కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియాలో లాజిస్టిక్స్ సంస్కరణలు, డిజిటల్ ఆవిష్కరణల ద్వారా వికసిత్ భారత్‌‌ కోసం కృషి చేస్తోన్న తపాలా విభాగం


నిర్ణీత సమయంలో దేశీయ డెలివరీలను పెంచడం, అంతర్జాతీయ లాజిస్టిక్స్‌ను వేగంవతం చేసే ఎనిమిది కొత్త సదుపాయాలను ప్రకటించిన కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా

3.57 కోట్లకు పైగా ఆధార్ నమోదులు, అప్‌డేట్‌లు.. 43 లక్షల పాస్‌పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియ విజయవంతంగా పూర్తి

దేశవ్యాప్తంగా 9.13 లక్షలకు పైగా పీఎం విశ్వకర్మ టూల్‌కిట్‌లు డెలివరీ… డాక్ ఘర్ నిర్యత్ కేంద్రాల ద్వారా విదేశాలకు రూ. 148.19 కోట్ల విలువైన రూ. 6.94 లక్షల షిప్‌మెంట్లు

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో కొత్తగా 3.5 కోట్ల ఖాతాల ప్రారంభం.. 99 శాతానికి ఇంటి వద్దే సేవలు, 59 శాతం మహిళలే

బాలికల పొదుపును ప్రోత్సహించేందుకు 81 లక్షలకు పైగా సుకన్య సమృద్ధి యోజన ఖాతాల ప్రారంభం

Posted On: 17 OCT 2025 7:31PM by PIB Hyderabad

ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో కేంద్ర కమ్యూనికేషన్లుఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎంసింధియా మీడియా సమావేశం నిర్వహించారుగత ఏడాది కాలంగా తపాలా శాఖ (డీఓపీ), టెలికమ్యూనికేషన్ల శాఖ సాధించిన విజయాలను ఆయన వివరించారు.

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతతో సంప్రదాయ పోస్టల్ నెట్‌వర్క్ నుంచి నమ్మకంసాంకేతికతసమ్మిళితత్వంతో కూడిన ప్రతి భారతీయ కుటుంబానికి సేవ చేసే పౌర-కేంద్రీకృత లాజిస్టిక్స్డిజిటల్ సేవల సంస్థగా తపాలా శాఖ సాధించిన అద్బుతమైన పరివర్తనను కేంద్ర మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు.

 

2024 జూన్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా సేవలను అందించడంలో తపాలా శాఖ గణనీయమైన పురోగతిని సాధించిందిదీనికి సంబంధించిన ముఖ్యాంశాలు:

 

* 3.57 కోట్లకు పైగా ఆధార్ నమోదులుఅప్‌డేట్‌లు పూర్తయ్యాయి. 10 కొత్త పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. 43 లక్షల పాస్‌పోర్టుల ప్రక్రియ పూర్తయింది.

దేశవ్యాప్తంగా 9.13 లక్షలకు పైగా పీఎం విశ్వకర్మ టూల్‌కిట్‌లను డెలివరీ చేసిందిడాక్ ఘర్ నిర్యత్ కేంద్రాల ద్వారా రూ. 148.19 కోట్ల విలువైన 6.94 లక్షల షిప్‌మెంట్‌లు విదేశాలకు వెళ్లాయి.

బాలికల పొదుపును ప్రోత్సహించేందుకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 3.5 కోట్ల ఖాతాలను (99% ఇంటి వద్దే, 59% మహిళలు), 81.09 లక్షల సుకన్య సమృద్ధి యోజన ఖాతాలను తెరిచింది.

 

తపాలా విభాగాన్ని మెయిల్పార్శిల్అంతర్జాతీయ సంబంధాలుపీఓఎస్‌బీపీఎల్ఐపౌర కేంద్రీకృత సేవలు అనే ఆరు ఉప విభాగాలుగా పునర్వవస్థీకరించారుసాంకేతికతహెచ్‌ఆర్ఆర్థిక నిర్వహణవినియోగదారుల సంతృప్తి అన్న లక్ష్యాలతో ఈ విభాగాలు పనిచేస్తున్నాయి.

