శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
దేశ అధునాతన సాంకేతిక భవిషత్యుకు స్పూర్తినిచ్చే ‘పిచ్‌ఎక్స్ @ ఈఎస్‌టీఐసీ 2025’
Posted On:
06 NOV 2025 11:56AM by PIB Hyderabad
ఆధునిక శాస్త్ర సాంకేతిక, ఆవిష్కరణలపై సదస్సు (ఇఎస్ టీఐసీ 2025) రెండో రోజు కార్యక్రమంలో భాగంగా దేశంలో అధునాతన సాంకేతిక రంగంలో ఉన్న ప్రతిభావంతమైన అంకుర సంస్థలు, పెట్టుబడిదారులు ఒకే వేదికపై సమావేశమయ్యారు. వీరంతా భవిష్యత్తు సాంకేతిక పరిష్కారాలను చర్చించడానికి, ప్రదర్శించడానికి, సహకారం ఏర్పరచుకోవడానికి చర్చలు జరిపారు.
20కిపైగా మార్గదర్శక అంకుర సంస్థలు, పీక్‌ఎక్స్‌వీ, యూవర్‌నెస్ట్, ఫాస్ట్ ఇండియా, ఐఐఎమ్‌ఏ వెంచర్స్, సిల్వర్ నీడిల్ వెంచర్స్ వంటి ప్రముఖ పెట్టుబడిదారుల ముందు తమ అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణలను ప్రదర్శించాయి. ఈ కార్యక్రమం, అధునాతన సాంకేతిక అభివృద్ధిలో భారత్ వేగంగా ముందుకు సాగుతుండడాన్ని, శాస్త్రీయ పరిశోధనను మార్కెట్కు అనువైన పరిష్కారాలుగా మార్చే దేశ దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది.
ఈఎస్టీఐసీ 2025 సమావేశానికి శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి శ్రీ డాక్టర్ జితేంద్ర సింగ్ హాజరయ్యారు. ఆయన ప్రసంగిస్తూ.. పరిశ్రమల మధ్య ప్రారంభ సంబంధాల ప్రాముఖ్యత, ఆవిష్కరణలకు మద్దతు, పెట్టుబడిదారుల నిరంతర భాగస్వామ్యం ఎంత ముఖ్యమో వివరించారు. ఇటీవల ప్రారంభించిన రూ. 1 లక్ష కోట్ల పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ (ఆర్డీఐ) పథకం గురించి వెల్లడించారు. ఈ కార్యక్రమం ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహిస్తుందని, దేశ అధునాతన సాంకేతిక విప్లవానికి ఆజ్యం పోస్తుందని కేంద్రమంత్రి తెలిపారు.
ఇటీవల ప్రారంభించిన ఆర్డీఐ పథకం కార్యాచరణ రూపరేఖను శాస్త్ర. సాంకేతిక శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరండికర్ వివరించారు. డీఎస్టీ, టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డు త్వరలోనే అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఆధునాతన సాంకేతిక అంకుర సంస్థలకు మద్దతుగా ప్రారంభ పెట్టుబడులు అందిస్తాయని తెలిపారు.
ఆధునాతన సాంకేతిక ప్రదర్శనలో ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు ప్రతిపాదించిన 30 అగ్రగామి అంకుర సంస్థలు భాగంగా నిలిచాయి. పరిశోధనా నైపుణ్యం, మేధో హక్కుల సృష్టి, ప్రపంచ స్థాయి పోటీతత్వం వంటి అంశాలపై ఆవిష్కరణ ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిబద్ధతను ఈ ప్రదర్శన స్పష్టం చేసింది.
‘పిచ్‌ఎక్స్ @ ఈఎస్‌టీఐసీ 2025‘ కార్యక్రమం ద్వారా అంతరిక్షం, రక్షణ, క్వాంటం టెక్నాలజీలు, సైబర్ సెక్యూరిటీ, ఆరోగ్యం, జీవ విజ్ఞానం,సెమికండక్టర్లు, పరిశ్రమ 4.0, కృత్రిమ మేధ, నీటి నిర్వహణ, అగ్రిటెక్ వంటి అనేక అంకుర సంస్థలు అత్యాధునిక రంగాల్లో తమ ప్రతిభను చాటాయి.
ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్స్, ఆత్రేయ ఇన్నోవేషన్స్, లైఫ్‌స్పార్క్ టెక్నాలజీస్, నోకార్క్ రోబోటిక్స్, ఫార్టీటూ ల్యాబ్స్ వంటి కొన్ని అధిక పెట్టుబడి పెట్టదగిన అంకుర సంస్థలుగా ఎదిగాయి. ఈ సమావేశం మహిళా వ్యవస్థాపకుల ప్రతిభకు కూడా ప్రాముఖ్యత కల్పించింది. ఇది సాంకేతిక రంగంలో సమగ్ర అభివృద్ధికి దేశం కట్టుబడి ఉన్న విధానాన్ని తెలుపుతుంది.
పెట్టుబడిదారులు, అంకుర సంస్థలు రెండింటా నుంచి ఉత్సాహభరితమైన భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం ముగిసింది. పిచ్‌ఎక్స్ @ ఈఎస్‌టీఐసీ 2025 దేశ ఆధునాతన సాంకేతిక భవిష్యత్తుకు స్పూర్తిగా, ఆవిష్కరణ ఆధారిత అభివృద్ధికి కీలకంగా నిలిచింది.
***
(Release ID: 2187679)
Visitor Counter : 8