రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

సముద్రంలో గనుల గుర్తింపునకు మనుషులు మోయగల కొత్తతరం జలాంతర్గత వాహనాలను అభివృద్ధి చేసిన డీఆర్‌డీఓ

प्रविष्टि तिथि: 14 NOV 2025 5:31PM by PIB Hyderabad

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థకు (డీఆర్‌డీఓ) చెందిన విశాఖపట్నంలోని నౌకాదళ విజ్ఞానసాంకేతిక ప్రయోగశాల(ఎన్‌ఎస్‌టీఎల్‌) మనుషులు మోయగలిగే స్వయంచాలక జలాంతర్గత వాహనలను విజయవంతంగా అభివృద్ధి చేసింది.  సముద్రంలో ప్రమాదకర గనులను గుర్తించడంనిర్వీర్యం చేయడం కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందించింది. సముద్రంలో గనులను వేగంగా గుర్తించడం కోసం  ప్రధాన పేలోడ్‌లుగా సైడ్ స్కాన్ సోనార్,  అండర్‌ వాటర్ కెమెరాలతో అమర్చిన అనేక ఏయూవీలు ఉన్నాయి. ఇవి ఆన్‌బోర్డ్ డీప్ లెర్నింగ్ ఆధారంగా లక్క్ష్యాలను గుర్తించే  సాంకేతికతను కలిగి ఉంటాయి. ఇవి స్వయంచాలక వర్గీకరణను సాధ్యమయ్యేలా చేస్తాయి. దీని వల్ల మానవ జోక్యం, పని భారం తగ్గడమే కాకుండా సమయం ఆదా అవుతుంది.

కార్యకలాపాల సమయంలో ఏయూవీల మధ్య సమాచర మార్పిడికి సహాయపడుతూ..  పరిస్థితులపై అవగాహనను మెరుగుపరిచేందుకు నీటి అడుగున ఒక బలమైన శబ్ద తరంగాల ఆధారంగా పనిచేసే కమ్యూనికేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

ఇటీవల ఎన్‌టీఎల్‌/హార్బర్‌లో నిర్వహించిన ప్రత్యక్ష పరిశీలనలో వ్యవస్థ ప్రధాన లక్షణాలు,  కీలక మిషన్ లక్ష్యాలను విజయవంతంగా ప్రస్ఫుటమయ్యాయి. వ్యవస్థ రూపకల్పనఅభివృద్ధిలో అనేక పరిశ్రమల భాగస్వాములు పాల్గొన్నారు. మరో రెండు నెలల్లో ఈ వ్యవస్థ వినియోగానికి సిద్ధం కానుంది. 

ఎంపీ-ఏయూవీలను విజయవంతంగా అభివృద్ధి చేసినందుకు ఎన్‌ఎస్‌టీఎల్‌ బృందాన్ని రక్షణ పరిశోధనఅభివృద్ధి విభాగం కార్యదర్శిడీఆర్‌డీఓ ఛైర్మన్ డా. సమీర్ వి. కామత్ అభినందించారు. ఇదొక కీలక మైలురాయిగా ఆయన అభివర్ణించారు. ఈ వ్యవస్థ నౌకాదళ గనుల, యుద్ధ సంబంధిత కార్యకలాపాల్లో తక్కువ కార్యాచరణ ప్రమాదంతక్కువ రవాణా అవసరాలతోవేగంగా ప్రతిస్పందించే సామర్థ్యాన్ని అందిస్తుందని ఆయన అన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2190441) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi