విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్లోబల్ ఎనర్జీ లీడర్స్ సమ్మిట్ (జీఈఎల్ఎస్) 2025 లోగో, వెబ్ సైట్ ఆవిష్కరణ


ఒడిశాలోని పూరిలో డిసెంబర్ 5 నుంచి 7 వరకు జరగనున్న ప్రపంచ విద్యుత్ నేతల సదస్సు

Posted On: 13 NOV 2025 4:46PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో నేడు  ప్రపంచ ఇంధన నేతల సదస్సు (జీఈఎల్ఎస్2025 లోగోవెబ్‌సైట్‌ను విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపద్ నాయక్ ప్రారంభించారుటోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్‌ సంస్థతో కలిసి ఒడిశా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సమావేశం..  డిసెంబర్ నుంచి వరకు పూరీ నగరంలో జరగనుంది.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒడిశా ఉపముఖ్యమంత్రి శ్రీ కనక్ వర్ధన్ సింగ్ డీయోఒడిశా విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ విశాల్ దేవ్ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ అనూప్ సింగ్,  టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ (భారత్అధినేత శ్రీవివేక్ అగర్వాల్ పాల్గొన్నారు.

ఇంధన మార్పువాతావరణ నాయకత్వంసాంకేతిక ఆధారిత మార్పుపై కీలక జాతీయఅంతర్జాతీయ సంభాషణకు ఈ జీఈఎల్ఎస్ 2025 నాంది పలుకుతుందని కేంద్ర సహాయ మంత్రి శ్రీ శ్రీపద్ నాయక్ తెలిపారువిద్యుత్ ఉత్పత్తిపునరుత్పాదక ఇంధనంప్రసార సామర్థ్యండిజిటల్ ఆధునీకరణలో దేశ ప్రగతిని ప్రస్తావిస్తూ.. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంధన  మార్కెట్లలో భారత్ ఒకటిగా పేర్కొన్నారు.

దేశ ఇంధన పరివర్తనను ముందుకు తీసుకెళ్లడంలోసహకారపోటీతత్వ సమాఖ్యవాదాన్ని  ప్రోత్సహించడంలో నాయకత్వం వహిస్తున్న ఒడిశా ప్రభుతాన్ని నాయక్‌ ప్రశంసించారు.

1990లోనే విద్యుత్ రంగ సంస్కరణలు చేపట్టిన దేశంలోని తొలి రాష్ట్రంగా ఒడిశా నిలిచిందని మంత్రి ప్రశంసించారు.  సమర్థతస్థైర్యంస్థిరత్వం పట్ల బలమైన నిబద్ధతను రాష్ట్రం కొనసాగిస్తోందని ఆయన పేర్కొన్నారుఒడిశా మోడల్‌ ద్వారా వృద్ధిపర్యావరణ బాధ్యతతో సమన్వయం సాధించగలదనిస్వచ్ఛమైన ఇంధన పెట్టుబడులు పరిశ్రమల అభివృద్ధిఉపాధి సృష్టికి దోహదపడతాయని చూపించిందని తెలిపారు.

ఈ సదస్సు ఇతివృత్తం.. ‘‘శక్తిమంతమైన భారత్‌సమృద్ధిసమతుల్యతఆవిష్కరణ’’ గురించి కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఇంధన ప్రాప్యతసమర్థతస్థిరత్వంభద్రత వంటి నాలుగు కీలక అంశాలతో ప్రధానమంత్రి దార్శనికతను ప్రతిబింబిస్తుందని తెలిపారుఈ సదస్సుకు విద్యుత్‌ మంత్రిత్వ శాఖనూతనపునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారుజీఈఎల్‌ఎస్‌ సమావేశం ఇంధన నాయకత్వంసహకార వేదికగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

జీఈఎల్‌ఎస్‌ సదస్సును విజయవంతంగా నిర్వహించాలని కోరుతూ.. ఒడిశా ప్రభుత్వంరాష్ట్ర విద్యుత్‌ శాఖ,  అన్ని భాగస్వామ్య సంస్థలకు  శుభాకాంక్షలు తెలియజేశారుఇలాంటి సహకార ప్రయత్నాలు దేశ  శూన్య నికర ఉద్గారాలు-2070” లక్ష్యాలుజాతీయంగా నిర్ణయించిన వాతావరణ చర్యల లక్ష్యాలను సాధించడంలో కీలకమని ఆయన పేర్కొన్నారు.

జీఈఎల్‌ఎస్‌ 2025

డిసెంబర్ నుంచివరకు ఒడిశాలోని పూరిలో ప్రపంచ ఇంధన నేతల సదస్సు 2025 జరగనుందిఈ సమావేశంలో కేంద్రరాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రులుప్రపంచ నేతలుఆవిష్కర్తలుపరిశ్రమ దిగ్గజాలు పాల్గొననున్నారుభవిష్యత్తు ఇంధన విధానాలనుఆవిష్కరణలనుస్థిరమైన అభివృద్ధిని అందించే వేదికగా ఈ కార్యక్రమం ఉండనుంది.

ఈ సదస్సు రాష్ట్ర విద్యుత్‌ మంత్రుల మధ్య సహచర చర్యలను ప్రోత్సహించేలాఅంతర్జాతీయ నాయకులతో వ్యూహత్మక సంభాషణలను నిర్వహించేందుకు ఓ అవకాశంగా ఉపయోగపడనుందిమరిన్ని వివరాల కోసం జీఈఎల్ఎస్‌ 2025 అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

https://www.gelsodisha2025.com/

 

***


(Release ID: 2190015) Visitor Counter : 14