కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
అమరావతి క్వాంటమ్ వ్యాలీలో (ఏక్యూవీ) కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్న సీ-డాట్
ఏక్యూవీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను (సీఓఈ) ఏర్పాటు చేయనున్న సీ-డాట్
प्रविष्टि तिथि:
18 NOV 2025 2:06PM by PIB Hyderabad
అమరావతి క్వాంటమ్ వ్యాలీలో (ఏక్యూవీ) పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ-డాట్) అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వంలోని టెలికమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన టెలికాం పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్‌డీ) కేంద్రమే ఈ సీ-డాట్. ఇది దేశానికి ఉన్న వ్యూహాత్మక, సామాజిక-ఆర్థిక అవసరాలను తీర్చడానికి స్వదేశీ టెలికాం పరిష్కారాల రూపకల్పన -అభివృద్ధి, అత్యాధునిక కమ్యూనికేషన్ సాంకేతికలను ఉపయోగించేలా చూసుకునే పనిలో నిమగ్నమై ఉంది. ఇప్పుడు క్వాంటమ్ భద్రతా పరిష్కారాల అభివృద్ధి విషయంలో కూడా సీ-డాట్ మార్గదర్శకత్వం వహిస్తోంది. వీటిని ఇప్పటికే ప్రముఖ విద్యా సంస్థలు, ప్రభుత్వ పరిశోధన - అభివృద్ధి (ఆర్అండ్‌డీ) సంస్థలు, ప్రత్యక్ష ట్రాపిక్ ఉన్న వాస్తవ నెట్‌వర్క్ తదితరాల్లో ఉపయోగిస్తున్నారు.
భారతదేశ క్వాంటమ్ భవిష్యత్తుకు రూపొందించటంలో భాగంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీని (ఏక్యూవీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అమరావతిలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌లో రాష్ట్ర స్థాయి భాగస్వామ్యాలు, మౌలిక సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయి. హార్డ్‌వేర్ తయారీ, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, నైపుణ్యాలను పెంపొందించటం, పరిశోధనను పెంచటం ద్వారా ఒక సమగ్ర క్వాంటమ్ వ్యవస్థను సృష్టించాలని అమరావతి క్యాంటమ్ వ్యాలీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీ-డాట్ మధ్య కుదిరిన ఈ ఒప్పందంలో భాగంగా అమరావతి క్యాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కమ్యూనికేషన్- సెక్యూరిటీ సొల్యూషన్స్ విభాగంలో గోప్యతను మెరుగుపరిచే సాంకేతికతలు(పీఈటీ- ప్రైవసీ ఎన్‌హాన్స్‌మెంట్ టెక్నాలజీస్) వంటి అనుబంధ అంశాలతో కూడిన ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సీ-డాట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిపాదత కేంద్రంలో ప్రధానంగా క్వాంటమ్ కమ్యూనికేషన్ పరిష్కారాలపై డీ-డాట్ దృష్టి సారించనుంది.
క్వాంటమ్ కమ్యూనికేషన్ రంగంలో సీ-డాట్‌కు ఉన్న నైపుణ్యం.. భారత్‌లోని వర్ధమాన సంస్థలకు అవసరమైన వనరులు, నైపుణ్యాభివృద్ధిని అందించడంలో సహాయపడుతుంది. ఇది ‘ఎన్‌క్యూఎం’ (నేషనల్ క్వాంటమ్ మిషన్)కు అనుగుమంగా ఉన్న క్వాంటమ్ భద్రతా పరిష్కారాల విషయంలో పరిశోధన, ప్రయోగాలకు మద్దతునిస్తుంది. దీనితో పాటు ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ రూపొందించిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా ఉండేలా పీఈటీల అభివృద్ధికి కూడా ఇది సహాయపడుతుంది. క్వాంటమ్ కమ్యూనికేషన్ వ్యవస్థల కోసం తక్కువ ఖర్చుతో కూడిన విడి భాగాల అభివృద్ధిపై కూడా డీ-డాట్ దృష్టి సారిస్తుంది. వీటితో పాటు క్వాంటమ్ భద్రత కోసం ఒక సమగ్ర టెస్ట్‌బెడ్‌ను ఇది ఏర్పాటు చేస్తుంది. ఇది ఏక్యూవీ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేయటంతో పాటు క్వాంటమ్ సాంకేతికతను సురక్షితంగా ఉపయోగించగలిగే వ్యవస్థను ప్రోత్సహించి, దేశవ్యాప్తంగా డిజిటల్ గోప్యత - డేటా రక్షణను పెంచుతుంది.
విశాఖపట్నంలో జరిగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందాన్ని మార్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీఈ-సీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - కమ్యూనికేషన్స్ శాఖ కార్యదర్శి శ్రీ భాస్కర్ కాటమనేని సమక్షంలో సీ-డాట్ కార్యనిర్వహక ఉపాధ్యక్షులు డాక్టర్ పంకజ్ కుమార్ దలేలా అవగాహన ఒప్పందంపై (ఎంఓయూ) సంతకం చేశారు.
***
(रिलीज़ आईडी: 2191487)
आगंतुक पटल : 50