 

ఆత్మనిర్భర్ భారత్ ‌స్ఫూర్తికి అనుగుణంగా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ (సీఈపీటీస్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఐటీ 2.0 ప్రాజెక్టుతో పోస్టల్ విభాగం డిజిటల్ పరివర్తన సాధిస్తోందిలాజిస్టిక్స్ వ్యవస్థను బలోపేతం చేస్తూ వేగవంతమైనమరింత నమ్మదగిన డెలివరీలను అందించేందుకు ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలతో తపాలా విభాగం భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకుందిఇది వస్తు డెలవరీలాజిస్టిక్స్‌కు సంబంధించిన మార్కెట్‌లో వృద్ధిపోటీతత్వాన్ని పెంచుతూనే కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తుందివీటితో పాటు పునరాభివృద్ధి చేసిన సీఆర్ఎం (కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్వేదిక సంప్రదాయ ఫిర్యాదుల పరిష్కారానికి మాత్రమే పరిమితం కాకుండా.. వినియోగదారుల నమ్మకంవిశ్వసనీయతను మెరుగుపరిచేందుకు చురుకైనఅభిప్రాయాల ఆధారిత చర్యలపై దృష్టి సారిస్తోంది.

 

దేశీయఅంతర్జాతీయ రవాణా వ్యవస్థను మరింత ముందుకు తీసుకుపోయేందుకు కొన్ని కొత్త తరహా సేవల్ని కేంద్ర మంత్రి ప్రకటించారు. 24, 48 గంటల డెలివరీకి సంబంధించిన 24 స్పీడ్ పోస్ట్- 48 స్పీడ్ పోస్ట్పూర్తి ట్రాకింగ్‌తో ప్యాకేజీలను తదుపరి రోజే చేరవేసే సౌకర్యం కూడా ఉందిడైరెక్ట్ లైన్ ద్వారా విదేశాలకు వేగంగా షిప్పింగ్ చేయనుందిదీనికోసం తపాలా శాఖ.. వివిధ వాణిజ్య సంస్థలతో భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకుందిస్పీడ్ పోస్ట్ ఇంటర్నేషనల్పార్సెల్ లాస్ట్ మైల్‌..సౌకర్యాల ద్వారా ప్రపంచ దేశాలకు డెలివరీ విషయంలో నిర్ణీత గడువులను అనుసరించటంమెరుగపరచటంతో పాటు భారత ఎగుమతిక్షేత్రస్థాయి కనెక్టివిటీని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

 

దేశీయంగా తపాలా శాఖ డిజిటల్ చిరునామా వ్యవస్థను తీసుకొచ్చిందిదీనిని డిజిపిన్‌గా పిలుస్తారుఇది దేశం మొత్తాన్ని ఖచ్చితమైన 4మీx4మీల భాగాలుగా విభజించిందిప్రతి బ్లాక్‌కు ప్రత్యేకమైన 10-అక్షరాల సంకేతం ఉందిఈ మార్గదర్శక కార్యక్రమం పౌర కేంద్రీకృత తపాలా సేవల్ని పూర్తిగా మార్చేస్తుందిఇది జియోస్పెషియల్ ప్రభుత్వ పాలను బలోపేతం చేయటంతో పాటు అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలలో సామర్థ్యాన్ని పెంచుతుందిఇది బీఎఫ్ఎస్ఐ రంగంలో డిజిటల్ కేవైసీని సులభతరం చేస్తుందిఅంతేకాకుండా దేశవ్యాప్తంగా ఈ-గవర్నెన్స్సేవాలను అందరికి అందుబాటులోకి తేవటంలో విప్లవాత్మక మార్పులతో కూడిన నవ యుగాన్ని ప్రారంభిస్తుంది.

 

లాజిస్టిక్స్ సంస్కరణలుడిజిటల్ ఆవిష్కరణల నుంచి సమ్మిళిత వృద్ధిఎగుమతుల సులభతరం చేయటం వరకు తపాలా విభాగం పనిచేస్తోందివికసిత్ భారత్‌కు తనవంతు తోడ్పాటునందించేందుకు తపాలాశాఖ ఎప్పటికప్పుడు పునర్వవస్థీకరణ చెందుతోంది.

 

****


(Release ID: 2180753) Visitor Counter : 8