కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

6జీ భవిష్యత్తును ప్రపంచ ప్రజా ప్రయోజనంగా తీర్చిదిద్దడానికి ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేసిన ప్రధాన 6జీ కూటములు, పరిశోధనా సంస్థలు


డిజైన్ పరంగా తదుపరి తరం వైర్‌లెస్ కమ్యూనికేషన్‌ను సురక్షితంగా, బహిరంగంగా, పటిష్టంగా, సమ్మిళితంగా, సుస్థిరంగా తీర్చిదిద్దాలని సంకల్పం

సహకారం, పారదర్శకత, పరస్పర విశ్వాసం ఆధారంగా ఉమ్మడి అంతర్జాతీయ సృష్టిగా 6జీని గుర్తించిన న్యూఢిల్లీ డిక్లరేషన్

ప్రతి దేశం, ప్రతి సంస్థ, ప్రతి పౌరుడికి సాధికారత కల్పించడం లక్ష్యంగా కనెక్టివిటీని తక్కువ ధరకు అందుబాటులో ఉంచడం ద్వారా 6జీని ప్రపంచ ప్రజా ప్రయోజనంగా అభివృద్ధి చేసేందుకు భాగస్వామ్య దేశాల నిబద్ధత

Posted On: 11 OCT 2025 5:01PM by PIB Hyderabad

ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025తో పాటు జరిగిన అంతర్జాతీయ భారత్ 6జీ సదస్సు 2025లో, ప్రముఖ అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు 6జీ భవిష్యత్తును ప్రపంచ ప్రయోజనంగా తీర్చిదిద్దడానికి ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఈ సంస్థలలో  "భారత్ 6జి, 6జి స్మార్ట్ నెట్‌వర్క్స్ అండ్ సర్వీసెస్ ఇండస్ట్రీ అసోసియేషన్ (6జి-ఐఎ), ఎటిఐఎస్ నెక్స్ట్ జి అలయన్స్, ఎక్స్‌జిఎంఎఫ్, 6జి ఫోరమ్, 6జి బ్రెజిల్, యుకెఐ-ఎఫ్ఎన్ఐ, యుకె టిన్, యుకె ఫెడరేటెడ్ టెలికామ్స్ హబ్స్ (చద్దార్, హెచ్ఎఎస్‌సి, జాయినర్ అండ్ టైటాన్), 6జి ఫ్లాగ్‌షిప్" ఉన్నాయి. 

 

         తదుపరి తరం కనెక్టివిటీ కింద విధంగా ఉండేలా ఈ సంస్థలన్నీ కలసి 6 జీ కోసం మార్గదర్శక సూత్రాలను ఆమోదించారు, 

*విశ్వసనీయం, సురక్షితం

*నిరోధక సామర్ధ్యం, నమ్మకం

*బహిరంగం, పరస్పర నిర్వహణ యోగ్యం

*సమ్మిళితం, ఖర్చు తక్కువ

*సుస్థిరం, ప్రపంచవ్యాప్త అనుసంధానం

డిజైన్ దశలోనే విశ్వసనీయత కలిగిన నెట్‌వర్క్‌ల ఆవశ్యకతను ఈ ప్రకటన స్పష్టం చేసింది. టెలికాం రంగం అంతటా  విశ్వసనీయ వ్యవస్థలు, నష్ట నివారణ, ఏఐ ఆధారిత రక్షణ చర్యలను ప్రముఖంగా ప్రస్తావించింది.

లక్షల కోట్ల పరికరాలు,  ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఎల్లప్పుడూ కనెక్టివిటీ లభించేలా దృఢమైన ఇంజనీరింగ్, వైఫల్య రక్షణ డిజైన్, గోప్యతా పరిరక్షణ నిర్మాణాలు కీలకం కానున్నాయి.

6జీని ప్రపంచ ప్రజా ప్రయోజనంగా అభివృద్ధి చేయాలని గుర్తిస్తూ,  బహిరంగ, పారదర్శక, సమగ్ర ప్రమాణీకరణకు ఈ ప్రకటన పిలుపునిచ్చింది. 

