శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డాక్టర్ జితేంద్ర సింగ్‌తో లక్సెంబర్గ్ రాయబారి భేటీ..


అంతరిక్ష, సైన్స్ రంగాల్లో సహకారంపై చర్చ

భారత్, లక్సెంబర్గ్ మార్కెట్లలో భారతీయ అంతరిక్ష అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి ఉన్న అవకాశాలపై దృష్టి

సైన్స్, నవకల్పనలతో పాటు అంకుర సంస్థల ప్రపంచ కూడలిగా భారత్ ఎదుగుతోందన్న డాక్టర్ జితేంద్ర సింగ్‌

Posted On: 06 NOV 2025 7:08PM by PIB Hyderabad

సైన్స్టెక్నాలజీ రంగాలతో పాటు అంతరిక్ష అన్వేషణలో సహకారాన్ని మరింత బలపరుచుకోవడానికి భారత్లక్సెంబర్గ్ సిద్ధంగా ఉన్నాయికేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌ న్యూఢిల్లీలో... లక్సెంబర్గ్ రాయబారి శ్రీ క్రిస్టియన్ బీవర్‌తో ఈ రోజు సమావేశమయ్యారుఈ సమావేశంలో సైన్స్టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ), అంతరిక్ష విభాగం (డీఓఎస్‌)లతో పాటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఉన్నతాధికారులు పాల్గొన్నారుసైబర్ భద్రతక్వాంటమ్ సాంకేతికతకృత్రిమ మేధ తదితర నవకల్పన ప్రధాన రంగాల్లో కార్యక్రమాలను కలిసికట్టుగా ముందుకు తీసుకుపోవాలనే అంశంపై ఈ  సమావేశంలో దృష్టి సారించారు.

 

image.png

 


భారత్‌లో ప్రయివేటు రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష అనుబంధ విస్తారిత వ్యవస్థను యూరప్‌లో ఇప్పటికే అభివృద్ధి చెందిన అంతరిక్ష ప్రధాన ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేస లక్ష్యంతో భారతీయ అంతరిక్ష రంగ అంకుర సంస్థలను లక్సెంబర్గ్‌లో ప్రోత్సహించాలనే అంశం చర్చల్లో ప్రధానంగా చోటుచేసుకుందికేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలకు తోడు ఇస్రో పరిశ్రమానుకూల విధానాలందిస్తున్న అండదండలతోభారత్‌లో చైతన్యంతో తొణికిసలాడుతున్న అంకుర సంస్థల రంగం ప్రపంచ స్థాయి సహకారానికి అనేక అవకాశాలను అందించగల స్థితికి చేరిందని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారుఅంతరిక్ష రంగంలో ఆర్థిక సాయంనవకల్పన అనుబంధ విస్తారిత వ్యవస్థల్లో లక్సెంబర్గ్ పటిష్ఠంగా ఉందనీయూరప్ మార్కెట్లుసంయుక్త పరిశోధనఅభివృద్ధి సంస్థలతో పాటు పెట్టుబడి అవకాశాలను భారతీయ అంతరిక్ష రంగ  అంకుర సంస్థలు అందుకోవడానికి లక్సెంబర్గ్ ప్రధానంగా ఉపయోగపడవచ్చనీరోజురోజుకూ మార్పునకు లోనవుతున్న ప్రపంచ అంతరిక్ష ముఖచిత్రంలో పరస్పర లాభదాయక భాగస్వామ్యానికి దీంతో దన్ను లభించగలదనీ ఆయన సూచించారు.
భారత్లక్సెంబర్గ్ మధ్య దౌత్య సంబంధాలు 1948 నుంచీ దృఢతరమవుతున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీలక్సెంబర్గ్ ప్రధానమంత్రి శ్రీ జేవియర్ బెటెల్‌ 2020 నవంబరులో దృశ్య మాధ్యమం ద్వారా చరిత్రాత్మక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేశారుఈ శిఖరాగ్ర సమావేశం సైన్స్టెక్నాలజీ రంగాల్లో సహకారానికి కొత్త దారులను ఏర్పరచడమే కాకుండా ద్వైపాక్షిక సంప్రదింపులు నిర్ణీత క్రమంలో నిర్వహించుకొనేందుకు కూడా పునాది వేసిందని ఆయన అన్నారు.

