ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పసుంపొన్ ముత్తురామలింగ తేవర్ గారి గురు పూజ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

Posted On: 30 OCT 2025 12:35PM by PIB Hyderabad

పూజ్యులు పసుంపొన్ ముత్తురామలింగ తేవర్ గారి గురు పూజ వేడుక సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పించారు.

‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘పూజ్యులు పసుంపొన్ ముత్తురామలింగ తేవర్ జీ పవిత్ర గురు పూజ వేడుక సందర్భంగా ఆయనకు నేను హృదయపూర్వకంగా నివాళి అర్పిస్తున్నాను. శిఖర సమానుడైన ఆయన భారత సామాజిక జీవనం పైన, రాజకీయ జీవనంపైనా అమితమైన ప్రభావాన్ని ప్రసరింపచేశారు. పేద ప్రజానీకం, రైతు జన సంక్షేమంతో పాటు న్యాయం పట్ల, సమానత్వం పట్ల ఆయన కనబరిచిన తిరుగులేని నిబద్ధత తరాల తరబడి స్ఫూర్తిని అందిస్తూనే ఉంటుంది. మర్యాద, ఆత్మగౌరవం, ఏకతా విలువల పక్షాన ఆయన నిలబడ్డారు.. ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజానికి సేవ చేయడం మానలేదు.. ఆధ్యాత్మికతకూ పెద్ద పీట వేశారు.’’    

 

“இந்தியாவின் சமூக மற்றும் அரசியல் வாழ்வில் ஆழமான தாக்கத்தை ஏற்படுத்திய மாபெரும் ஆளுமையான பசும்பொன் முத்துராமலிங்க தேவர் அவர்களுக்குப் புனிதமான குரு பூஜையின் போது மனமார்ந்த அஞ்சலி செலுத்துகிறேன். நீதி, சமத்துவம் ஆகியவற்றுக்கும் ஏழைகள் மற்றும் விவசாயிகளின் நலனுக்கும் அவரது அசைக்க முடியாத அர்ப்பணிப்பு அடுத்தடுத்த தலைமுறைகளுக்கு ஊக்கமளிக்கிறது. கண்ணியம், ஒற்றுமை மற்றும் சுயமரியாதையின் பக்கம் உறுதியாக நின்ற அவர்,  சமூக சேவை செய்வதற்குக் கொண்டிருந்த அசைக்க முடியாத உறுதியுடன் ஆழ்ந்த ஆன்மீகத்தை இணைத்தார்.”


(Release ID: 2184253) Visitor Counter : 4