ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఛఠ్ మహాపర్వం ముగింపు సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 28 OCT 2025 7:56AM by PIB Hyderabad

ఛఠ్ మహాపర్వం ముగింపు సందర్భంగా భక్తులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

నాలుగు రోజుల పాటు జరిగిన ఈ గొప్ప పండుగ ఈ ఉదయం భగవాన్ సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించటంతో ముగిసిందని ప్రధానమంత్రి వెల్లడించారుఈ సందర్భంగాఛఠ్ పూజ సంప్రదాయంతో భారతదేశంలో దివ్య వైభవం కనిపించిందని ఆయన అన్నారు.

భక్తులుఈ పండుగలో పాల్గొన్న వారందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూఛఠీ మాత ఆశీస్సులతో అందరి జీవితాల్లో కాంతులు వెల్లివిరియాలనిప్రజలంతా సంతోషంగా ఉండాలని ప్రార్థించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"ఈరోజు ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించటంతో ఛఠ్ మహాపర్వం శుభప్రదంగా ముగిసిందిఈ నాలుగు రోజుల ఛఠ్ పూజ సందర్భంగా దివ్య వైభవాన్ని మనం చూశాముఈ పవిత్ర పండుగలో పాల్గొన్న భక్తులందరికీవ్రతం ఆచరించిన వారికిమా కుటుంబసభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలుఛఠీ మాతా అనంతమైన ఆశీర్వాదాలతో మీ జీవితాల ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను"

 

***


(रिलीज़ आईडी: 2183450) आगंतुक पटल : 35
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam