సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాలు-2025
Posted On:
12 NOV 2025 3:25PM by PIB Hyderabad
బాల సాహిత్యంలో సాహిత్య అకాడమీ ఏటా ప్రకటిస్తున్న ‘బాల సాహిత్య పురస్కారాల’లో భాగంగా, ఈ సంవత్సరం అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల 14న న్యూఢిల్లీలోని తాన్‌సేన్ మార్గ్‌లో గల త్రివేణి ఆడిటోరియంలో నిర్వహిస్తారు. అకాడమీ అధ్యక్షుడు శ్రీ మాధవ్ కౌశిక్ పురస్కారాలను అందజేస్తారు. ప్రసిద్ధ గుజరాతీ రచయిత్రి వర్షా దాస్ కార్యక్రమ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సాహిత్య అకాడమీ కార్యదర్శి పల్లవి ప్రశాంత్ హోల్కర్ స్వాగతోపన్యాసాన్ని ఇస్తారు. అకాడమీ ఉపాధ్యక్షురాలు కుముద్ శర్మ వందన సమర్పణ చేస్తారు.
పురస్కారాల కోసం ఎంపిక చేసిన పుస్తకాల, అవార్డు విజేతలైన రచయితల వివరాలు ఇలా ఉన్నాయి: అస్సామీ - మైనాహంతర్ పద్య (కవిత) రచన: సురేంద్ర మోహన్ దాస్; బెంగాలీ - ఏఖోనో గాయే కాంటా దేయ్ (కథలు) రచన: త్రిదిబ్ కుమార్ చట్టోపాధ్యాయ; బోడో - ఖాంథి బోసొన్ ఆరో ఆఖు దానాయ్ (కథ), రచన: బినయ్ కుమార్ బ్రహ్మ; డోగ్రీ - నన్హీ టోర్ (కవిత), రచన: పి.ఎల్. పరిహార్ ‘‘శౌక్’’; ఇంగ్లిషు - దక్షిణ్ : సౌత్ ఇండియన్ మిథ్స్ అండ్ ఫేబుల్స్ రీటోల్డ్ (కథ), రచన: నితిన్ కుశలప్పా ఎంపీ; గుజరాతీ - టించక్ (కవిత) రచన: కీర్తిదా బ్రహ్మభట్; హిందీ - ఏక్ బటే బారహ్ (కథ) రచన: సుశీల్ శుక్ల; కన్నడం - నోట్‌బుక్ (కథ) రచన: కె. శివలింగప్ప హన్దిహల్; కాశ్మీరీ - శుర్యత్ చుర్యగిశ్య (కథ) రచన: ఇజ్‌హార్ ముబాశిర్; కొంకణి - వేలాబాయ్‌చో శంకర్ ఆనీ హేర్ కాణయో (కథ) రచన: నయనా ఆడార్‌కార్; మైథిలీ - చుక్కా (కథ) రచన: మున్నీ కామత్; మలయాళమ్ - పెంగ్వినుకాలుడే వంకారాయిల్ (నవల) రచన: శ్రీజిత్ ముతేడత్; మణిపురి - అంగంశింగగీ శత్రాబుగసిదా (నాటకం) రచన: శాంతో ఎమ్; మరాఠీ - ఆభాయిమాయా (కవిత) రచన: సురేశ్ సావంత్; నేపాలీ - శాంతి వన్ (నవల) రచన: సాంగ్ము లెప్చా; ఒడియా - కేతే ఫూలా ఫూటిచీ (కవిత) రచన: రాజ్‌కిశోర్ పరహీ; పంజాబీ - జాదూ పత్తా (నవల) రచన: పాలీ ఖాదిమ్ (అమృత్ పాల్ సింగ్); రాజస్థానీ - పంఖేరువం నీ పీడా (నాటకం) రచన: భోగీలాల్ పాటీదార్; సంస్కృతం - బాలవిశ్వమ్ (కవిత), రచన: ప్రీతి పుజారా; సంతాలీ - సోనా మిరూ అగ్ సందేశ్ (కవిత) రచన: హర్‌లాల్ ముర్ము; సింధీ - అస్మానీ పరీ (కవిత) రచన: హీనా అగ్నానీ ‘హీర్’; తమిళం - ఒత్తరాయి సిర్గు ఓవియా (నవల) రచన: విష్ణుపురమ్ సరవణన్; తెలుగు - కబుర్ల దేవత (కథ) రచన: గంగిశెట్టి శివకుమార్; ఉర్దూ - కౌమీ సితారే (వ్యాసాలు) రచన: గజన్‌ఫర్ ఇక్బాల్.
పురస్కార విజేతలు వారి రచనలకు గుర్తింపుగా రూ.50,000 చెక్కుతో పాటు ఒక కాంస్య ఫలకాన్నీ అందుకొంటారు.
ఈ నెల 15న, అవార్డు స్వీకర్తల సమావేశాన్ని న్యూఢిల్లీ ఫిరోజ్‌షా రోడ్డులో రవీంద్ర భవన్లో గల అకాడమీ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అకాడమీ ఉపాధ్యక్షురాలు కుముద్ శర్మ అధ్యక్షత వహిస్తారు. అవార్డు స్వీకర్తలు తమ సృజనాత్మక అనుభూతులను ఈ సందర్భంగా పంచుకుంటారు.
***
(Release ID: 2189460)
Visitor Counter : 6