రక్షణ మంత్రిత్వ శాఖ
ఆగ్రాలో సమీకృత అత్యాధునిక సాంకేతికత ప్రదర్శనను వీక్షించిన యూఎన్‌టీసీసీ ప్రతినిధులు
Posted On:
15 OCT 2025 5:44PM by PIB Hyderabad
2025 అక్టోబర్ 14 నుంచి 16 వరకు ఢిల్లీలో భారత సైన్యం నిర్వహిస్తున్న ఐక్యరాజ్యసమితి దళాల సహకార దేశాల (యూఎన్‌టీసీసీ) అధిపతుల సదస్సు- 2025లో ఇవాళ సమీకృత అత్యాధునిక సాంకేతికత ప్రదర్శనను వీక్షించారు.
ఈ రోజు ముఖ్యాంశాలు:
ఆగ్రాకు వచ్చిన యూఎన్‌టీసీసీ అధిపతులు సమీకృత అత్యాధునిక సాంకేతికత ప్రదర్శనను వీక్షించారు. కొత్త తరం పరికరాల శ్రేణిని ఈ సందర్భంగా భారత సైన్యం ప్రదర్శించింది. భారత్ స్వయం సమృద్ధికి (ఆత్మ నిర్భరత) ఇస్తున్న ప్రాధాన్యతను.. శాంతి పరిరక్షణ, సమకాలీన కార్యాచరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు వినూత్నమైన భారీ వ్యయంతో కూడిన ఆధునిక పరిష్కారాలను అందిపుచ్చుకోగల సామర్థ్యాన్ని ఈ ప్రదర్శన తెలియజేసింది.
సామరస్య- సాంస్కృతిక వారసత్వ ప్రతీకగా అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా ఉన్న తాజ్ మహల్‌ను ప్రతినిధులు సందర్శించారు. తర్వాత కళాకృతిలోని హెరిటేజ్ కేంద్రానికి వెళ్లిన ఈ బృందం.. అక్కడ భారత కళాత్మక వారసత్వం, గొప్ప సంప్రదాయాలను తెలియజేసే సాంస్కృతిక ప్రదర్శనను వీక్షించారు. ఈ సందర్శన కళాకారులతో మాట్లాడేందుకు, భారత ప్రత్యేక సాంస్కృతిక వారసత్వ హస్తకళలను చూసేందుకు కూడా అవకాశాన్ని కల్పించింది.
సాంస్కృతిక కార్యక్రమాలు
సాయంత్రం యూఎన్‌టీసీసీ ప్రతినిధులు ఎర్రకోట వద్ద లైట్ అండ్ సౌండ్ ప్రదర్శనను చూశారు. ఇది భారతదేశ నాగరికత ప్రయాణం, జాతి గౌరవానికి సంబంధించిన ప్రధాన ఘట్టాలను వివరించింది. ఆధునికత, సుస్థిర పట్టణ రవాణా దిశగా భారత్ చేస్తున్న ప్రయాణంలో ప్రపంచ స్థాయి సాంకేతిక అద్భుతమైన ఢిల్లీ మెట్రో ద్వారా యూఎన్‌టీసీసీ ప్రతినిధులు వేదిక వద్దకు చేరుకున్నారు. పట్టణ రవాణా నుంచి సైనిక సంసిద్ధత వరకు భారత సాంకేతికత ప్రత్యక్ష అనుభవాన్ని యూఎన్‌టీసీసీ ప్రతినిధులు పొందనున్నారు. పురోగతి, ధృడత్వం, ప్రపంచ స్థాయి విషయంలో జాతీయ దృష్టిని ఇవి తెలియజేశాయి.
ఒక దేశంగా భారత్ పాత్రను బలోపేతం చేసిన రెండో రోజు కార్యక్రమాలు.. కార్యాచరణ ప్రదర్శనను సాంస్కృతిక పురోగతితో విజయవంతంగా మిళితం చేశాయి. భారత్.. సైనిక పురోగతి ద్వారా ప్రపంచ శాంతి, స్థిరత్వం విషయంలో ఉమ్మడి ఆకాంక్షలకు దోహదపడటమే కాకుండా.. దేశాల మధ్య స్నేహ వారధిగా నాగరిక ధర్మాన్ని, వారసత్వాన్ని ప్రదర్శిస్తోంది.
ముగింపు చర్చలు, పరిశ్రమ ప్రతినిధులతో చర్చలు, చర్చల ఫలితాల ప్రకటనతో ఈ సదస్సు రేపు ముగియనుంది. బలమైన, సమ్మిళిత, సుస్థిరమైన యూఎన్ శాంతి పరిరక్షక కార్యకలాపాలకు ఇది మార్గాన్ని నిర్దేశిస్తుంది.
***
(Release ID: 2179665)
Visitor Counter : 5