శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బయోమెడికల్ రిసర్చ్ కెరియర్ ప్రోగ్రామ్ (బీఆర్‌సీపీ) మూడో దశకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 01 OCT 2025 3:29PM by PIB Hyderabad

బయోమెడికల్ రిసర్చ్ కెరియర్ ప్రోగ్రామ్ (బీఆర్‌సీపీమూడో దశను కొనసాగించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందిఈ కార్యక్రమాన్ని మూడో దశ (2025-26 నుంచి 2030-31 వరకు), అలాగే తరువాతి ఆరు సంవత్సరాల వరకు (2031-32 నుంచి 2037-38 వరకుబయోటెక్నాలజీ  విభాగం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ.. డీబీటీ), బ్రిటన్ కు చెందిన వెల్‌కం ట్రస్ట్ (డబ్ల్యూటీ)లతో పాటు ఎస్‌పీవీఇండియా అలయన్స్‌ల మధ్య భాగస్వామ్యంతో అమలు చేస్తున్నారురూ.1500 కోట్ల మొత్తం వ్యయంతో 2030-31 వరకు అనుమతించిన ఫెలోషిప్గ్రాంట్లను మంజూరు చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశందీనిలో రూ.1,000 కోట్లను డీబీటీరూ.500 కోట్లను యూకేకు చెందిన డబ్ల్యూటీ సమకూరుస్తాయి.  
నైపుణ్యాలనూనవకల్పననూ ప్రోత్సహించాలన్న వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బయోమెడికల్ రిసర్చ్ కెరియర్ ప్రోగ్రామ్ (బీఆర్‌సీపీ)లో మూడో దశను బయోటెక్నాలజీ  విభాగం మొదలుపెట్టిందిఈ కార్యక్రమం అత్యాధునిక బయోమెడికల్ రిసర్చ్ కృషిలో అగ్రగామి శాస్త్రవేత్తలకు తోడ్పడుతుందినవకల్పనను ట్రాన్స్‌లేషనల్ ఇన్నొవేషన్ నిమిత్తం వివిధ  విషయాల్లో పరిశోధనలు నిర్వహించేలా ప్రోత్సాహాన్ని అందిస్తుందిఇది అంతర్జాతీయంగా ప్రభావాన్ని చూపే ప్రపంచ స్థాయి బయోమెడికల్ పరిశోధనా సామర్థ్యాన్ని అభివృద్ధిపరచడానికి గాను అధిక నాణ్యత కలిగిన పరిశోధనలకు సాయపడే వ్యవస్థలను కూడా బలోపేతం చేయడంతో పాటుబయోమెడికల్ రిసర్చ్‌లో ప్రాంతీయ అసమానతలను తగ్గిస్తుంది.

యూకేకు చెందిన వెల్‌కం ట్రస్టుతో డీబీటీ భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకొని 2008-2009లో బయోమెడికల్ రిసర్చ్ కెరియర్ ప్రోగ్రామ్ (బీఆర్‌సీపీ)ని ప్రారంభించిందిదీనికోసం డీబీటీవెల్‌కం ట్రస్ట్ ఇండియా అలయన్స్ పేరుతో ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్‌పీవీ)ని ఏర్పాటు చేశారుఇది బయోమెడికల్ రిసర్చ్‌లో ప్రపంచ శ్రేణి ప్రమాణాలను అందుకోవాలన్న లక్ష్యంతోభారత్‌లోనే రిసర్చ్ ఫెలోషిప్పులను అందిస్తోందిదీని తరువాతవిస్తారిత పోర్ట్‌ఫోలియోతో రెండో దశను 2018, 19లో అమలు చేశారు.
మూడో దశలోఈ కింద పేర్కొన్న కార్యక్రమాలను అమలు చేయాలని ప్రతిపాదించారు: i.) మౌలికరోగ చికిత్సలకు సంబంధించిన (క్లినికల్), ప్రజారోగ్యం పరంగా ప్రారంభ కెరియర్మధ్య స్థాయి రిసర్చ్ ఫెలోషిప్పులుఇవి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించినవీఒక శాస్త్రవేత్తకు పరిశోధన ప్రధాన కెరియర్లో మొదటి  దశలకు ఉద్దేశించినవీ. ii.) సహకార ప్రధాన గ్రాంట్ల కార్యక్రమంభారత్‌లో పటిష్ఠ పరిశోధన ట్రాక్ రికార్డు కలిగి ఉన్న ప్రారంభమధ్య స్థాయి సీనియర్ స్థాయి కెరియర్ పరిశోధకుల కోసం ఉద్దేశించిన రెండుమూడు పరిశోధక బృందాలకు కెరియర్ డెవలప్‌మెంట్ గ్రాంట్లుకెటలిటిక్ కొలాబరేటివ్ గ్రాంట్లను అందించడం ఈ కార్యక్రమంలో భాగం. iii) ముఖ్య పరిశోధన ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన రిసర్చ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్మూడో దశలో మెంటార్‌షిప్పునెట్‌వర్కింగ్ప్రజలను భాగస్వాములను చేయడం.. వీటిని బలపరచడంతో పాటు కొత్తనవోన్మేష జాతీయఅంతర్జాతీయ భాగస్వామ్యాలను అభివృద్ధిపరుచుకోవడంపై కూడా దృష్టి పెడతారు.

