భారత ఎన్నికల సంఘం
జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, మిజోరం, ఒడిశాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల
Posted On:
06 OCT 2025 7:28PM by PIB Hyderabad
జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, మిజోరం, ఒడిశాలోని కింది అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీగా ఉన్న దృష్ట్యా భర్తీ చేసేందుకు ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది:
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం
|
నియోజకవర్గం నంబరు, పేరు
|
ఖాళీకి కారణం
|
1
|
జమ్మూ కాశ్మీర్
|
27- బుద్గాం
|
శ్రీ ఒమర్ అబ్దుల్లా రాజీనామా
|
2
|
77- నగ్రోటా
|
శ్రీ దేవేందర్ సింగ్ రాణా మరణం
|
3
|
రాజస్థాన్
|
193- అంట
|
శ్రీ కన్వర్‌లాల్‌పై అనర్హత వేటు
|
4
|
జార్ఖండ్
|
45- ఘట్సీల (ఎస్టీ)
|
శ్రీ రాందాస్ సోరెన్ మరణం
|
5
|
తెలంగాణ
|
61- జూబ్లీహిల్స్
|
శ్రీ మాగంటి గోపీనాథ్ మరణం
|
6
|
పంజాబ్
|
21- టార్న్ తరణ్
|
డాక్టర్ కాశ్మీర్ సింగ్ సోహల్ మరణం
|
7
|
మిజోరం
|
2- దంపా (ఎస్టీ)
|
శ్రీ లాల్రింట్లుంగా సాయిలా మరణం
|
8
|
ఒడిషా
|
71- నువాపడ
|
శ్రీ రాజేంద్ర ధోలాకియా మరణం
|
ఉప ఎన్నిక షెడ్యూల్ అనుబంధం-Iలో ఉంది.
1. ఓటర్ల జాబితా
అప్‌డేట్ చేసిన ఓటర్ల జాబితాలు పారదర్శక, న్యాయబద్ధతతో కూడిన విశ్వసనీయ ఎన్నికలకు ఆధారమని ఎన్నికల సంఘం గట్టిగా నమ్ముతోంది. అందుకే ఈ జాబితా నాణ్యత, విశ్వసనీయతను మెరుగుపరచడంపై నిరంతరంగా దృష్టి పెడుతోంది. ఎన్నికల చట్టాల (సవరణ) చట్టం-2021 ద్వారా ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్ 14లో చేపట్టిన సవరణ ప్రకారం ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఒక సంవత్సరంలో నాలుగు తేదీలను అర్హతగా తీసుకోవాలి. దీని ప్రకారం 2025 జూలై 1 అర్హత తేదీతో (జమ్మూ కాశ్మీర్ మినహా పైన పేర్కొన్న అన్ని ఏసీలకు) ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను(ఎస్ఎస్ఆర్) ఎన్నికల సంఘం చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో 2025 జూలై 1 అర్హత తేదీతో ఓటర్ల జాబితాలో నమోదయ్యేందుకు అర్హతగల వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. జమ్మూ కాశ్మీర్‌లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 2025 ఏప్రిల్ 1 అర్హత తేదీతో ఎస్ఎస్ఆర్‌ను పూర్తి చేసింది. 27- బుడ్గామ్, 77- నగ్రోటాకు సంబంధించిన ఎస్‌ఎస్‌ఆర్ తుది ఓటర్ల జాబితాను 05.05.2025న, 45-ఘట్సిలా (ఎస్టీ) జాబితాను 29.09.2025న.. 21-టార్న్ తరణ్, 2- డంపా(ఎస్టీ), 61- జూబ్లీహిల్స్ జాబితాలను 30.09.2025న.. 193-అంటా జాబితాను 01.10.2025న ప్రచురించారు. 71-నౌపాడా నియోజకవర్గ ఓటర్ల జాబితాను 09.10.2025న ప్రచురించనున్నారు.
సమీప అర్హత తేదీ నిబంధనను పాటిస్తూ నామినేషన్ దాఖలు చివరి తేదీకి 10 రోజుల ముందు వరకు అందే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటూ ఓటరు జాబితాను అప్‌డేట్ చేయనున్నారు. ఈ ప్రక్రియ నామినేషన్లు ముగిసే తేదీ వరకు కొనసాగుతుంది.
2. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) - వీవీప్యాట్‌లు
ఉప ఎన్నికలకు సంబంధించిన అన్ని పోలింగ్ కేంద్రాలలో ఈవీఎం, వీవీప్యాట్‌లను ఉపయోగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇవి తగిన సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. వీటి సహాయంతో పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంటోంది.
3. ఓటర్ల గుర్తింపు
ఓటరు గుర్తింపు కార్డు (ఈపీఐసీ) ఓటర్లను గుర్తించేందుకు ప్రధాన పత్రంగా ఉంటుంది. అయితే కింద పేర్కొన్న వాటిని పోలింగ్ కేంద్రంలో చూపించి ఓటు వేయొచ్చు:
i .ఆధార్ కార్డు
ii . ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ జాబ్ కార్డ్
iii .బ్యాంక్ లేదా పోస్టాఫీసు జారీ చేసిన ఫోటోతో ఉన్న పాస్‌బుక్
iv. కార్మిక మంత్రిత్వ శాఖ పథకం/ఆయుష్మాన్ భారత్ కింద జారీ అయిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్
v. డ్రైవింగ్ లైసెన్స్
vi . పాన్ కార్డు
vii . ఎన్‌పీఆర్ కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు
viii . భారత పాస్‌పోర్ట్
ix. ఫోటోతో కూడిన పింఛను పత్రం
x . కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థలు లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఉద్యోగులకు జారీ చేసిన ఫోటోతో ఉన్న సర్వీస్ గుర్తింపు కార్డులు
xi . ఏంపీ లేదా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు
xii . కేంద్ర ప్రభుత్వంలోని సామాజిక న్యాయం - సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూడీఐడీ( యూనిక్ డిసేబిలిటీ ఐడీ కార్డు)
4. ఎన్నికల ప్రవర్తనా (మోడల్ కోడ్) నియమావళి
ఎన్నికలు జరిగే అసెంబ్లీ నియోజకవర్గంలోని కొంత భాగం లేదా మొత్తం ఉన్న జిల్లాలో(జిల్లాల్లో) ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వస్తుంది. ఇది 2024 జనవరి 02 నాడు లేఖ నం. 437/6/1ఎన్ఎస్‌టీ/ఈసీఐ/ఎఫ్‌యూఎన్‌సీటీ/ఎంసీసీ/2024/(బై ఎలక్షన్స్) (కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది) ద్వారా ఎన్నికల సంఘం ఇచ్చిన సూచనలు, నిబంధనలకు లోబడి ఉంటుంది.
5. నేర చరిత్ర ఉన్న అభ్యర్థులకు సంబంధించిన సమాచారం
నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు ప్రచార రోజుల్లో మూడు సార్లు వార్తాపత్రికలలో, టెలివిజన్ ఛానళ్ల ఈ సమాచారాన్ని ప్రకటించాలి. నేర చరిత్ర ఉన్న అభ్యర్థులను దింపే రాజకీయ పార్టీ కూడా అభ్యర్థుల నేర నేపథ్యానికి సంబంధించిన సమాచారాన్ని మూడు సార్లు.. పార్టీ వెబ్‌సైట్‌తో పాటు వార్తాపత్రికలు, టెలివిజన్ ఛానళ్లలో ప్రచురించాలి.
అభ్యర్థుల నేపథ్యం గురించి ఓటర్లు తెలుసుకునేందుకు తగినంత సమయం ఉండేలా చూసుకునేందుకు.. 2020 సెప్టెంబర్ 16 నాటి లేఖ నం. 3/4/2019/ఎస్‌డీఆర్/వాల్యూమ్. IV ద్వారా ఎన్నికల సంఘం ఈ ప్రకటనలు ఈ కింది మూడు సందర్భాల్లో ఇవ్వాలని ఆదేశించింది.
