రక్షణ మంత్రిత్వ శాఖ
ఆధునిక శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణలపై సదస్సు- 2025... హైదరాబాద్ డీఆర్‌డీఎల్ లో సన్నాహక కార్యక్రమం
प्रविष्टि तिथि:
17 OCT 2025 5:19PM by PIB Hyderabad
హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ వేదికగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అక్టోబర్ 17న ‘‘ఆధునిక శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల సదస్సు (ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ కాన్‌క్లేవ్-ఈఎస్‌టీఐసీ-2025) సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సమ్మేళనంలో ప్రధాన నిర్వాహక సంస్థలలో భాగమైన డీఆర్‌డీఓ.. 11 ఇతివృత్తాల్లో ఒకటైన “ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ తయారీ” అంశానికి నాయకత్వం వహిస్తోంది.
ఆధునిక సాంకేతిక వ్యవస్థలలో సెమీకండక్టర్ల ముఖ్య పాత్ర వహిస్తాయని రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగం (డీడీఆర్అండ్డీ) కార్యదర్శి, డీఆర్‌డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వీ కామత్ అన్నారు. హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. ఆరోగ్య సేవలు, కమ్యూనికేషన్లు, రవాణా, రక్షణ, అంతరిక్షం వంటి కీలక వ్యవస్థల్లో ముఖ్యమైన భాగాలు సెమీకండక్టర్లేనని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు డిజిటలైజేషన్, ఆటోమేషన్ వైపు వేగంగా ముందుకు సాగుతున్న సమయంలో జాతీయ భద్రత, ఆర్థికాభివృద్ధి, సాంకేతిక స్వావలంబనకు సెమీకండక్టర్లు అత్యంత కీలకంగా మారాయని ఆయన చెప్పారు.
దేశంలో సెమీకండక్టర్ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ.. 2021లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి భారత్ కేవలం నాలుగు సంవత్సరాల్లోనే ఆలోచన స్థాయి నుంచి అమలుకు విజయవంతంగా మారిందని డాక్టర్ సమీర్ వీ కామత్ తెలిపారు. పరిశోధన, ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో 2036 నాటికి సెమీకండక్టర్లలో ప్రపంచంలోనే అగ్ర మూడు దేశాల సరసన భారత్‌ను నిలబెట్టాలన్న జాతీయ లక్ష్యాన్ని ఆయన పునరుద్ఘాటించారు. అలాగే సెమీకండక్టర్ సాంకేతికతలో డీఆర్‌డీఓ సాధించిన ప్రగతిని వివరించారు. స్వదేశీ పద్ధతుల ద్వారా 4 అంగుళాల సిలికాన్ కార్బైడ్ (సీఐసీ) వేఫర్ల తయారీ, గాలియమ్ నైట్రైడ్ (జీఏఎన్) ఆధారిత అధిక ఎలక్ట్రాన్ మొబిలిటీ ట్రాన్సిస్టర్లను 150 వాట్ల వరకు తయారు చేయగల సామర్థ్యాన్ని డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిందని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వంలోని 13 మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రధాన శాస్త్రీయ సలహాదారు (పీఎస్ఏ) మార్గదర్శకత్వంలో సంయుక్తంగా ఈసీటీఐసీ-2025ని నిర్వహిస్తున్నాయి. నవంబర్ 3 నుంచి 5 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు. “వికసిత్ భారత్ 2047 - పర్యావరణ అనుకూల ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతి, సాధికారతకు మార్గదర్శకత్వం” అనే ఇతివృత్తం నేపథ్యంగా ఈ సదస్సు జరుగుతుంది.

****
(रिलीज़ आईडी: 2180746)
आगंतुक पटल : 22