ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్‌‌లోని కర్నూలు జిల్లాలో దురదృష్టకర ఘటన.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం


పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి

Posted On: 24 OCT 2025 9:02AM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్‌‌లోని కర్నూలు జిల్లాలో దురదృష్టవశాత్తు చోటుచేసుకున్న ఘటన ప్రాణనష్టానికి దారితీసింది. దీనిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున, ఇదే ఘటనలో గాయపడ్డ వారికి రూ.50,000 చొప్పున పరిహారం అందజేస్తామని ప్రధానమంత్రి తెలిపారు.
‘ఎక్స్‌’లో పీఎంఓ ఇండియా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొంది:
‘‘ఆంధ్రప్రదేశ్‌‌లోని కర్నూలు జిల్లాలో ఓ దుర్ఘటన ప్రాణనష్టానికి దారితీసిందని తెలిసి ఎంతో బాధపడ్డాను. ఈ కష్టకాలంలో బాధితులకు, వారి కుటుంబాలకు నేను సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
మృతులకు ప్రతి ఒక్కరికీ  రూ.2 లక్షల వంతున పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియాను వారి ఆత్మీయులకు ఇస్తాం. గాయపడ్డ వ్యక్తులకు రూ.50,000 వంతున ఇస్తాం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ’’

 

“ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు మరియు వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ , గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా పిఎంఎన్ఆర్ఎఫ్ నుండి ఇవ్వబడుతుంది: PM @narendramodi"

 

***

MJPS/SR


(Release ID: 2182033) Visitor Counter : 10