బహిరంగ సమావేశాలు, బహుళ విక్రేతల పరస్పర అనుసంధానత, ఏఐ ఆధారిత నెట్‌వర్క్ సమన్వయాన్ని  ప్రోత్సహిస్తూ, ఆవిష్కరణను వేగవంతం చేయడం,  ఖర్చు తక్కువగా ఉండేలా చేయడంపై సంయుక్త ప్రకటన దృష్టి పెట్టింది.

ఈ ప్రకటన 6జీ రూపకల్పనలో స్థిరత్వానికి పెద్దపీట వేసింది, ఇంధన సమర్థవంతమైన, మరమ్మతులు చేయగల, పునర్వినియోగపరచదగిన వ్యవస్థలకు పిలుపునిచ్చింది, ఇవి కార్బన్ ను తగ్గించడంతోపాటు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంచడంపై  చేయడంపై దృష్టి పెట్టింది.

భూమి, సముద్రం, గాలి,  అంతరిక్షంలో అంతరాయం లేని కనెక్టివిటీని అందించడానికి  భూసంబంధిత, భూ సంబంధం లేని నెట్‌వర్క్‌లను, ఉపగ్రహాలను, ఎత్తైన వేదికలను, భవిష్యత్ అంతరిక్ష ఆధారిత వ్యవస్థల ఏకీకరణ ద్వారా మొదటి నుంచి చివరి వరకు గ్లోబల్ కవరేజ్ ను సాధించాలనే  లక్ష్యాన్ని ప్రకటన వెల్లడించింది. 

వేగంగా అభివృద్ధి చెందుతున్న టెలికాం రంగం కోసం తర్వాతి తరాన్ని సిద్ధం చేయాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ, నైపుణ్యాల అభివృద్ధి, సామర్థ్యం పెంపొందించడంపై ఈ ప్రకటన ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

భవిష్యత్ 6జీ,   సమీకృత భూసంబంధిత, భూ సంబంధం లేని వ్యవస్థలను రూపొందించడానికి అమలు చేయడానికి, భద్రపరచడానికి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, నెట్‌వర్క్ ప్రమాణాలలో  ప్రతిభా వనరులను అభివృద్ధి చేయడానికి భాగస్వామ్య సంస్థలు నిబద్ధతను ప్రకటించాయి.

ఈ భాగస్వామ్య సూత్రాలను అన్వయించుకోవాలని  సదస్సులో పాల్గొన్న భారత్ 6జీ, 6జీ-ఐఏ, ఏటీఐఎస్ నెక్స్ట్ జీ అలయన్స్, ఎక్స్జీఎంఎఫ్, 6జీ ఫోరం, యూకే టీఐఎన్, యూకే ఫెడరేటెడ్ టెలికాం హబ్స్, 6జీ ఫ్లాగ్షిప్, 6జీ బ్రెజిల్, యూకేఐ-ఎఫ్ఎన్ఐ సంస్థలు ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, పౌర సమాజానికి పిలుపునిచ్చాయి.

"భద్రత, బహిరంగ, సుస్థిర, సమ్మిళిత, అందుబాటు ధర, స్థిరత్వం, విశ్వాసం వంటి మౌలిక సూత్రాలతో 6జీని నిలపడం ద్వారా, సమాజాలను ముందుకు నడిపించేందుకు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలను వేగవంతం చేసేందుకు, ఏ ఒక్కరూ  వెనుకబడకుండా చూసేందుకు దోహదపడే నెట్‌వర్క్ నిర్మాణానికి మేం కట్టుబడి ఉన్నాం” అని ప్రకటన పేర్కొంది.

6జీని నిజమైన సార్వత్రిక, విశ్వసనీయ, సమ్మిళిత మేధో నెట్‌వర్క్‌గా మార్చడంలో ప్రపంచ సమష్టి ప్రయత్నంగా న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ భారత్ 6జీ సింపోజియం 2025 విడుదల చేసిన ఈ సంయుక్త ప్రకటన ఒక మైలురాయిని సూచిస్తుంది: 

Follow DoT Handles for more: -

X - https://x.com/DoT_India

Insta-  https://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ==

Fb - https://www.facebook.com/DoTIndia

Youtube: https://youtube.com/@departmentoftelecom?si=DALnhYkt89U5jAaa


(Release ID: 2177963) Visitor Counter : 2