ప్రధాన మంత్రి కార్యాలయం
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి సంతాపం
పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం ప్రకటించిన ప్రధానమంత్రి
Posted On:
01 NOV 2025 1:59PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట కారణంగా ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ ద్వారా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
“ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలోగల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట అత్యంత బాధాకరం. తమ సన్నిహితులను, కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
పీఎంఎన్ఆర్ఎఫ్ ద్వారా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం మంజూరు చేస్తున్నాం: ప్రధానమంత్రి”
***
(Release ID: 2185524)
Visitor Counter : 6
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam