భారత ఎన్నికల సంఘం
దేశవ్యాప్త ఎస్ఐఆర్ సంసిద్ధతపై రెండు రోజుల పాటు సీఈఓల సమావేశాన్ని నిర్వహిస్తున్న ఎన్నికల సంఘం
Posted On:
22 OCT 2025 6:19PM by PIB Hyderabad
1. ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ మేనేజ్‌మెంట్‌లో (ఐఐఐడీఈఎం) రెండు రోజుల పాటు భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) నిర్వహిస్తున్న ప్రధాన ఎన్నికల అధికారుల (సీఈఓ) సమావేశం ఈ రోజు ప్రారంభమైంది.
2. ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి సమక్షంలో జరిగిన ఈ సమావేశానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేష్ కుమార్ అధ్యక్షత వహించారు. దేశవ్యాప్త ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన సీఈఓ కార్యాలయాలను సంసిద్ధతను ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తెలుసుకుంది.
3. 2025 సెప్టెంబర్ 10న జరిగిన ఎస్ఐఆర్ సంసిద్ధతా సమావేశానికి కొనసాగింపుగా దీనిని నిర్వహించారు. అప్పటి సదస్సులో గత ఎస్ఐఆర్ ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన ఓటర్ల సంఖ్య, గత ఎస్ఐఆర్ అర్హత తేదీ, ఓటర్ల జాబితాల విషయంలో పూర్తి వివరాలతో కూడిన ప్రజెంటేషన్ ఇచ్చారు.
4. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న ఓటర్లను గత ఎస్ఐఆర్‌కు అనుగుణంగా మ్యాప్ చేయాలని సీఈఓలకు ఇచ్చిన ఆదేశాల అమలు పురోగతిని ఎన్నికల సంఘం సమీక్షించింది.
5. డీఈఓలు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓలు, బీఎల్ఏల నియామకం, శిక్షణకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఎన్నికల సంఘం తెలుసుకుంది.
***
(Release ID: 2181821)
Visitor Counter : 5