హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గురు తేగ్ బహాదుర్ జీ అమరత్వాన్ని స్మరించుకుంటూ ఢిల్లీలో నమస్సులు అర్పించి ప్రణమిల్లిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా


అన్యాయాన్నీ, అధర్మాన్నీ ధైర్యంతో, శౌర్యంతో ఎదురొడ్డిన గురు తేగ్ బహాదుర్ జీ
భారత్‌లో అందరికీ స్ఫూర్తి ప్రదాత

ధర్మ రక్షణ కోసం ప్రాణ త్యాగానికీ సంసిద్ధుడైన గురు తేగ్ బహాదుర్ జీ జీవనం
భారత ఆధ్యాత్మిక చేతన, సాహసం, త్యాగబుద్ధిల అమర గాథగా నిలిచింది

ధర్మం, సంస్కృతిల పట్ల గురు సాహిబ్ చాటిన అంకితభావాన్ని
పూర్తి దేశ ప్రజానీకం కృతజ్ఞతపూర్వకంగా స్మరించుకుంటూ
ఆయన 350వ అమరత్వ దినాన్ని పాటిస్తుందని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ నిర్ణయించారు

గురు తేగ్ బహాదుర్ జీ త్యాగం, సాహసం, ప్రాణత్యాగాలతో నిండిన గాథ మనకు సదా స్ఫూర్తిదాయకం

प्रविष्टि तिथि: 24 NOV 2025 11:42PM by PIB Hyderabad

గురు తేగ్ బహాదుర్ జీ అమరత్వాన్ని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా స్మరించుకుంటూ ఈ రోజు ఢిల్లీలో శ్రద్ధాంజలి ఘటించారు. గురు తేగ్ బహాదుర్ జీకి నమస్సులర్పించడంతో పాటు, నేలకు శిరసును తాకించి
ప్రణామం చేశారు శ్రీ షా.

image.png

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ‘‘అన్యాయాన్నీ, అధర్మాన్నీ గురు తేగ్ బహాదుర్ జీ ధైర్య, శౌర్యాలతో ఎదురొడ్డి నిలిచిన విధం భారత్‌లో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిని అందిస్తోంది. ధర్మ రక్షణ కోసం ఆయన తన ప్రాణాలను ఆహుతి చేయడానికైనా వెనుదీయలేదు. ఆయన జీవనం భారత ఆధ్యాత్మిక చేతన, సాహసం, ప్రాణత్యాగాల శాశ్వత గాథగా నిలిచి ఉంటుంద’’న్నారు.  
 

image.png

ధర్మానికీ, సంస్కృతికీ  గురు సాహిబ్   తన జీవితాన్ని అంకితం చేసిన తీరును దేశమంతా స్మరించుకుంటూ, ఆయన 350వ అమరత్వ దినాన్ని కృతజ్ఞతపూర్వకంగా పాటిస్తుందని ప్రధానమంత్రి శ్రీ మోదీ జీ నిర్ణయించారని శ్రీ షా తెలిపారు. గురు తేగ్ బహాదుర్ జీ ప్రాణత్యాగాన్ని స్మరించుకుంటూ ఈ రోజు ఢిల్లీలో నేను నమస్సులు అర్పించి, శిరసా ప్రణామం చేశాను. గురు తేగ్ బహాదుర్ జీ త్యాగం, సాహసం, ప్రాణత్యాగం .. వీటికి సంబంధించిన గాథలు  మనకు  ఎల్లప్పటికీ స్ఫూర్తిని అందిస్తూ ఉంటాయని శ్రీ షా పేర్కొన్నారు.    

 

***


(रिलीज़ आईडी: 2194036) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Bengali