రక్షణ మంత్రిత్వ శాఖ
కాన్ బెర్రాలో ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రితో రక్షణ మంత్రి ద్వైపాక్షిక సమావేశం
అమరులైన యుద్ధ వీరులకు ఆస్ట్రేలియన్ వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించిన రక్షణ మంత్రి
Posted On:
09 OCT 2025 9:18PM by PIB Hyderabad
రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అక్టోబర్ 9, 2025న కాన్‌బెర్రాలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి శ్రీమతి పెన్నీ వాంగ్‌తో భేటీ అయ్యారు. భారత్-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు.. రక్షణ, భద్రత, ప్రాంతీయ స్థిరత్వ రంగాల్లో సహకారాన్ని పెంపొందించటానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు ఇరుదేశాల నేతలు తెలిపారు.
వాణిజ్యపరమైన ప్రయోజనాలపై కాకుండా పరస్పర విశ్వాసం, ప్రజాస్వామ్య సిద్ధాంతాలను పంచుకోవటం ద్వారా భారత్-ఆస్ట్రేలియా స్నేహం బలంగా మారుతుందని శ్రీ రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా సమాజానికి ప్రవాస భారతీయులు అందిస్తున్న సహకారాన్ని శ్రీమతి వాంగ్ ప్రశంసించారు. భౌగోళికంగా రెండు దేశాలు దూరంగా ఉన్నప్పటికీ, ఆలోచనా విధానం, విలువలు ఒకేలా ఉంటాయని ఆమె అన్నారు.
కాన్‌బెర్రాలోని ఆస్ట్రేలియన్ వార్ మెమోరియల్ టూంబ్ ఆఫ్ ది ఫాలెన్ సోల్జర్ వద్ద అమరులైన యుద్ధ వీరులకు శ్రీ రాజ్ నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. ఆస్ట్రేలియా వీరులతో కలిసి ధైర్యంగా పోరాడిన భారతీయ సైనికుల స్మృతికి ఆయన గౌరవ వందనం చేశారు. ఇది రెండు దేశాల సాయుధ దళాల శాశ్వత స్నేహం, త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుంది.
పర్యటన ప్రారంభంలో ఆస్ట్రేలియా పార్లమెంటులో రక్షణ మంత్రికి ఘన స్వాగతం లభించింది. శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌ను విశిష్ట సందర్శకుడిగా పార్లమెంటు స్పీకర్ శ్రీ మిల్టన్ డిక్ ఆహ్వానించారు. ద్వైపాక్షిక భాగస్వామ్య దృఢత్వాన్ని తెలియజేసేలా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి శ్రీ ఆంథోనీ అల్బనీస్ సహా పలువురు పార్లమెంటు సభ్యులు రక్షణ మంత్రికి శుభాకాంక్షలు తెలిపి, మర్యాదపూర్వకంగా సంభాషించారు.
***
(Release ID: 2177485)
Visitor Counter : 19