పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్యారిస్ ఒప్పందం, వాతావరణ లక్ష్యాలను విస్తరించడానికి చర్చలతో కూడిన విధానంపై విశ్వసనీయతను వ్యక్తం చేసిన భారత్


బ్రెజీలియాలో జరిగిన కాప్ 30 సన్నాహాక సమావేశాల్లో వ్యవస్థీకృతమైన, సమతౌల్యమైన భవిష్యత్తు గ్లోబల్ స్టాక్‌ టేక్ పద్ధతులకు పిలుపునిచ్చిన పర్యావరణ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్

Posted On: 14 OCT 2025 10:50AM by PIB Hyderabad

బ్రెజీలీయాలో జరిగిన కాప్30 సన్నాహక సమావేశాల్లో భాగంగా అక్టోబర్ 13న జరిగిన గ్లోబల్ స్టాక్ టేక్ (జీఎస్టీ) బ్రేకవుట్ సెషన్లో కేంద్ర పర్యావరణ అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ప్రసంగించారు. మొదటి జీఎస్టీ విజయవంతంగా పూర్తయిందని చెబుతూ... ఇది పారిస్ ఒప్పందం చురుగ్గా అమలవుతోందని ధ్రువీకరిస్తుందన్నారు.

పారిస్ ఒప్పందం లక్ష్యాల దిశగా ప్రపంచం సాధిస్తున్న సమష్టి ప్రగతిని అంచనా వేసే ఐదేళ్ల ప్రక్రియే జీఎస్టీ. సమష్టి పురోగతిని అంచనా వేయడం, ఇతర అంతరాలను గుర్తించడం, దేశీయంగా, అంతర్జాతీయంగా మెరుగైన చర్యలను కొనసాగించడం అనే మూడు ప్రధాన పాత్రలను పోషించడం ద్వారా లక్ష్యాన్ని బలోపేతం చేసేందుకు జీఎస్టీ రూపుదిద్దుకుందని శ్రీ యాదవ్ తెలియజేశారు.

ఈ నేపథ్యంలో.. ఒప్పందాన్ని నడిపించే, రాజకీయ వేగాన్ని ప్రోత్సహించే, ఉన్నత ఆశయాల దిశగా ప్రయత్నాలను కొసాగించే శక్తిగా జీఎస్టీ పనిచేస్తుందని మంత్రి అన్నారు. చర్చలో ఈ అంశాలపై దృష్టి సారించడం ద్వారా సాధించే జీఎస్టీ ఫలితాలు.. అంతర్జాతీయ సహకారానికి, దేశీయంగా వాతావరణ చర్యలను ప్రోత్సహించడానికి దోహదపడతాయి.

భవిష్యత్తు జీఎస్టీల విషయంలో.. శాస్త్రీయ అంచనా విధానాలు అందించే అంతర్జాతీయ ప్రయోజనాలపై సరైన చర్చ లేకుండా వాటిని అమలు చేయడానికి తొందరపడొద్దని మంత్రి ప్రతిపాదించారు. సైన్స్ ఎల్లప్పుడూ నిర్దుష్టంగా, కచ్చితంగా, స్పష్టంగా ఉండాలని... సంబంధిత వనరులన్నింటికీ పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు.

‘‘వాతావరణ చర్యల లక్ష్యాలను అమలు చేయడంపై మనం దృష్టి సారించాలి. అన్నింటికీ మించి,  అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన వనరులు అందుబాటులో లేకపోవడం అనే అతి పెద్ద సవాలును పరిష్కరించేందుకు ప్రయత్నించాలి’’ అని మంత్రి అన్నారు. ఎలాంటి చర్యలు చేపట్టకుండా నిరంతర సమీక్షలు అసంబద్ధమైనవన్నారు. ‘‘చర్చలు ముఖ్యమే.. కానీ చర్యలు చేపట్టడం అనివార్యం’’ అని అభిప్రాయపడ్డారు.

 

***** 


(Release ID: 2178862) Visitor Counter : 4