వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

44వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2025ను ప్రారంభించిన వాణిజ్యం, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద్


సాంకేతికంగా ముందంజలో ఉన్న, స్థిరమైన భారత్ దార్శనికతను ఐఐటీఎఫ్ 2025 ప్రదర్శిస్తుంది: శ్రీ జితిన్ ప్రసాద

Posted On: 14 NOV 2025 10:20PM by PIB Hyderabad

అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న ఆకాంక్షతో ఉన్న భారత్ సామర్థ్యాన్ని 44వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (ఐఐటీఎఫ్) 2025 తెలియజేస్తుందని  పరిశ్రమలువాణిజ్యంఎలక్ట్రానిక్స్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద అన్నారుఈ రోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ఐఐటీఎఫ్ 2025ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి ప్రసంగించారు.

స్వావలంబన దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో ఇలాంటి కార్యక్రమాలు కీలకపాత్ర పోషిస్తాయని శ్రీ ప్రసాద్ అన్నారుప్రధానమంత్రి దార్శనికత అయిన ‘‘వికసిత భారత్ @2047’’ స్ఫూర్తిగా, ‘‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’’ ఇతివృత్తం కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సాంకేతికంగా ముందంజలో ఉన్నఆర్థికంగా స్థిరత్వం సాధించిన దేశాన్ని ప్రదర్శిస్తుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమ నిర్వహణలో ఐటీపీవో చేపట్టిన ప్రయత్నాలను గుర్తిస్తూ.. దశాబ్దం తర్వాత డిఫెన్స్ పెవిలియన్ తిరిగి ఏర్పాటు చేయడాన్ని మంత్రి స్వాగతించారువివిధ రంగాల్లో విస్తరించిన భారత ఆర్థిక వ్యవస్థ ప్రగతినిఉపాధి కల్పనలో దాని పాత్రను ఈ ఏడాది నిర్వహిస్తున్న కార్యక్రమం తెలియజేస్తుందని ఆయన అన్నారువివిధ భాగస్వామ్య దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఏర్పాటు చేసుకోవడానికి భారత్ చేస్తున్న కృషిని ఆయన వివరించారుస్థిరమైన భారతీయ విధాన వ్యవస్థపెట్టుబడుల వాతావరణంపై అంతర్జాతీయంగా విశ్వాసం పెరుగుతోందన్నారు.

బలమైన ఆర్థిక మూలాలుస్థిరమైన విధాన సంస్కరణలుఅంతర్జాతీయ భాగస్వామ్యాల విస్తరణల తోడ్పాటుతో అంతర్జాతీయంగా భారత్ ఖ్యాతి పెరుగుతోందని శ్రీ ప్రసాద్ తెలిపారుఇవి అంతర్జాతీయ వాణిజ్యంపెట్టుబడుల్లో దేశం పాత్రను బలోపేతం చేస్తున్నాయన్నారు.

ఐటీపీవో ఛైర్మన్ శ్రీ నితిన్ కుమార్ యాదవ్ఐటీపీవో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నీరజ్ ఖర్వాల్ఐటీపీవో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ప్రేమ్‌జీత్ లాల్రాజస్థాన్ ప్రభుత్వం పరిశ్రమలువాణిజ్య ప్రధాన కార్యదర్శి శ్రీ అలోక్ గుప్తాబీహార్ రెసిడెంట్ కమిషనర్ శ్రీ కుందన్ కుమార్జార్ఖండ్ రెసిడెంట్ కమిషనర్కార్యదర్శి శ్రీ అరవ రాజ్ కమల్ఇతర ప్రభుత్వ అధికారులుదేశవిదేశాలకు చెందినవారుప్రతినిధులువిలేకరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఐఐటీఎఫ్ 2025లో ప్రధాన కార్యక్రమాల గురించి ఐటీపీవో ఛైర్మన్మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నితిన్ కుమార్ యాదవ్ తన స్వాగతోపన్యాసంలో వివరించారువ్యాపార భాగస్వామ్యంసాంకేతిక వినిమయంపెట్టుబడి అవకాశాలకు వేదికగా ఈ ఫెయిర్ కొనసాగుతుందన్నారుదేశవిదేశాల నుంచి 3,500 మందికికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో 31 రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాలు పాల్గొన్నాయిభాగస్వామ్య రాష్ట్రాలుగా బీహార్మహారాష్ట్రరాజస్థాన్ఉత్తరప్రదేశ్ వ్యవహరిస్తుండగా.. ప్రధాన దృష్టి సారించే రాష్ట్రంగా జార్ఖండ్ ఉందిఅంతర్జాతీయ పెవిలియన్లో పదకొండు దేశాలుచైనాథాయిలాండ్యూఏఈమలేషియాస్వీడన్తుర్కియేఇరాన్దక్షిణ కొరియాఈజిప్టులెబనాన్రిపబ్లిక్ ఆఫ్ ట్యునీషియాతో పాటుగా టిబెటన్ ఛాంబర్ ఆప్ కామర్స్ పాల్గొంటాయి.

ఐటీపీవో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నీరజ్ ఖర్వాల్ వందన సమర్పణ చేశారువాణిజ్యంసాంకేతికతసాంస్కృతిక వినిమయాల కేంద్రంగా ఐఐటీఎఫ్ ప్రాత్రను స్పష్టం చేస్తూ వివిధ ప్రభుత్వ విభాగాలుపీఎస్‌యూలుఎంఎస్ఎంఈలుఅంకురసంస్థలుఅంతర్జాతీయ ఎగ్జిబిటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారుసంప్రదాయ రంగాలకు చెందిన ఉత్పత్తులను సరస్ ఎగ్జిబిటర్లుజ్యూట్ తయారీదారుల అభివృద్ధి మండలిఎంఎస్ఎంఈలుచేనేతహస్త కళాకృతులుకాయిర్ బోర్డుఖాదీగ్రామీణ పరిశ్రమలు ప్రదర్శనలో ఉంచాయి.

 

***


(Release ID: 2190443) Visitor Counter : 4