రిసర్చ్ ఫెలోషిప్పులుసహకార ప్రాతిపదిక కలిగిన గ్రాంట్లురిసర్చ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం... ఇవి అన్నీ కలిసి విజ్ఞాన శాస్త్ర పరమైన ఎక్స్‌లెన్సునూనైపుణ్యాభివృద్ధినీసహకారాన్నీజ్ఞానాన్ని మార్పిడి చేసుకోవడాన్నీ పెంపొందిస్తాయిదీనివల్ల లభిస్తాయనుకుంటున్న ఫలితాల్లో.. 2,000 కన్నా ఎక్కువ మంది విద్యార్థులుపోస్ట్ డాక్టరల్ ఫెలో శిక్షణ కార్యక్రమంఅధిక ప్రభావాన్ని చూపగలిగే ప్రచురణలను  సిద్ధం చేయడంపేటెంట్ అర్హతను పొందగలిగే ఆవిష్కారాలకు ఊతాన్నివ్వడంసమకాలిక పక్షాల్లో గుర్తింపును తెచ్చుకోవడంమహిళలకు అందించే సహాయాన్ని10-15 శాతం మేర పెంచడం, 25 నుంచి 30 శాతం సహకారాత్మక కార్యక్రమాలను టీఆర్ఎల్4, అంతకన్నా ఎక్కువ స్థాయికి చేర్చడంటైర్-2,3 సెట్టింగులో కార్యకలాపాలనూఅనుబంధాన్నీ విస్తరించడం వంటివి భాగంగా ఉన్నాయి.

ఒకటో దశ, రెండో దశలు భారత్‌ను అంతర్జాతీయ స్థాయి కలిగిన బయోమెడికల్ సైన్సుకు సరికొత్త కూడలిగా నిలిపాయివిజ్ఞానశాస్త్రంలో భారత్ పెట్టుబడులను పెంచుతుండడంతోనూప్రపంచ జ్ఞాన ప్రధాన ఆర్థిక వ్యవస్థలో భారత్ పాత్ర అంతకంతకూ పెరుగుతుండడంతోనూ వ్యూహాత్మక ప్రయత్నాల్లో ఒక  కొత్త దశను ఆవిష్కరించాల్సిన అవసరం ఏర్పడిందిఒకటోరెండో దశలతో లభించిన ప్రయోజనాలను స్ఫూర్తిగా తీసుకొనిమూడో దశ ఇక జాతీయ ప్రాధాన్యాలతో పాటు ప్రపంచ ప్రమాణాలకు కూడా తులతూగే ప్రతిభావంతులకు అండదండలను అందించడంసామర్థ్య సాధనరూపాంతరణ (ట్రాన్స్‌లేషన్ప్రక్రియలపై దృష్టి సారించనుంది. 

 

***


(Release ID: 2173773) Visitor Counter : 2