ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్ దారులకు కరవు భత్యాన్నీ, భృతినీ మూడు శాతం పెంచే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం

प्रविष्टि तिथि: 01 OCT 2025 3:12PM by PIB Hyderabad

ధరల పెరుగుదలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డిఎ), పింఛనుదారులకు కరువు భృతి (డిఆర్)ని ప్రస్తుతమున్న 55% రేటుకు మరో 3% పెంపును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 01.07.2025 నుంచి  దీనిని అమలు చేస్తారు.

కరువు భత్యంకరువు భృతి.. రెండింటి పెంపు వల్ల ఖజానాపై ఏటా రూ.10083.96 కోట్ల మేర అదనపు భారం పడుతుందిఈ పెంపు వల్ల సుమారు 49.19 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.72 లక్షల మంది పింఛనుదారులు లబ్ధి పొందుతారు.

ఏడో కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఆమోదించిన ఫార్ములా ప్రకారం డిఎడిఆర్ లను పెంచారు

 

***


(रिलीज़ आईडी: 2173859) आगंतुक पटल : 258
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam