శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బహుకరించిన మూడు అద్భుతమైన ఆవిష్కరణలు... క్యూఎస్ఐపీ: స్వదేశీ క్వాంటమ్ భద్రతా చిప్;
25-క్యూబిట్ క్యూపీయూ: భారతదేశపు మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్, భవిష్యత్ కంప్యూటింగ్ కు శక్తి;
కార్-టీ సెల్ థెరపీ: సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మద్దతుతో దేశ ఆవిష్కర్తలు అభివృద్ధి చేసిన మొదటి స్వదేశీ క్యాన్సర్ సెల్ థెరపీ
కార్-టీ సెల్ థెరపీ: ఇమ్యూనోఏసీటీ రూపొందించిన మొదటి స్వదేశీ క్యాన్సర్ సెల్ థెరపీకి మద్దతిచ్చిన డీబీటీ, బీఐఆర్ఏసీ
నాడు పోస్టు చేయడమైనది:
05 NOV 2025 4:07PM by PIB Hyderabad
ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ ఈఎస్ టీఐసీ-2025 కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశానికి మూడు విప్లవాత్మక ఆవిష్కరణలను బహూకరించారు. అవి...
క్యూఎస్ఐపీ: స్వదేశీ క్వాంటమ్ భద్రతా చిప్...
25-క్యూబిట్ క్యూపీయూ: భారతదేశపు మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్, ఇది భవిష్యత్ కంప్యూటింగ్ కు శక్తినిస్తుంది...
కార్-టీ సెల్ థెరపీ: సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మద్దతుతో దేశ ఆవిష్కర్తలు అభివృద్ధి చేసిన మొదటి స్వదేశీ క్యాన్సర్ సెల్ థెరపీ. ఇమ్యునోఏసీటీ అభివృద్ధి చేసిన, ప్రపంచంలోనే మొదటి హ్యూమనైజ్డ్ కార్-టీ థెరపీ నెక్స్ కార్19. ఇది ప్రపంచం కోసం భారత్ లో తయారైన సరికొత్త ఆవిష్కరణ. దీనికి డీబీటీ, బీఐఆర్ఏసీ సంస్థలు మద్దతిచ్చాయి. కెమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్ టీ-సెల్ (కార్ట్-టీ) థెరపీ క్యాన్సర్ చికిత్సలో ఒక అద్భుతమైన ఆవిష్కరణ. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో ముఖ్యంగా, ఎక్యూట్ లింఫోసైటిక్ లుకేమియా చివరిదశ రోగుల్లో ఆశాజనకమైన ఫలితాలు వెల్లడయ్యాయి. నెక్స్ కార్ 19 అనేది భారతదేశపు మొదటి సజీవ కణాల చికిత్స. ఇది శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా, రోగి భద్రత విషయంలో రాజీపడకుండా... జీన్ థెరపీలను తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐఐటీ ముంబై నుంచి ఏర్పడిన ఇమ్యూనోఏసీటీ అనే సంస్థ, టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటరైన సొసైటీ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఆంత్రప్రెన్యూర్ షిప్ లో అభివృద్ధి చెందుతున్న సమయంలో బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్ఏసీ)కి చెందిన బయోనెస్ట్ కార్యక్రమం ద్వారా నిధులు, సలహాలు, వనరులను అందించింది. టాటా మెమోరియల్ ఆసుపత్రిలోని ఏసీటీఆర్‌ఈసీ కేంద్రంలో 2021లో జరిగిన భారతదేశపు మొదటి కార్-టీ చికిత్సకు సంబంధించి లెంటివైరస్ తయారీ, క్లినికల్ ట్రయల్ కు టీఎంసీ-ఐఐటీ ముంబై బృందానికి డీబీటీ, బీఐఆర్ఏసీ సంస్థలు మద్దతిచ్చాయి. టాటా మెమోరియల్ సెంటర్లో వ్యాధిగ్రస్తులైన పిల్లలపై ట్రయల్ కోసం నేషనల్ బయోఫార్మామిషన్ ద్వారా మద్దతిచ్చిన నెక్స్ కార్-19 ప్రాజెక్టులో తయారీ భాగస్వామిగా ఇమ్యునోఏసీటీ వ్యవహరించింది. 200 లీటర్ల జీఎంపీ లెంటివైరల్ వెక్టార్, ప్లాస్మిడ్ వేదికలను ఏర్పాటు చేసేందుకు డీబీటీ సంస్థ బయోఈ3 పాలసీలోని బయో మ్యానుఫ్యాక్చరింగ్ కార్యక్రమం ద్వారా ఇమ్యూనోఏసీటీకి నిధులు అందించింది. ఉత్పత్తిని పెంచటం, కొత్త చికిత్సా పద్ధతిని మరింత అందుబాటులోకి తీసుకురావటమే దీని లక్ష్యం. ఈ వేదిక ద్వారా అధునాతన బయోరియాక్టర్ సాంకేతికతలను ఉపయోగించటం వల్ల కణాలు వేగంగా, ఎక్కువ మొత్తంలో నిరంతరం ఉత్పత్తి అవుతాయి. దీంతో లెంటివైరల్ వెక్టార్ల నాణ్యత, పనితీరు మెరుగుపడతాయి. జీఎంపీ గ్రేడ్ జీన్ డెలివరీ వెక్టార్ ద్వారా ఏడాదికి కనీసం 1000 మంది రోగులకు సెల్, జీన్ థెరపీ చికిత్సకు సహాయం అందించవచ్చు. వివిధ రకాల క్యాన్సర్లను ఎదుర్కొనేందుకు స్వదేశీ, కార్-టీ ఆధారిత చికిత్సలను అభివృద్ధి చసే పరిశోధనలను డీబీటీ ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం విభిన్న రంగాల శాస్త్రవేత్తల బృందాలను ప్రోత్సహిస్తూ, పలు రకాల క్యాన్సర్లకు ఇమ్యూనోథెరపీ పరిష్కారాలను కనుక్కోవటంతో పాటు చికిత్సకు సంబంధించిన దుష్ర్పభావాలను అధిగమించే మార్గాలను అన్వేషిస్తుంది. మల్టిపుల్ మైలోమా (ఎంఎం), ఎక్యూట్ లింఫోసైటిక్ లుకేమియా, రీఫ్రాక్టరీ లేదా రిలాప్స్ డ్ బీ సెల్ ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా, గ్లియోబ్లాస్టోమా వంటి క్యాన్సర్లు ఈ పరిశోధనల్లో ఉన్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2186780)
సందర్శకుల సూచీ సంఖ్య : : 60