భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

బీహార్ ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఈసీఐనెట్ లోని సీ - విజిల్ యాప్‌లో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసే అవకాశం

प्रविष्टि तिथि: 21 OCT 2025 7:23PM by PIB Hyderabad

1.2025 బీహార్ శాసనసభ సాధారణ ఎన్నికలకు,  వివిధ రాష్ట్రాల్లో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ - ఎంసీసీ)  కచ్చితంగా పాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత  ప్రభుత్వాలను ఆదేశించింది.

2. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ఫిర్యాదులను 100 నిమిషాల్లోగా పరిష్కరించేందుకు బీహార్ వ్యాప్తంగా 824 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసింది.

3. ప్రజలు/రాజకీయ పార్టీలు కూడా ఈసీఐనెట్ లోని సీ - విజిల్ యాప్‌లో ఎంసీసీ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. 

4. అసెంబ్లీ ఎన్నికలు జరిగే బీహార్ లోనూ, ఉప ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ అక్టోబర్ 21, 2025 నాటికి, సీ - విజిల్ యాప్‌ ద్వారా 650 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిలో, 649 ఫిర్యాదులను పరిష్కరించారు. 612 ఫిర్యాదులను అంటే 94% ఫిర్యాదుల ను 100 నిమిషాల్లోనే పరిష్కరించారు. 

5. ఫిర్యాదుల పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నంబర్ 1950 తో కాల్ సెంటర్ కూడా ఉంది. దీనిలో ప్రజలు లేదా రాజకీయ పార్టీలకు చెందిన ఏ సభ్యుడైనా సంబంధిత డిఈఓ/ ఆర్ఓ వద్ద ఫిర్యాదును నమోదు చేయవచ్చు. ప్రస్తుతం ఈ వ్యవస్థ మొత్తం 24 గంటలూ పని చేస్తోంది. 

6. 21 అక్టోబర్, 2025 నాటికి, వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో చట్టాలను అమలు చేసే వివిధ సంస్థలు కలసి రూ. 71.32 కోట్లకు పైగా విలువైన నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, విలువైన లోహాలు, ఓటర్లకు ఉచితంగా పంచేందుకు ఉద్దేశించిన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి.

 

****


(रिलीज़ आईडी: 2181393) आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Gujarati