image.png



సైన్స్‌నవకల్పన రంగాల్లో ప్రపంచానికి నాయకత్వాన్ని అందించగలిగే స్థితికి భారత్ వేగంగా చేరుకొంటోందనిశాస్త్రవిజ్ఞాన ప్రచురణలుఅంకుర సంస్థల కార్యకలాపాల పరంగా ప్రపంచంలో అగ్రగామి మూడు దేశాల్లో భారత్  ఒకటిగా నిలిచిందనీ డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో పునరుత్పాదక ఇంధనంసైబర్-భౌతిక వ్యవస్థలుక్వాంటమ్ సాంకేతికతలునీలి ఆర్థిక వ్యవస్థతక్కువ ఖర్చులోనే ఆరోగ్యసంరక్షణ సేవలను అందించడంతదితర కీలక రంగాల్లో అనేక జాతీయ పథకాలను భారత్ అమలు చేసిందని మంత్రి వివరించారు.

image.png



అంతరిక్ష అన్వేషణలో భారత్ సాధించిన విజయాలను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. 2023 ఆగస్టు లో చంద్ర గ్రహం దక్షిణ ధృవ సమీపంలో దిగిన తొలి దేశంగా భారత్ ఖ్యాతిని  సంపాదించుకొనేటట్లు చంద్రయాన్-3 మిషన్ దోహదపడిందనీఈ మిషన్ అంతరిక్ష రంగ సంబంధిత తయారీపరిశోధన విషయాల్లో ఇండియాను ఒక చైతన్యవంతమైన కూడలిగా  నిలిపిందనీ మంత్రి అన్నారువిశ్వాంతరాళాన్ని శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించుకొనేందుకు భారత్లక్సెంబర్గ్ 2022లో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొన్నప్పటి నుంచీ అంతరిక్ష రంగంలో చురుకైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయని ఆయన గుర్తు చేశారుఆ తరువాతలక్సెంబర్గ్ ఉపగ్రహాలు రెండింటిని భారత పీఎస్ఎల్‌వీ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడమే కాకలక్సెంబర్గ్ అంతరిక్ష సంస్థ నిర్వహించిన ‘‘అంతరిక్ష వనరుల వారోత్సవం-2024’’లో ఇస్రో పాల్గొందనీఇవి ఇరు దేశాల మధ్య విస్తరిస్తున్న సహకారానికి అద్దం పడుతున్నాయన్నారు.
సంయుక్త పరిశోధనతో పాటు ఇరు పక్షాల ప్రయోజనాలూ ముడిపడిన రంగాల్లో పారిశ్రామిక సంబంధాలను ప్రోత్సహించే ఉద్దేశంతో కొత్త కార్యక్రమాలను రూపొందించడంపైనా ప్రధానంగా చర్చించారుసరికొత్తగా  ఉనికిలోకి వస్తున్న సాంకేతికతలుఇంధన ప్రత్యామ్నాయాలుఅంతరిక్ష రంగంలో నవకల్పన పరంగా ఇప్పటికే ఉన్న సంబంధాలను బలపరుచుకోవడంతో పాటు రెండు దేశాల బలాలను ఉపయోగించుకొనే విషయంలో ఉభయపక్షాలూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి.

image.png



ప్రస్తుత చర్చలు అంతరిక్షవిజ్ఞానశాస్త్ర రంగాల్లో భారత్-లక్సెంబర్గ్ సహకారానికి కొత్త ఉత్తేజాన్ని అందిస్తాయన్న ఆశాభావాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యక్తం చేశారుఇది సంరక్షణ ప్రధానమైన ప్రపంచ అభివృద్దికి తోడ్పడటానికి టెక్నాలజీని ఒక శక్తిగా ఉపయోగించాలన్న ప్రధానమంత్రి శ్రీ మోదీలక్సెంబర్గ్ నేతల ఉమ్మడి దృష్టికోణానికి అనుగుణంగా ఉంటుందని ఆయన అన్నారు.  

 image.png

***

 


(Release ID: 2187677) Visitor Counter : 3