ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మన్ కీ బాత్ 128వ భాగం ముఖ్యాంశాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 30 NOV 2025 5:25PM by PIB Hyderabad

మన్ కీ బాత్‌లో ఈ రోజు 128వ సంచిక. దీనిలోని ముఖ్యాంశాల్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ అనేక సందేశాల్లో ఇలా పేర్కొన్నారు:
‘‘నవంబరు నెల అనేక స్ఫూర్తిదాయక అంశాల్ని తీసుకు వచ్చింది. #MannKiBaat”
 భారత్ ఇదివరకు ఎప్పుడూ లేని స్థాయిలో ఆహార ధాన్యాల్ని ఉత్పత్తి చేసింది. #MannKiBaat”

ఇస్రో నిర్వహించిన అపూర్వ డ్రోన్ పోటీలో  పుణేకు చెందిన యువ బృందం సఫలం అయిన తీరును ప్రధానమంత్రి ప్రస్తావించారు. #MannKiBaat’’

భారత్ అంతటా తేనె ఉత్పత్తిలో ఓ విప్లవాత్మక అధ్యాయం! #MannKiBaat’’
యూరప్ మొదలు సౌదీ అరేబియా వరకు ప్రపంచంలో అనేక దేశాలు భగవద్గీత నుంచి స్ఫూర్తిని పొందుతున్న వైనాన్ని గురించి ప్రధానమంత్రి భారత్ పౌరులతో పంచుకున్నారు. #MannKiBaat’’
‘‘జామ్ సాహెబ్ అందించిన గొప్ప సేవలను ప్రస్తుతం ప్రపంచం స్మరించి, గౌరవించుకుంటోంది... #MannKiBaat’’
‘‘ఎంతో మంది యువత, పై చదువులు చదివిన వృత్తి నిపుణులు ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించడాన్ని చూస్తుంటే సంతోషంగా ఉందని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్‌ (#MannKiBaat) లో చెబుతున్నారు’’.
‘‘నాలుగో కాశీ-తమిళ్ సంగమం డిసెంబరు 2న కాశీలోని నమో ఘాట్‌లో మొదలవబోతోంది.

కాశీ-తమిళ్ సంగమంలో పాలుపంచుకోవాల్సిందిగా  ప్రతి ఒక్కరినీ ప్రధానమంత్రి కోరుతున్నారు’’. #MannKiBaat
ఐఎన్ఎస్ మాహేను భారతీయ నౌకాదళంలో చేర్చుకున్నారు. ఈ నౌకను దేశీయంగా రూపొందించడం సర్వత్రా ప్రశంసలకు నోచుకుంటోంది’’. #MannKiBaat
‘‘ఉత్తరాఖండ్‌లో శీతాకాల పర్యటన ఎంతో మందిని ఆకట్టుకుంటోంది’’. #MannKiBaat
‘‘భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాల పట్ల అనేక దేశాల్లో ఉత్సుకత వ్యక్తమైంది. బౌద్ధ ధర్మ పవిత్ర అవశేషాలను పంపించినందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు భారత్‌కు కృతజ్ఞత‌లు తెలియజేశారు’’. 

‘‘దేశంలో తయారు చేసిన వస్తువుల్నే కొనుగోలు చేద్దాం’’. #MannKiBaat 

భారత్‌లో సూపర్‌హిట్ అయిన క్రీడా మాసమిది! #MannKiBaat”
నూట నలభై కోట్ల మంది భారతీయులు సంతోషించే అనేక సందర్భాలు నవంబరు నెలలో చోటు చేసుకున్నాయి. వాటిలో కొన్ని, ఇవిగో...:
అయోధ్యలో ధర్మ ధ్వజారోహణ్ ఉత్సవం.
భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలు.
వందేమాతరానికి 150 ఏళ్లు.
ఎంఆర్‌ఓ రంగంలో త్వరలో ప్రపంచ కూడలిగా మారనున్న  భారత్.
బలానికీ, స్వయం సమృద్ధికీ ప్రతీకగా నిలుస్తున్న ఐఎన్ఎస్ మాహే విధుల్లో చేరిక.
స్కైరూట్ ఏరోస్పేస్‌కు చెందిన ఇన్‌ఫినిటీ క్యాంపస్ ప్రారంభోత్సవం.
ఆహారోత్పత్తిలో చరిత్ర సృష్టించిన భారత్.

#MannKiBaat”
సాంకేతికతలోనూ, నవకల్పనలోనూ భారత జెన్ జడ్ అద్భుతాల్ని ఆవిష్కరిస్తోంది. డ్రోన్ల రంగంలో మన యువత ఎంత ఆసక్తితో పనిచేస్తోందో కళ్లకు కట్టే ఒక ఘట్టాన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాను.
#MannKiBaat”
‘‘జమ్మూ, కాశ్మీర్ మొదలు కర్నాటక, నాగాల్యాండ్ వరకు.. తేనె ఉత్పత్తిలో  భారతదేశ రైతులు అసాధారణ విజయాన్ని సాధిస్తున్నారు. ఈ రంగంలో కేవీఐసీ చేస్తున్న కృషిని కూడా నేను ప్రశంసించాను.
#MannKiBaat”
‘‘సౌదీ అరేబియాలో, లాత్వియాలో గీతా మహోత్సవాలను నిర్వహించడం అభినందనీయం. ఇవి భారతీయ ప్రవాసులతోనూ, భారతీయ సంస్కృతి అన్నా, ఆధ్యాత్మికత అన్నా మక్కువ చూపే వారితోనూ  సాంస్కృతిక సంబంధాల్ని గాఢతరం చేసేవే.
#MannKiBaat”
జామ్ సాహెబ్ దిగ్విజయ్‌సింగ్ గారు కనబరిచిన మానవతా స్ఫూర్తికి నివాళులు అర్పించి ఇజ్రాయెల్ విశిష్ట రీతిలో కృతజ్ఞత‌లు చాటిచెప్పిన విషయాన్ని గురించి వివరించా.
#MannKiBaat”
‘‘కాశీ తమిళ్ సంగమానికి ఆతిథ్యాన్ని ఇవ్వడానికి కాశీ ఎదురుచూస్తోంది!
#MannKiBaat”
‘‘రండి, భార‌త్‌కు వచ్చి పెళ్లి చేసుకోండి!
#MannKiBaat”

‘‘బౌద్ధ ధర్మానికి చెందిన పవిత్ర అవశేషాలను భారత్ నుంచి పంపించగా, భూటాన్, థాయిల్యాండ్, రష్యా, మంగోలియా, తదితర దేశాల్లో ఆ పవిత్ర అవశేషాలకు అపురూప రీతిలో స్వాగతం పలికారు. ఇది భగవాన్ బుద్ధుని పట్ల ఉన్న భక్తిప్రపత్తులు మనందరినీ ఎలా ఒకటి చేసి స్ఫూర్తిని అందిస్తోందీ చాటిచెబుతోంది.
#MannKiBaat”


(रिलीज़ आईडी: 2196691) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Odia , Tamil