రక్షణ మంత్రిత్వ శాఖ
థింక్ 2025 క్విజ్ సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌కు ఆగామి కార్యక్రమాన్ని నిర్వహించిన భారత నేవీ
Posted On:
04 NOV 2025 2:58PM by PIB Hyderabad
థింక్ 25 - ది ఇండియన్ నేవీ క్విజ్ పోటీల సెమీ ఫైనల్స్, గ్రాండ్ ఫైనల్‌ను 2025 నవంబర్ 4, 5 తేదీల్లో ఎజిమలలోని భారత నావికాదళ అకాడమీలో నిర్వహిస్తారు.
ఈ ఏడాది "మహాసాగర్" అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ క్విజ్.. భారతదేశానికి మహాసముద్రాలతో ఉన్న అనుబంధాన్ని, నౌకా వాణిజ్య వారసత్వాన్ని, వ్యూహాత్మక దార్శనికతను, సముద్ర అస్తిత్వాన్ని సూచిస్తుంది. భారత నౌకాదళ అన్వేషణ, స్ఫూర్తి, ఔన్నత్యం, యువతలో నౌకా వాణిజ్యంపై అవగాహనను పెంపొందించాలన్న ప్రాధాన్యతను ఈ క్విజ్ తెలియజేస్తుంది.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిర్వహించిన పోటీల ద్వారా నాలుగు జోన్లు.. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 16 పాఠశాలలు ( జైపూర్ - కేంబ్రిడ్జ్ కోర్టు హైస్కూల్, జయశ్రీ పెరివాల్ హైస్కూల్, సుబోధ్ పబ్లిక్ స్కూల్, చెన్నై - పద్మ శేషాద్రి బాలభవన్ సీనియర్ సెకండరీ స్కూల్, విద్యా మందిర్ సీనియర్ సెకండరీ స్కూల్, భువనేశ్వర్ - డీఏవీ పబ్లిక్ స్కూల్ యూనిట్8, పశ్చిమ బెంగాల్ - సంత్రాగచి కేదార్‌నాథ్ ఇనిస్టిట్యూషన్, కన్నూర్ - భారతీయ విద్యాభవన్, మీరట్ - కేఎల్ ఇంటర్నేషనల్ స్కూల్, దీవాన్ పబ్లిక్ స్కూల్, కొడగు - సైనిక్ స్కూల్, కాన్పూర్ - డాక్టర్ వీరేంద్ర స్వరూప్ ఎడ్యుకేషన్ సెంటర్, ఉదయ్ పూర్ - సెయింట్ ఆంథోనీస్ సీనియర్ సెకండరీ స్కూల్, అమృత్ సర్ - స్ప్రింగ్ డేల్ సీనియర్ స్కూల్, సమస్తిపూర్ - పీఎం శ్రీ జేఎన్వీ, జార్ఖండ్ - శిక్ష నికేతన్) సెమీ ఫైనల్ కు అర్హత సాధించాయి. అత్యుత్తమ ప్రతిభ, జట్టు స్ఫూర్తి, విజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఈ 32 సెమీ-ఫైనలిస్ట్‌లు ప్రతిష్టాత్మకమైన థింక్ 25 ట్రోఫీని గెలుచుకునేందుకు పోటీపడతారు.
భారత నౌకా వాణిజ్య దృక్పథాన్ని విశ్లేషించాలనే లక్ష్యంతో భారత సముద్రయాన సంస్కృతి, నావికా శక్తి, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దటంలో సముద్రాల ప్రాధాన్యతపై విద్యార్థుల్లో అవగాహన పెంచటానికి ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
సెమీ ఫైనల్స్, ఫైనల్స్ కార్యక్రమాలను భారత నేవీ అధికారిక యూట్యూబ్, ఫేస్ బుక్ పేజీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. దీనిద్వారా కేరళలో ఎజిమలలోని భారత నేవీ అకాడమీలో జరిగే ఈ పోటీని ప్రత్యక్షంగా వీక్షించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఉత్సాహాన్ని, స్ఫూర్తిని పొందవచ్చు.
భారత నౌకా దళ- ప్రధాన కార్యక్రమం- థింక్ 25.. యువతను ప్రోత్సహించేలా, విద్యావంతులను చేసేలా, స్ఫూర్తినిచ్చేలా రూపొందించారు. భారతదేశ నౌకా వాణిజ్య రంగం.... దేశ భవిష్యత్తులో పోషించే కీలక పాత్రపై యువతకు లోతైన అవగాహనను కల్పిస్తుంది.
(Release ID: 2186513)
Visitor Counter : 6