ఏ. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత మొదటి 4 రోజుల్లోపు
బీ. తర్వాత 5 నుంచి 8 రోజుల మధ్య
సీ. 9వ రోజు నుంచి ప్రచారం చివరి రోజు వరకు (పోలింగ్ తేదీకి ముందు రెండో రోజు)
(ఉదాహరణ: ఉపసంహరణకు చివరి తేదీ నెలలో 10వ తేదీ, పోలింగ్ అదే నెలలో 24వ తేదీ అయితే.. మొదటి ప్రకటన ఆ నెలలో 11 నుంచి 14వ తేదీల మధ్య ఉండాలి. రెండో, మూడో ప్రకటనలు ఆ నెలలో వరుసగా 15 నుంచి 18 మధ్య, 19 నుంచి 22వ తేదీల మధ్య ఉండాలి)
2015లోని రిట్ పిటిషన్ (సీ) నం. 784, 2011లోని రిట్ పిటిషన్ (సివిల్) నం. 536లలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ ప్రకటనలు తప్పనిసరి.
రాజకీయ పార్టీలు నేర చరిత్ర ఉన్న అభ్యర్థులను ఎన్నికల కోసం ఎంచుకున్నట్లయితే 48 గంటల్లోపు ఆ సమాచారాన్ని, అభ్యర్థిని ఎంచుకునేందుకు గల కారణాలను వార్తాపత్రికలు, దాని అధికారిక సోషల్ మీడియా హ్యాండిళ్లలో ప్రకటించాలి. దీనితో పాటు పార్టీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. దీనికి సంబంధించిన వివరాలు కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న 11.01.2022 నాటి లేఖ నం. 3/4/2021/ఎస్‌డీఆర్/వాల్యూమ్l.IIIలో ఉన్నాయి.
ఈ సమాచారం ‘నో యూవర్ క్యాండిండేట్’ అనే యాప్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.
6. బకాయిలు లేవని తెలిపే ధ్రువీకరణ పత్రం
ఎన్నికల నోటిఫికేషన్ తేదీకి ముందున్న 10 సంవత్సరాలలో ప్రభుత్వం ఇచ్చిన వసతిని ఉపయోగించుకున్న అభ్యర్థి (ఎ) అద్దె, (బి) విద్యుత్ బిల్లు, (సీ) నీటి రుసుం, (డి) టెలిఫోన్ ఛార్జీల విషయంలో బకాయిలు లేవని తెలిపే ధ్రువపత్రాన్ని సమర్పించాలి. వీటి విషయంలో అభ్యర్థులేవరైనా సంప్రదించనట్లయితే ధ్రువీకరణ పత్రాన్ని అందించాలని ప్రభుత్వ సంస్థలు, అధికారులు, విభాగాలను ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 03.05.2024 నాటి లేఖ నం. 3/ఈఆర్/2023/ఎస్‌డీఆర్/వ్యాల్యూమ్.IVలో దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఇది ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
అనుబంధం-I
ఉప ఎన్నిక షెడ్యూల్
పోలింగ్ ఘట్టాలు
|
తేదీ, రోజు
|
తేదీ, రోజు
|
తేదీ, రోజు
|
జమ్మూ, కాశ్మీర్- ఒడిశా అసెంబ్లీ నియోగకవర్గం(లు)
|
జార్ఖండ్, మిజోరం, పంజాబ్, తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాలు
|
రాజస్థాన్ అసెంబ్లీ నియోజకవర్గం
|
గెజిట్ నోటిఫికేషన్ జారీ తేదీ
|
13.10.2025
(సోమవారం)
|
13.10.2025
(సోమవారం)
|
13.10.2025
(సోమవారం)
|
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
|
20.10.2025
(సోమవారం)
|
21.10.2025
(మంగళవారం)
|
21.10.2025
(మంగళవారం)
|
నామినేషన్ల పరిశీలన తేదీ
|
22.10.2025
(బుధవారం)
|
22.10.2025
(బుధవారం)
|
23.10.2025
(గురువారం)
|
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
|
24.10.2025
(శుక్రవారం)
|
24.10.2025
(శుక్రవారం)
|
27.10.2025
(సోమవారం)
|
పోలింగ్ తేదీ
|
11.11.2025
(మంగళవారం)
|
ఓట్ల లెక్కింపు తేదీ
|
14.11.2025 (శుక్రవారం)
|
ఎన్నికలు పూర్తి చేసేందుకు చివరి తేదీ
|
16.11.2025 (ఆదివారం)
|
(Release ID: 2175848)
Visitor Counter : 10