పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
పండుగ సీజన్ రద్దీకి ముందే విమాన ఛార్జీల తీరును సమీక్షించిన డీజీసీఏ
అదనపు విమానాల ద్వారా ప్రయాణ సామర్థ్యాలను పెంచుకోవాలని విమానయాన సంస్థలను కోరిన డీజీసీఏ
Posted On:
05 OCT 2025 4:32PM by PIB Hyderabad
విమాన ఛార్జీలను పర్యవేక్షించాలని, ముఖ్యంగా పండుగ సీజన్‌లో ధరల పెరిగినట్లయితే తగిన చర్యలు తీసుకోవాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌ను (DGCA) పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎంఓసీఏ) ఆదేశించింది.
దీనికి అనుగుణంగా డీజీసీఏ.. పండుగ సీజన్‌కు ముందే ఈ విషయాన్ని విమానయాన సంస్థలతో చర్చించింది. పండుగ సీజన్ అధిక డిమాండ్‌ను తీర్చేందుకు అదనపు విమానాలను మోహరించటం ద్వారా ప్రయాణ సామర్థ్యాన్ని పెంచాలని ఆయా సంస్థలను కోరింది.
విమానయాన సంస్థలు అదనపు విమానాలను నడపనున్నట్లు తెలియజేశాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:
1. ఇండిగో: 42 సెక్టార్లలో సుమారు 730 అదనపు విమానాల ఏర్పాటు.
2. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్: 20 సెక్టార్లలో అదనంగా సుమారు 486 విమానాల ఏర్పాటు
3. స్పైస్‌జెట్: 38 సెక్టార్లలో సుమారు 546 అదనపు విమానాల ఏర్పాటు.
పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ పండుగ సీజన్‌లో ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడేందుకు విమాన ఛార్జీలు, విమాన సామర్థ్యాలను చాలా నిశితంగా పర్యవేక్షిస్తుంది.
***
(Release ID: 2175162)
Visitor Counter : 2