ప్రధాన మంత్రి కార్యాలయం
తమిళనాడులోని చెన్నైలో ఓ భవనం కూలి ప్రాణ నష్టం.. సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
30 SEP 2025 9:48PM by PIB Hyderabad
తమిళనాడులోని చెన్నైలో ఓ భవనం కూలిన ఘటన ప్రాణనష్టానికి దారి తీయడంతో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం అందజేస్తామని ప్రధానమంత్రి ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరిచింది:
‘‘తమిళనాడులోని చెన్నైలో ఓ భవనం కూలిపోవడం విచారకరం. బాధితులకు, వారి కుటుంబాలకు కలిగిన దు:ఖంలో నేను సైతం పాలుపంచుకుంటున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని అందజేస్తాం. గాయపడిన వారికి రూ.50,000 వంతున పరిహారంగా అందజేస్తాం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (@narendramodi)’’
(रिलीज़ आईडी: 2173535)
आगंतुक पटल : 27
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam