రతాభావం, అపనమ్మకంతో పాటు ఒంటరితనమూ అధికమైంది. ఈ పరిస్థితుల్లో, మనం ముందడుగు వేయడానికొక్కదానికే పరిమితం కాకుండా, అంతర్మథన ప్రక్రియను కూడా మొదలుపెట్టాలి. కాసేపు ఆగి మనతో మనం మాట్లాడితే.. శాంతి, ఉల్లాసం ఏ బయట దొరికే వస్తువుల్లోనే కాదు మన లోపలే ఉంటాయన్న సంగతిని గ్రహించగలుగుతాం. ఆధ్యాత్మిక చేతన మేలుకొంటే ప్రేమ, సోదరీ సోదర భావనలు, కరుణ, ఐకమత్యం వాటంతట అవే జీవనంలో భాగాలైపోతాయి. ప్రశాంత భావం, స్థిర చిత్తం సమాజంలో శాంతి విత్తనాల్ని మొలకెత్తేట్టు చేస్తాయి. ఇక దీని నుంచి ప్రపంచ శాంతికీ, ప్రపంచ ఏకతకూ పునాది ఏర్పడుతుంది. ప్రపంచమంతా ఒక్కటే అనే భావనను ఆచరణాత్మకంగా మలచాలంటే అందుకు బలమైన ఆత్మ కీలకం’ అన్నారు.    

 

 image.png


ప్రపంచ శాంతి, మానవ విలువలు, మహిళలకు సాధికారత కల్పన, ఆధ్యాత్మిక జాగృతి, విద్య,  ధ్యానం.. ఈ రంగాలో బ్రహ్మ కుమారీలు స్ఫూర్తిదాయక కృషిని అందిస్తున్నారని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఈ సంస్థకు చెందిన సోదరీ సోదరులంతా మెరుగైన, శాంతియుతమైన, విశ్వసించే ప్రపంచాన్ని నిర్మించడంలో ఇలా ఓ ముఖ్య పాత్రను పోషించడాన్ని ఇకమీదట కూడా కొనసాగిస్తారన్న నమ్మకం తనకు ఉందని రాష్ట్రపతి అన్నారు.  

 image.png


image.png
రాష్ట్రపతి ప్రసంగాన్ని చదవడానికి ఇక్కడ క్లిక్ చేయగలరు..
Please click here to see the President's speech-


(रिलीज़ आईडी: 2196716) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Malayalam