మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
రూ. 693 కోట్లకు పైగా విలువైన మత్స్యకార ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ఉత్తరాఖండ్‌లో ట్రౌట్ ఫిషరీస్ ఇనిషియేటివ్.. పుదుచ్చేరిలో స్మార్ట్ హార్బర్..
ఒడిశాలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ వంటి ప్రధాన ప్రాజెక్టులు ప్రారంభం
Posted On:
11 OCT 2025 5:28PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో ఈ రోజు ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన ప్రత్యేక కృషి కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. రూ.35,440 కోట్ల వ్యయం కోట్లతో వ్యవసాయ రంగంలో చేపట్టిన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన, పప్పుధాన్యాల్లో స్వయం-సమృద్ధి సాధన మిషన్ అనే రెండు ప్రధాన పథకాలను ఆయన ప్రారంభించారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, మత్స్య, ఆహార శుద్ధి రంగాల్లో రూ.5,450 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులనూ ప్రారంభించిన ప్రధానమంత్రి వాటిని జాతికి అంకితం చేశారు. దాదాపు రూ.815 కోట్ల విలువైన అదనపు ప్రాజెక్టులకూ పునాది వేశారు. ముఖ్యంగా చిన్న, భూమిలేని రైతులకు అదనపు ఆదాయ వనరులను అందించడానికి పశుసంవర్ధకం, మత్స్య, తేనెటీగల పెంపకం వంటి రంగాలను చురుగ్గా ప్రోత్సహిస్తున్నామని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
రూ. 693 కోట్లకు పైగా విలువైన 16 మత్స్యరంగ ప్రాజెక్టులు: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎమ్ఎస్‌వై), మత్స్య మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఎఫ్ఐడీఎఫ్) కింద దేశవ్యాప్తంగా రూ. 572 కోట్ల విలువైన 7 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన, రూ. 121 కోట్ల విలువైన 9 మత్స్యకార ప్రాజెక్టుల ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, ఉపాధిని సృష్టించడానికి, ఎగుమతులను పెంచడానికి, దేశంలో బ్లూ ఎకానమీలో నవ శకానికి నాంది పలికే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
కొన్ని కీలక ప్రాజెక్టుల వివరాలు:
ఉత్తరాఖండ్‌లో ఎఫ్ఐడీఎఫ్ కింద రూ. 170 కోట్ల విలువైన ట్రౌట్ ఫిషరీస్ ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలో ట్రౌట్ చేపల ఉత్పత్తిని పెంచుతుంది, ఉపాధి అవకాశాలనూ సృష్టిస్తుంది.
పుదుచ్చేరిలోని కారైకల్‌లోని స్మార్ట్ - ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్‌ను రూ. 119.94 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. దీని కోసం చేపల నౌకలను సురక్షితంగా డాకింగ్ చేయడం, పరిశుభ్రమైన చేపల నిర్వహణను ప్రోత్సహించడం, ఎగుమతి, దేశీయ వినియోగం కోసం నాణ్యమైన చేపల ఉత్పత్తి, మార్కెటింగ్‌ను మెరుగుపరుస్తున్నారు. ఆధునిక సౌకర్యంగా రూపొందించిన స్మార్ట్-ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్ తీరప్రాంత కమ్యూనిటీలకు కార్యాచరణ సామర్థ్యం, భద్రత, జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడానికి అధునాతన సాంకేతికతలు, స్థిరమైన మౌలిక సదుపాయాలు, సమగ్ర మత్స్య సేవలను అనుసంధానిస్తుంది.
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎమ్ఎస్‌వై) కింద రూ. 100 కోట్ల వ్యయంతో ఒడిశాలోని సంబల్పూర్‌లో హిరాకుడ్ వద్ద ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ (ఐఏపీ) టిలాపియా, పంగాసియస్ ఉత్పత్తి, కేజ్ ఫార్మింగ్, హేచరీ కార్యకలాపాలు, చేపల ప్రాసెసింగ్‌కు ఊతమిచ్చే సమగ్ర వ్యవస్థ ద్వారా ఆక్వాకల్చర్‌ను సమూలంగా మార్చే లక్ష్యంతో పనిచేస్తుంది. ఈ ప్రాజెక్టులో ఫిష్ పార్క్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్క్, ఫిష్ ప్రాసెస్ పార్క్, ప్యాకింగ్ - నెట్ యాక్సెసరీస్ పార్క్, నాలెడ్జ్ పార్క్, ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ వంటి కీలక విభాగాలు ఉన్నాయి. కార్యాచరణ ప్రారంభమైతే ఇది 1,600 బోనులకు మద్దతు ఇస్తుంది, 1,700 మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది, 700 మందికి శిక్షణనందిస్తుంది.
ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలో రూ. 70 కోట్ల విలువైన సస్టెయినెబుల్ ఆక్వాకల్చర్ న్యూట్రిషన్ హబ్ పర్యావరణహితమైన చేపల దాణా తయారీని ప్రోత్సహిస్తుంది, చేపల ఉత్పత్తిని పెంపొందిస్తుంది, రైతుల లాభదాయకతనూ పెంచుతుంది. ఇది సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆధునిక ఆక్వాకల్చర్ పద్ధతులు, అధునాతన పోషకాహార పరిష్కారాలకూ మద్దతునిస్తుంది.
