ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                    
                    
                        కేరళ ‘పిరవి’ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                01 NOV 2025 9:35AM by PIB Hyderabad
                
                
                
                
                
                
                కేరళ ‘పిరవి’ (ఆవిర్భావ దినోత్సవం) నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కేరళ రాష్ట్ర వాసులు విభిన్న రంగాల్లో రాణిస్తున్నారని, తమ సృజనాత్మకత, ఆవిష్కరణలతో ఉన్నత స్థానాలకు ఎదిగారని శ్రీ మోదీ అన్నారు. ఇక ప్రకృతి సౌందర్యానికి పేరుపడిన ఈ రాష్ట్రం శతాబ్దాల నాటి వారసత్వంతో పాటు ఉజ్వల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. కేరళ ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ నిరంతర విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు ఒక ప్రకటనలో:
“కేరళ ప్రజలందరికీ రాష్ట్ర ‘పిరవి’ (ఆవిర్భావ దినోత్సవ) శుభాకాంక్షలు! అంతర్జాతీయంగా అనేక రంగాల్లో తమ సృజనాత్మకత, ఆవిష్కరణాత్మక ప్రతిభతో రాణిస్తున్న భారతీయులలో ఇక్కడివారు అధికంగా ఉండటం ఈ రాష్ట్ర ప్రత్యేకత. సుందర ప్రకృతికి నెలవైన ఈ రాష్ట్రం శతాబ్దాల నాటి వారసత్వంతో భారత ఉజ్వల సాంస్కృతిక వైభవాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. కేరళ ప్రజలు సర్వదా ఆయురారోగ్యాలతో, నిరంతర విజయాలతో వర్ధిల్లాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను” అని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
 
***
                
                
                
                
                
                (Release ID: 2185536)
                Visitor Counter : 6
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam