కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

“దీపావళి కానుక”గా ఒక నెలపాటు ‘బీఎన్‌ఎన్‌ఎల్‌’ ఉచిత మొబైల్ సేవలు

Posted On: 15 OCT 2025 6:43PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని అగ్రగామి టెలికమ్యూనికేషన్‌ సేవా ప్రదాత ‘భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్’ (బీఎస్‌ఎన్‌ఎల్‌) కొత్త వినియోగదారులకు దీపావళి కానుక ప్రకటించింది. దీనికింద ఎలాంటి అదనపు చెల్లింపు లేకుండా కేవలం రూపాయి నామమాత్రపు రుసుముతో ఒక నెలపాటు 4జి మొబైల్ సేవలను అందిస్తుంది.

ఈ పండుగ బహుమతి నేటి నుంచి (అక్టోబరు 15) నవంబరు 15 దాకా అమలులో ఉంటుంది.

ప్లాన్‌ (దీపావళి కానుక) ప్రయోజనాలు:

·         అపరిమిత వాయిస్‌ కాల్స్‌ (ప్లాన్‌ నియమనిబంధనల ప్రకారం)

·         రోజుకు 2 జీబీ హైస్పీడ్‌ డేటా

·         రోజుకు 100 ‘ఎస్‌ఎంఎస్‌’లు

·         ఉచిత సిమ్‌ (డీవోటీ మార్గదర్శకాల ప్రకారం కేవైసీ ప్రక్రియ పూర్తిచేయాలి)

ఈ కానుక గురించి ‘బీఎస్‌ఎన్‌ఎల్‌’ సీఎండీ శ్రీ ఎ.రాబర్ట్ జెరార్డ్‌ రవి కింది విధంగా వివరించారు:

  “బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇటీవలే దేశవ్యాప్తంగా ‘మేక్ ఇన్ ఇండియా’ అత్యాధునిక 4జి మొబైల్ నెట్‌వర్కుకు శ్రీకారం చుట్టింది. ఇది స్వయంసమృద్ధ భారత్‌ స్వప్న సాకారానికి తోడ్పడుతుంది. ఈ నేపథ్యంలో దీపావళి కానుగా ప్రకటించిన ప్లాన్‌ కింద- తొలి 30 రోజుల పాటు సేవలు పూర్తిగా ఉచితం. తద్వారా దేశీయంగా రూపొందించిన మా 4జి నెట్‌వర్క్‌ వినియోగదారులకు గర్వకారణం అనిపించేలా సేవలు అందిస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాండ్‌ అనుసంధానిత సేవా నాణ్యత, కవరేజీ, విశ్వసనీయత ఫలితంగా 30 రోజుల ఉచిత వినియోగం తర్వాత కూడా వినియోగదారులు మాతో కొనసాగేందుకు సంసిద్ధులై ఉంటారని మేం విశ్వసిస్తున్నాం.”

దీపావళి కానుక సద్వినియోగం ఇలా:

1.    సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారుల సేవా కేంద్రాన్ని (చెల్లుబాటయ్యే కేవైసీ పత్రాలతో) సందర్శించండి.

2.   ప్లాన్ (₹1 నామమాత్రపు రుసుముతో) అమలు కోసం అభ్యర్థిస్తూ కేవైసీ ప్రక్రియ పూర్తిచేసి, మీ ఉచిత సిమ్‌ను స్వీకరించండి.

3.   సిమ్‌ను మొబైల్‌లో అమర్చి, నిర్దేశిత పద్ధతిలో యాక్టివేషన్‌ ప్రక్రియను పూర్తిచేశాక మీ 30 రోజుల ఉచిత ప్రయోజనాలు అదే తేదీ నుంచి మొదలవుతాయి.

4.   మరింత సమాచారం, సహాయం కోసం 1800-180-1503 నంబరుకు కాల్ చేయండి లేదా bsnl.co.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

 

***


(Release ID: 2179658) Visitor Counter : 4