ప్రారంభించిన/శంకుస్థాపన చేసిన మత్స్య రంగ ప్రాజెక్టుల వివరాలు:
శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరిగిన మత్స్యరంగ ప్రాజెక్టులు
|
వరుస
సంఖ్య
|
రాష్ట్రం
|
శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరిగిన మత్స్యరంగ ప్రాజెక్టులు
|
ప్రాజెక్టు వ్యయం (రూ. కోట్లలో)
|
వ్యాఖ్యలు
|
(i)
|
(ii)
|
(ii)
|
(iii)
|
(iv)
|
శంకుస్థాపన జరిగినవి
|
1
|
ఒడిశా
|
భువనేశ్వర్, ఖోర్డాలో అత్యాధునిక హోల్‌సేల్ చేపల మార్కెట్
|
59.13
|
44 మంది టోకు వ్యాపారులకు, 99 మంది రిటైలర్లకు స్థలాన్ని అందించడం. ఇది ఒడిశాలోని భువనేశ్వర్, కటక్ నగరాలకు నాణ్యమైన చేపల సరఫరాను అందిస్తుంది. మత్స్యకారులు, రైతుల కోసం మార్కెట్ విస్తరణ.
|
2
|
ఒడిశా
|
అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఆక్వాపార్క్, హిరాకుడ్
|
100.00
|
ఇది 1600 మంది కేజ్ రైతులకు.. టిలాపియా, పంగాసియస్ ఉత్పత్తి, ప్రాసెసింగ్‌కు.. మంచినీటి జాతుల విత్తనోత్పత్తి కోసం హేచరీకి.. రైతులకు సేవాపరమైన మద్దతునిస్తుంది
|
3
|
పుదుచ్చేరి
|
స్మార్ట్-ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్, కారైకల్
|
119.94
|
స్మార్ట్ - ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్ చేపల నౌకలను సురక్షితంగా డాకింగ్ చేయడం, పరిశుభ్రమైన చేపల నిర్వహణ, దేశీయ, ఎగుమతి మార్కెటింగ్ కోసం నాణ్యమైన చేపల ఉత్పత్తిని సులభతరం చేస్తుంది.
|
4
|
ఉత్తరాఖండ్
|
ఎఫ్ఐడీఎఫ్ కింద ఆమోదం పొందిన ఉత్తరాఖండ్‌లోని ట్రౌట్ ఫిషరీస్
|
170.00
|
ట్రౌట్ చేపల ఉత్పత్తిని పెంచడం.
|
5
|
నాగాలాండ్
|
నాగాలాండ్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్
|
50.00
|
ఈ ప్రాజెక్ట్ చేపల ఉత్పత్తిని స్థిరంగా పెంచడానికి, యువతతో పాటు ఔత్సాహికత పారిశ్రామికవేత్తలకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధిని అందించే ఒక ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్ సిస్టమ్స్
|
6
|
జార్ఖండ్
|
సుర్దిబ్ నేచురల్ ఫిషింగ్-ఎకో టూరిజం, ఖర్సావాన్
|
3.68
|
ఈ ప్రాజెక్ట్ గ్రామీణ జీవనోపాధి స్థిరమైన మెరుగుదల కోసం ఒక ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్ సిస్టమ్స్, ఇది ఎఫ్ఐడీఎఫ్ కింద ప్రైవేట్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆమోదం తెలిపినది
|
7
|
ఉత్తర్ ప్రదేశ్
|
ఏబీఐఎస్ ఎక్స్‌పోర్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ (ఛత్తీస్‌గఢ్ నుంచి)
|
70.00
|
ఎఫ్ఐడీఎఫ్ కింద ఆమోదం లభించిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో గల నౌఖేరాలో సస్టెయినెబుల్ ఆక్వాకల్చర్ న్యూట్రిషన్ హబ్‌పై ఒక వినూత్న ప్రాజెక్టు
|
|
|
సబ్-టోటల్
|
572.75
|
|
ప్రారంభోత్సవం
|
8
|
అస్సాం
|
అస్సాంలోని తేజ్‌పూర్‌లో పీఎమ్‌కేఎస్‌వై కింద రెండు చేపల దాణా ప్లాంట్లు
|
13.00
|
చేపల పెరుగుదల, ఆరోగ్యం, తుది మత్స్య ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించడానికి చేపలకు పోషక సమతుల్య ఆహారాన్ని తయారు చేయడం ద్వారా చేపల ఉత్పత్తిని పెంచడం ఈ ప్రాజెక్టుల లక్ష్యం.
|
9
|
ఉత్తర్ ప్రదేశ్
|
వారణాసి డివిజన్‌లోని చందౌలిలో అత్యాధునిక హోల్‌సేల్ చేపల మార్కెట్
|
61.50
|
ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో చేపల ఉత్పత్తి, మార్కెటింగ్, వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా గలవి.
|
10
|
మధ్య ప్రదేశ్
|
ఐస్ ప్లాంట్లు, ఆర్ఎఎస్, బయో-ఫ్లాక్‌లు, రవాణా వాహనాలు మొదలైన వాటిపై పీఎమ్ఎమ్ఎస్‌వై కింద ఆమోదం పొందిన 14 లబ్ధిదారుల ప్రాజెక్టులు
|
5.28
|
ఈ ప్రాజెక్టులు రైతుల ఆదాయాన్ని పెంచడానికి, జీవనోపాధిని మెరుగుపరచడానికి దారితీసిన ‘తక్కువ నీళ్లు-ఎక్కువ పంట’ నినాదానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చడం ద్వారా చేపల ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడానికి ఉద్దేశించినవి
|
11
|
హర్యానా
|
6 కోల్డ్ స్టోరేజీలు, ఒక ఆర్నమెంటల్ బ్రూడ్ బ్యాంకు, 2 దాణా మిల్లులు
|
11.00
|
ఈ ప్రాజెక్టులు మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడం ద్వారా చేపల ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్‌ను పెంచడం లక్ష్యంగా గలవి
|
12
|
ఉత్తర్ ప్రదేశ్
|
8 ఆర్ఏఎస్‌లు, దాణా మిల్లులు, 2 లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్, కియోస్క్‌లు
|
2.47
|
ఈ ప్రాజెక్టులు రైతుల ఆదాయాన్ని పెంచడానికి, జీవనోపాధిని మెరుగుపరచడానికి దారితీసిన ‘తక్కువ నీళ్లు-ఎక్కువ పంట’ నినాదానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చడం ద్వారా చేపల ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడానికి ఉద్దేశించినవి
|
13
|
ఆంధ్ర ప్రదేశ్
|
ఆనంద ఫుడ్స్ (ఎఫ్ఐడీఎఫ్ కింద ఆమోదం పొందిన సీఫుడ్ ప్రాసెసింగ్ సౌకర్యం అప్‌గ్రేడేషన్)
|
11.00
|
ఈ ప్రాజెక్టులు చేపల ప్రాసెసింగ్, విలువ మెరుగుపరచడం, మార్కెటింగ్, ఎగుమతులను పెంచడం, చేపలు, రొయ్యల నిల్వ, మార్కెటింగ్‌ను పెంచడం ద్వారా మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా గలవి
|
14
|
మిజోరం
|
పీఎమ్ఎమ్ఎస్‌వై కింద ఆమోదం పొందిన కేజ్‌లు, బయో-ఫ్లాక్‌లు, హేచరీ
|
5.13
|
ఈ ప్రాజెక్టులు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం ద్వారా చేపల ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడం, మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా గలవి
|
15
|
జార్ఖండ్
|
ఆర్ఏఎస్/బయోఫ్లోక్/కోల్డ్ స్టోరేజ్/రిజర్వాయర్ కేజెస్/దాణా మిల్లు
|
4.75
|
ఈ ప్రాజెక్టులు రైతుల ఆదాయాన్ని పెంచడానికి, జీవనోపాధిని మెరుగుపరచడానికి దారితీసిన ‘తక్కువ నీళ్లు-ఎక్కువ పంట’ నినాదానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చడం ద్వారా చేపల ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడానికి ఉద్దేశించినవి
|
16
|
ఛత్తీస్‌గడ్
|
పీఎమ్ఎమ్ఎస్‌వై కింద కేజ్‌లు, బయో-ఫ్లాక్స్ చెరువులపై 16 ప్రైవేట్ ప్రాజెక్టులకు ఆమోదం
|
6.92
|
ఈ ప్రాజెక్టులు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చేపల ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడానికి ఉద్దేశించినవి
|
సబ్-టోటల్
|
121.05
|
|
గ్రాండ్-టోటల్
|
693.80
|
|
దేశంలోని 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక మత్స్యకారులు, చేపల పెంపకందారులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశం నలుమూలల నుంచి దాదాపు యాభై మంది ప్రగతిశీల మత్స్య రైతు లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిలో ఎనిమిది మంది రైతులు ప్రధానమంత్రితో ముఖాముఖి సంభాషించే అవకాశం పొందారు. వారిలో కేరళ నుంచి శ్రీ టి పురుషోత్తమన్, ఆంధ్రప్రదేశ్ నుంచి గద్దె క్రాంతి, ఉత్తరప్రదేశ్ నుంచి డాక్టర్ సుబుహి అబిది, ఉత్తరాఖండ్ నుంచి శ్రీ సందీప్ సింగ్ పంచ్పాల్, ఛత్తీస్‌గఢ్ నుంచి శ్రీ సుఖ్‌దేవ్ మండల్, జార్ఖండ్ నుంచి శ్రీ మనోజ్ కుమార్, దక్షిణ అండమాన్ నుంచి శ్రీ డి. దురై సెల్వం, జమ్మూ కాశ్మీర్ నుంచి శ్రీ అబిద్ హుస్సేన్ షాలు ఉన్నారు.
***
(Release ID: 2178055)
Visitor Counter : 7